Wednesday, 16 September 2020

ధర్మసందేహాలు - మహాలయ అమావాస్య రోజు పితృకర్మలు ఎవరు చేయాలి..? ఎందుకు చేయాలి.?



భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగావున్నది. క్రిస్టియన్స్ ఆల్ ఫాదర్స్ డే రోజున ఈ కార్యక్రమం చేస్తారు.. ఒక్కో సంవత్సరంలో ఒక్కో నెలలో, ఒక్కో రోజు వస్తుంది ఈ ఆల్ ఫాదర్స్ డే. అలాగే ముస్లిమ్స్ మొహరం పాటిస్తారు. హిందువులు తర్పణలు వదులుతారు. కొందరు పెద్దలకి బియ్యమిస్తారు.


ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి, వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది. లేకపోతే రౌరవాది నరకాలకి పోతారంటారు. ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి, తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా సంస్మరిస్తారు అంటే తండ్రి, తాత (తండ్రి తండ్రి), ముత్తాత (తాత తండ్రి), అలాగే తల్లి, నానమ్మ (తల్లి అత్తగారు), ఆవిడ అత్తగారు.


మహాలయ పక్షం సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమై అక్టోబర్ నాలుగో తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఇది సరిగ్గా తెలుగు వారి కాలమానం ప్రకారం భాద్రపద మాసం క్రుష్ట పక్షం రోజున వస్తుంది. ఈ పర్వదినం రోజున శివున్ని భక్తిశ్రద్దలతో కొలుస్తారు, ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొదుతారాని నమ్మకం ఉంది. అంతే కాదు భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమావాస్య ఈ సారి రెండు రోజులు ఉంటుంది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృ పక్షాలు నిర్వహిస్తారు.


ఇంకా ఈ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి శాస్త్రాల్లో వివరించారు ప్రత్యామ్నాయాలతోసహా. వారి వారి ఆచారాలూ, పధ్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించటం ఉత్కృష్టం. ఆ రోజు పెద్దలకు తర్పణలు వదలాలి. వారిని తలచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. వీలుకానివారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవటానికి సరిపడే అన్ని వస్తువులూ, బియ్యం, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్నీ పెద్దల పేరు తలచుకుంటూ ఉచితమైన వ్యక్తులకి ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలదీ దాన ధర్మాలు చెయ్యాలి. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, " నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి' అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు.


బాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.
తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య నైనా చేసి తీరాలి. దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది.


ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ''కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది''అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

ఈ మహాలయ అమాస్య శనివారం వస్తే మరీ మంచిది, ఈ రోజున చాలా పవిత్రమైన దినంగా భావించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజున శని దేవుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అంతే కాదు ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు: ఈ అమావాస్య రోజుే పుణ్య క్షేత్రాలు దర్శించి పవిత్ర స్నానాలు చేసి యాగాలు చేసి ఉపవాసం ఉంటే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.





విష్ణువు : ఈ అమాస్య నాడు విష్ణుమూర్తి ఆరాధిస్తే మానసిక ప్రశాంతత , శారీరక ఆరోగ్యం, ఆర్ధికంగా మెరుగైన ఫలితాలు కలుగుతాయి.

శివుడు: ఈ రోజున శివుణ్ను పూజిస్తే సకల పాపాలు తొలగి అద్రుష్టం, సంపద, ఐశ్వర్యం ఆర్థకంగా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. నీళ్ళు: మీకు ఉన్న అన్ని దోషాలు పోవాలంటే చనిపోయిన పూర్వీకులకు నీటిని ప్రసాధించాలి.

పూజలు: ఈ రోజున కుటుంబ సభ్యులకు పూజలు చేయడం ద్వార వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వారికోసం ఉపవాసం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందని నమ్మకం. పవిత్రస్నానాలు : ఈ అమావాస్య నాడు పవిత్ర స్నానాలు చేయడంతో పాటుగా దానాలు, పితృపక్షాలు చేస్తే శుభం కలుగుతుంది.



సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment