Thursday 17 September 2020

జ్యోతిష పాఠములు -4 - జన్మనామం అంటే ఏమిటి? ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు వస్తాయి?

 







 సామాన్యులు సైతం తమ రాశి నక్షత్రాలను మరిచిపోకుండా ఉండే విధంగా  జ్యోతిష శాస్త్రజ్ఞులు ఆయా నక్షత్ర పాదాలు ఏ ఏ అక్షరాలను ప్రభావితం చేస్తాయో వాటికి అనుగుణంగా ప్రతి నక్షత్ర పాదానికి ఒక అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నక్షత్రములో ఆ పాదములో జన్మించిన వ్యక్తులు ఆ నక్షత్రపాదానికి సూచించబడిన అక్షరముతో ఆరంభమయ్యే పేరును తమ జన్మ నామముగా పెట్టుకునే విధానాన్ని మన ప్రాచీనులు ఏర్పాటు చేశారు. జన్మనామాక్షరాలకు సంబంధించి పూర్తివివరాలను లఘు బ్రహ్మయామిళ గ్రంథములో పొందపరిచారు.పిల్లలకు పేర్లు నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టటానికి అక్షరాలు జన్మ నక్షత్రాల ఆధారంగా పేర్లను నిర్ణయించడం జనన సమయంలో ఏ నక్షత్రం వున్నదో, ఆ నక్షత్రంలో ఎన్నో పాదం నడుస్తున్నదో చూసి ఆ పాదానికి సూచించిన సంకేతాక్షరం ముందు వచ్చే విధంగా చిన్నారు పేర్లను నిర్ణయించడం శుభప్రదం.


మీ జన్మనక్షత్రముద్వారా మీ జన్మ నామాన్ని తెలుసుకునే విధంగా నక్షత్రాలు వాటికి సూచించబడిన అక్షరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.



అశ్విని - చు, చే, చో, లా


భరణి - లీ, లూ, లే, లో


కృత్తిక - ఆ, ఈ, ఊ, ఏ


రోహిణి - ఓ, వా, వీ, వు


మృగశిర - వే, వో, కా, కీ


ఆరుద్ర - కూ, ఘ, జ్ఞ, ఛ


పునర్వసు - కే, కో, హా, హీ


పుష్యమి - హూ, హే, హో, డ


ఆశ్రేషా - డీ, డూ, డే, డో


మఖ - మా, మీ, మూ, మే


పుబ్బ - మో, టా, టీ, టూ


ఉత్తర - టే, టో, పా, పీ


హస్త - పూ, షం , ణా, ఠా


చిత్త - పే, పో, రా, రీ


స్వాతి - రూ, రే, రో, తా


విశాఖ - తీ, తూ, తే, తో,


అనురాధ - నా, నీ, నూ, నే


జ్యేష్ఠ - నో, యా, యీ, యూ


మూల - యే, యో, బా, బీ


పూర్వాషాఢ - బూ, ధా, ఫా, ఢ


ఉత్తరాషాఢ - బే, బో, జా, జీ


శ్రవణం - జూ, జే, జో, ఖ


ధనిష్టా - గా, గీ, గూ, గే


శతభిషం - గో, సా, సీ, సూ


పూర్వాభాద్ర - సే, సో, దా, దీ


ఉత్తరాభాద్ర - దూ, శ్యం , ఝ, థ


రేవతి - దే, దో, చా, చీ


ఉదాహరణకు మీరు చిత్త నక్షత్రం రెండవ పాదములో జన్మించారనుకోండి చిత్తా నక్షత్రానికి ఇవ్వబడిన అక్షరాలు పే, పో, రా, రీ మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం పే అక్షరముతో ప్రారంభమవుతుంది. పెద్దమ్మ,పెద్దయ్య చిత్త నక్షత్రము మొదటి పాదములో జన్మించిన వారి జన్మనామం అవుతుంది. అలాగే రెండో పాదములో పుట్టిన వారి జన్మనామం పోలేరమ్మ, పోచమ్మ అవుతుంది. ఈ విధంగా ఆయా నక్షత్ర పాదాలలో జన్మించిన వారికి ఆయా జన్మనామాలు ఏర్పడతాయి.పేరు మొదట్లో ద్వంద్వాక్షరం వచ్చినట్లయితే మొదటి అక్షరమును విడిచి రెండవదానినే జన్మనామాక్షరముగా గ్రహించ వలెను.ఉదా: చ్వియధ అనే పేరులో చ తర్వాత వచ్చే వను జన్మ నామాక్షరముగా తీసుకోవాలి.కృష్ణుడు - మృగశిర మూడవ పాదము, హృష్ణుడు స్వాతి మొదటి పాదము, బాల మాల మూడవపాద౦ ,శ్రీధరుడు చిత్తా నాలుగవ పాదము, యోగిని మాల రెండవ పాదం ,క్షేత్ర పాలుడు హస్తా రెండవ పాదము, మహేష్ మఖ మొదటి పాదం  ఈ విధముగా జన్మ నామాలకు నక్షత్రాలను తెలుసుకోవాలి.



సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371







No comments:

Post a Comment