Friday, 25 September 2020

ధర్మసందేహాలు - శనిదేవుడు ఎలా శాంతిస్తాడు ?


ప్రశ్న అడిగిన వారు : మహేష్, నిజామబాద్

జీవితం ఆనందంగా .. హాయిగా సాగిపోవాలనే అంతా కోరుకుంటారు. కష్టాలు .. నష్టాలు ఎదురవుతాయని తెలిస్తే ఆందోళన చెందుతారు. శనిగ్రహ దోషం వలన అనేక బాధలు పడవలసి వస్తుంది కనుక, ఆయన పేరు వింటేనే భయపడిపోతుంటారు. ఇక శనిదోషం వల్లనే తాము కొన్ని ఇబ్బందులు పడుతున్నట్టు తెలియగానే, సాధ్యమైనంత తొందరగా వాటి నుంచి బయటపడటానికి తమకి తెలిసిన ప్రయత్నాలు చేస్తుంటారు.
శనిదోషం వలన కలిగే ప్రతికూల ఫలితాల నుంచి .. వాటి ప్రభావ తీవ్రత తగ్గడానికి అనేక మార్గాలు చెప్పబడుతున్నాయి. శనిదోషం బారిన పడిన వాళ్లలో వ్యసనపరులు ఉన్నట్టయితే, వాటిని మానుకోవడం ఒక మార్గంగా సూచించడం జరుగుతోంది. మద్యం తాగడం .. జూదం ఆడటం .. అవినీతికీ మోసాలకి పాల్పడటం .. అసత్యాలాడటం .. పెద్దలపట్ల అహంభావంతో ప్రవర్తించడం .. దైవకార్యాలకీ .. ధర్మకార్యాలకి దూరంగా వుండటం వలన శని దోష ప్రభావం వలన కలిగే తీవ్రత ఎక్కువగా వుంటుంది.
అందువలన ఈ రకమైన ప్రవర్తన కలిగిన వారు వెంటనే తమ తీరును మార్చుకోవడం వలన ఫలితం కనిపిస్తుంది. శనిదేవుడికి పూజాభిషేకాలు జరపడం .. సూర్యుడిని ఆరాధించడం .. ఆంజనేయస్వామిని పూజించడం, గుడ్డి వారిని, వికలాంగులను సేవించడం, వారికి కావలసినవి చూడడం, కాకులకి ఆహారం పెట్టడం,నరుపు,నీలం రంగు వస్తువులు దానం ఇవ్వడం, బీద వారికి తోలు చెప్పులు కొని ఇవ్వడం, ఇతల తోలు వస్తువులు తెలిసిన వారికి గిఫ్ట్ ఇవ్వడం, తమ దగ్గర పని చేసే పనివారికి ఆదరంగా చూసుకోవడం వలన శనిదేవుడు శాంతిస్తాడు .. దాంతో ఈ దోష ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది.


సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment