Tuesday, 22 September 2020

ధర్మసందేహాలు -ఆలస్య వివాహానికి జ్యోతిష్య పరమైన కారణాలు ఏమిటి?

 



ఆలస్య వివాహానికి జాతక పరంగా కొన్ని గ్రహాల అనుకూలతలు లేకపోవటం వలన కూడా ఆలస్య వివాహాలు జరుగుతున్నాయి. ఆలస్య వివాహానికి జాతక ప్రభావం ఒక్కటే కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్ధితులు అనుకూలించక పోవటం వలన కూడా కొంతమందికి వివాహాం ఆలస్యమవుతుంది. ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలను పరిశీలిద్దాం.

జాతకంలో వివాహ స్ధానం సప్తమ స్ధానం. సహజ వివాహా కారకుడు శుక్రుడు, స్త్రీలకు గురువుని చూడాలి. సప్తమ భావానికి బావాత్ భావం అయిన లగ్నాన్ని కూడా పరిశీలించాలి. అపోహలకి కారకుడైన రాహువుని, చంచలత్వానికి కారకుడైన చంద్రగ్రహాన్ని పరిశీలించాలి. పంచమ స్ధానం ప్రేమ వివాహనికి కారణం కావున ఆ స్ధానాన్ని పరిశీలించాలి. కుజ, శుక్ర గ్రహాలను పరిశీలించాలి.

లగ్న స్ధానం- సప్తమానికి భావాత్ భావం

సప్తమ స్ధానం – భార్య, భర్తల గుణగణాల కోసం.

చతుర్ధ స్దానం – సుఖాల కోసం.

వ్యయ స్ధానం – శయ్యా సుఖం కోసం.

ద్వితీయ స్ధానం – కుటుంబ అభివృద్ధి కోసం .

పంచమ స్ధానం – సంతానం కోసం .

నవమ స్ధానం – సత్ సంతానం కోసం.

లాభస్ధానం – దర్మ, అర్ధ, కామ, మోక్ష స్ధానాలలో కామ స్ధానం, వివాహానంతర ప్రేమాభిమానాలకు.

షష్టమ స్ధానం – గొడవలు, కోర్టు సమస్యలు, ఎడబాటు( ఉద్యోగ పరంగా, విద్యాపరంగా దూరంగా ఉండటం కూడా కావచ్చు)

అష్టమ స్ధానం – కష్ట, నష్టాల కోసం ఆయా స్ధానాలను వివాహానికి పరిశీలించాలి.

1. శని రాహువులు సప్తమభావంలో ఉంటే ఆలస్య వివాహం అవుతుంది. వర్ణాంతర వివాహాం జరిగే అవకాశాలు ఉండవచ్చు.

2. సప్తమ భావంలో నెప్ట్యూన్ ఉన్న ఆలస్య వివాహం అవుతుంది.

3. శని, శుక్ర సంబందం వలన ఆలస్య వివాహం అవుతుంది.

4. లగ్నానికి కుజుడు అష్టమంలో శత్రు రాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది.

5. 2,7,11 భావాలపైన శని రాహువుల దృష్టి ఉండటం వలన కూడా వివాహం ఆలస్యం

అవుతుంది.

6. తులా లగ్నం అయి శుక్రుడు సప్తమ భావంలో ఉన్న ఆలస్య వివాహం అవుతుంది.

7. అష్టమంలో రాహువు ఉన్న కుటుంబ సమస్యల మూలంగా వివాహం ఆలస్యమవుతుంది.

8. 2,7,11 భావ అధిపతులకి 6,8,12 భావాధిపతులతో సంబందం ఏర్పడిన వివాహం ఆలస్యమవుతుంది.

9. సప్తమాధిపతి నీచలో ఉన్న, నవాంశలో సప్తమాదిపతి 6,8,12 భావాలలో ఉన్న వివాహం ఆలస్యమవుతుంది.

10. సప్తమాధిపతి శని,రాహు, కేతువులతో కలసి ఉన్న,షష్టాధిపతి, వ్యయాధిపతి సప్తమాన్ని చూస్తున్న, కుటుంబ స్ధానాన్ని చూస్తున్న, సప్తమంలో కుజుడు నీచలో ఉన్న, వివాహం ఆలస్యమవుతుంది.11. శని దశమ భావంలో ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. సప్తమంలో ఉన్న గ్రహం గాని, సప్తమాధిపతి గాని వక్రించటం వలన వివాహం ఆలస్యం కావటం కాని, వివాహం పట్ల విముఖత చూపటం కాని చేస్తారు.


12. కర్కాటక, సింహలగ్నం వాళ్ళకు సప్తమాధిపతి శని కావటం వలన వివాహం ఆలస్యం కావటం లేదా వివాహం అయిన తరువాత చిన్న చిన్న మనస్పర్ధలు రావటం జరుగుతాయి.

13. గ్రహాలన్నీ రాహుకేతువుల మద్య ఉన్నాయని, కుజదోషం ఉన్నదని, నాగదోషం ఉన్నదని అపోహలతో మిగతా జాతకాన్ని పరిశీలించక మంచి జాతకం కాదనే ముద్ర పడటం వలన కూడా వివాహం ఆలస్య మవుతుంది.

ఇన్ని జ్యోతిష్య సూత్రాలను పరిశీలించి వివాహం చేయాలంటే అది కాని పని. కొంతవరకు అయిన ముఖ్యమైన విషయాలను పరిశీలించి మిగిలిన వాటికి శాంతి ప్రక్రియలను చేసుకుంటే మంచిది. జాతకం బాగాలేదని అబ్బాయిది గాని, అమ్మాయిది గాని జాతక చక్రాలను మార్చటం లేదా వారి పేర్లను మార్చటం వలన వారి జాతకంలో భగవంతుడు వ్రాసిన కర్మ ప్రభావాన్ని మార్చలేరు. వివాహానికి జాతకచక్రం లేకపోయిన వారి కుటుంబ సభ్యుల పరిస్ధితులు, చేసుకోబోయే వారు పెరిగిన వాతావరణ పరిస్ధితులను అంచనా వేసుకొని వివాహం విషయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలిఎంతమంచిగా జాతకాలు చూసి చేసుకున్న కొన్ని పరిస్ధితుల వలన వివాహా వ్యవస్ధలో కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. కర్మ బలమైనది, తప్పించటం ఎవరి వల్ల కాదు.

గమనిక :- ఈ వ్యాసం కేవలం జ్యోతిష్య అవగాహన కోసమేనని ఎవరిని భాద పెట్టాలనే ఉద్దేశం కాని, భయపెట్టాలనే ఉద్దేశం కాని లేదు. వివాహా ఆలస్యానికి కేవలం పైన తెలిపిన కారణాలు మాత్రమే కాదు కుటుంబ వాతావరణ పరిస్ధితులు అనుకూలించక పోవటం కూడా కావచ్చు. వివాహా ఆలస్యానికి జాతకాలలో పై సూత్రాలను మాత్రమే పరిశీలించి మిగతా వాటిని పరిశీలించక అపోహలకు గురికావద్దని మనవి. కొన్ని రకాల శాంతి ప్రక్రియలను చేసుకోవటం వలన తప్పకుండా వివాహ ఆలస్యాన్ని నివారంచవచ్చు.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)


శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371











1 comment:

  1. ఈ పోస్టు నేను రాసింది మీరు కాపి చేసి వేసుకొన్నారు అది ఇబ్బంది కాదు .... కనీసం న పేరు లేకుండా తీసి వేశారు వెంటనే నా పేరు పెట్టండి. చింతా గోపి శర్మ సిద్ధాంతి 

    ReplyDelete