Wednesday, 16 September 2020

జ్యోతిష పాఠములు -3 జన్మ నక్షత్రం మరియు నక్షత్ర పాదాన్ని ఎలా లెక్కించాలి?

 


 ఈ పాఠములో నక్షత్రపాదం లెక్కించటమెలాగో తెలుసుకుందాము. 

ప్రతి నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించబడింది. 

27 నక్షత్రాలు 108 పాదాలుగా రాశిచక్రములో విభజింపబడ్డాయి. 

ఒక్కో పాదానికి ఒక్కో అక్షరం ఇవ్వబడింది. 

ముందుగానక్షత్ర పాదాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. 

.ఉదా:- ఒక వ్యక్తి 08-04-2008 రోజున ఉదయం 10గంటలకు జన్మించాడనుకోండి. ఆరోజు పిడపర్తివారి పంచాంగానుసారం హస్తా నక్షత్రం సాయంత్రం 06గంటల39నిమిషాల వరకు ఉన్నది. గడిచిన రోజు రాత్రి 8 గంటల నాలుగు నిమిషాలకు ఆరంభమయ్యింది. నక్షత్రం ఆరంభమునుంచి అంత్యము వరకు గల సమయాన్ని లెక్కించండి. ఇవ్వబడిన నక్షత్ర ఆద్యంత సమయము 22 గంటల 35 నిమిషములు. దీనినే రుక్షాద్యంతము అని అంటారు.(రుక్షము అంటే నక్షత్రము అని అర్థము).ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు. ఈ నాలుగు పాదాలు గడవటానికి పట్టిన సమయం 22గంటల 35 నిమిషాలు అయినప్పుడు ఒక పాదం గడవటానికి ఎంత సమయం అవుతుంది. ( 22 60 ్శ 35 / 4 ్స ? ) దాదాపు 5 గంటల 39 నిమిషాలు.నక్షత్ర ఆరంభ సమయం నుంచి జన్మ సమయం వరకు అయిన సమయాన్ని లెక్కించండి. 13 గంటల 56 నిమిషములు. దీనిలో రెండుపాదాల సమయం అంటే 11 గంటల 18 నిమిషాలు గడిచిపోగా ఇంకా 2గంటల 38 నిమిషాలు శేషం మిగిలిఉన్నది. అంటే జాతకుని జన్మ సమయానికి హస్తానక్షత్రము రెండు పాదాలు గడిచి మూడవపాదం నడుస్తున్నది. అంటే జాతకుడు హస్తానక్షత్రం 3వ పాదములో జన్మించాడని తెలుస్తున్నది.మళ్ళీ ఒకసారి గమనిస్తే ముందుగా జాతకుడు జన్మించిన నాటి నక్షత్ర ఆద్యంతాలను తీసుకొండి. దానిని 4చే భాగించండి. జాతకుడు జన్మిచిన సమయానికి ఎన్ని పాదాలు కొట్టుడుపోతున్నాయో గమనించండి. శేషం ఏ పాదములో పడుతున్నదో గమనించండి.అదే ఆ జాతకుని జన్మ నక్షత్రపాదం. 


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

1 comment:

  1. na website onlinejyotish.com nunchi copy chesi kanisam website peru kuda mention cheyakunda permission teesukokunda post cheyatam copyright act prakaram neram avutundi, ee post remove cheyandi leda credits mention cheyandi.

    ReplyDelete