Wednesday 23 September 2020

ధర్మసందేహాలు -వాస్తుదోషం నరదృష్టి లోపాలు పోవాలంటే ఏం చేయాలి..?

 


ప్రశ్న అడిగిన వారు : లక్ష్మి ప్రియ ,నెల్లూరు.

నరదృష్టి మరియు వాస్తు దోషం సాధారణంగా ఎక్కువమంది ఎదుర్కొనే సమస్యలు దీనికి అనేక రకాలైన నివారణ మార్గాలు మన పెద్దలు చెబుతుంటారు. అవి ఏమిటో చూద్దాం.

నరదృష్టి లోపాలు పోవాలంటే.

నరదృష్టి నివారణకు  ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో రోజు పూజ చేయడం. ప్రధాన గుమ్మం పైన లోపలివైపు ఏర్పాటు చేసుకోవాలి. 

ఇంకో చిట్కా ఏమిటంటే కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది గడపకు ఇరువైపులా పెడితే మంచిది. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే నరదృష్టి లోపాలుండవు.

ఇండ్లల్లో, వ్యాపార సంస్థలలో ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. 

పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం అభివృద్ధి కలుగుతుంది. 

ఋణబాధలుంటే.. వినాయకస్వామి ఆలయంలో గరికతో పూజ చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. 

వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి.

వాస్తు దోషం పోవాలంటే

అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడటం, అవమానాలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. 

అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించడం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి వస్తాయి. 

వాస్తు దోష నివారణకు ఆయా ఇంటిని అనుభవజ్ఞులైన స్సిన్తిఫిక్ వాస్తు పండితులకు చూపించి కూలగోట్టడం లేకుండా చిన్న చిన్న అదృష్ట వస్తువులను వుంచి చిన్న మార్పులతో ,జాతక పరంగా ఎలాంటి మార్పులు అవసరమో వాటినిబట్టి సరి చేసుకుని ఎన్నో ఇబ్బ౦దులనుండి బయట పడవచ్చు . 

సంవత్సరంలో ఒక్కసారైనా.. 

మహా సుదర్శన - లక్ష్మి నారసింహ హోమాన్ని కనీసం సంవత్సంలో ఒక్క సారైననూ ఇంట్లో, వ్యాపార స్థలములులో జరిపించు కోవడం ఉత్తమం. 

తద్వారా నరదృష్టి ప్రభావం నుండి వాస్తు దోషములు నుండి ఉపశమనం లభిస్తుంది. 

ప్రతి రోజు ఇంటి ప్రధాన గుమ్మం శుద్ధిగా కడిగి పసుపు గడపకు పూసి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. 

రోజు ఇంట్లో పూజా మందిరంలో దీప, దూప, నైవేద్యాలు పెడుతూ ఉండాలి.  సంవత్సరంలో ఒక్క సారి అయినా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకధ జరిపించు కోవాలి. ఇలా చేస్తే సర్వత్ర శుభకరంగా ఉంటుంది.

మరీ పెద్ద పెద్ద  వ్యాపార స్థలాలో , ఎవరికైనా ఎక్కువ నరఘోష ఉంది అనుకుంటే వారు మహా ప్రత్యన్గిర హోమాన్ని చేయ్యున్చుకోవడం మంచిది.

సూచన: 

ఎ పరిహారాలైన ,హోమాలు ,వ్రతాలు అయిన తెలిసి తెలియని వాళ్ళతో కాక ప్రత్యకంగా దీక్ష ఉపాసన కల వారితో అనుభవజ్ఞులైన వారితో చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రత్యన్గిర హోమ్మాన్ని ఉపాసకులతో మాత్రమె చేయించుకోవాలి.

ఐశ్వర్య కాళ పఠం కోసం, వ్రతాలు హోమాలు అనుభవజ్ఞులైన వారికోసం,స్సిన్తిఫిక్ వాస్తు సూచనల కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం.

సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


follow us :

plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)


శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment