Thursday 24 September 2020

జ్యోతిష పాఠములు 11- గ్రహ లింగములు, జాతులు,గ్రహ గుణములు,గ్రహదిశలు,గ్రహ బుుతు ఆధిపత్యము,గ్రహ రుచులు, గ్రహ స్థితులు ,గ్రహ ధాతువులు:




గ్రహ లింగములు : 

పురుష గ్రహములు :: రవి, కుజ, గురువులు . 

స్త్రీ గ్రహములు :: చంద్ర శుక్ర, రాహువులు 

నపుంసక గ్రహములు :: శని, బుధ, కేతువులు


గ్రహజాతులు: 

బ్రాహ్మణులు :: గురు, శుక్రులు 

క్షత్రియులు :: రవి, కుజులు 

వైశ్యులు :: చంద్ర, బుధులు 

శూద్రుడు :: శని 

అంత్య జాతులు :: రాహు, కేతువులు


గ్రహ గుణములు: 

సత్వగుణము :: రవి, చంద్ర, గురువులు 

రజోగుణము :: బుధ, శుక్రులు 

తమోగుణము :: శని, కుజ, రాహు, కేతువులు


గ్రహదిశలు: 

తూర్పు :: రవి 

ఆగ్నేయం :: శుక్రుడు 

దక్షిణ :: కుజుడు 

నైబుుతి :: రాహువు 

పశ్చిమం ::శని 

వాయువ్యం :: చంద్రుడు 

ఉత్తరం :: బుధుడు 

ఈశాన్యం :: గురు, కేతువులు ఆధిపత్యం వహిస్తారు.


గ్రహ బుుతు ఆధిపత్యము: 

వసంత బుుతువు :: శుక్రుడు 

గ్రీష్మ బుుతువు :: కుజుడు 

వర్ష బుుతువు :: చంద్రుడు 

శరదృతువు :: బుధుడు 

హేమంత ఋతువు :: గురువు 

శిశిర ఋతువు :: శని ఆధిపత్యం వహిస్తారు.


గ్రహ రుచులు: 

కారము :: రవి

 ఉప్పు :: చంద్రుడు 

చేదు :: కుజుడు 

తీపి :: గురువు 

వగరు :: శని

 షడ్రసములు :: బుధుడు 

పులుపు :: శుక్రుడు కారకత్వం వహిస్తారు.

గ్రహ స్థితులు:

స్థిర గ్రహము :: రవి 

చరగ్రహము :: చంద్రుడు 

ఉగ్ర గ్రహము :: కుజుడు

మిశ్ర గ్రహము :: బుధుడు

మృదు గ్రహము :: గురువు 

లఘుగ్రహము :: శుక్రుడు

తీక్ష్ణగ్రహము. :: శని


గ్రహ ధాతువులు :

ఎముకలు :: సూర్యుడు 

రక్తము :: చంద్రుడు 

ఎముకలలో మజ్జ :: కుజుడు 

చర్మము :: బుధుడు 

మేథస్సు :: గురువు 

వీర్యము :: శుక్రుడు 

స్నాయువు :: శని కారకత్వం వహిస్తారు.



 సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment