రత్నాలు బుధగ్రహానికి చాలా ప్రీతికరమైనది. బుధగ్రహము పీత వర్ణము గలవాడు. భూతత్త్వ ప్రధానుడై ఘ్రూణేంద్రియమున కాధిపత్యము వహించుటవల్ల ఈ విశేషములు కల్గిన మకరతము బుధునుకి సంభంధించినదనడంలో ఎట్టిసందేహంలేదు. పచ్చ త్రిదోషములందలి కఫ దోషమును హరింపగలదు. పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణవాయువు సంకేతముగా గల్గియున్నది. ఇది స్త్రీజతికి సంభంధించినదని కొందరు, నపుంసక జాతికి చెందినదని కొందరు చెప్పుచున్నారు. బుధ గ్రహము మాత్రం నపుంసక గ్రహముగా జ్యోతిష్యశాస్త్రంళో వ్రాయబడినది. శరీరమునందలి సహస్రార చక్రమునకు ఈ మకరతమునకు కాంతివర్ణ సామిప్యములు గలవు. పచ్చను ధరించిన యెడల అందలి ఆకుపచ్చ కాంతులు శరీరము నందలి వివిధ నాడీమండలములపై సకల అనారోగ్యములను వారించి అనారోగ్యమును నివారించి ఆరోగ్యమును ప్రసాదించగలదు.
ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అను నక్షత్రములందు జన్మించిన వారు ఏ సమయములందైనను పచ్చలను ధరించవచ్చును మిగిలిన నక్షత్ర జాతకులలో రోహిణి, హస్త, శ్రవణ, నక్షత్రములు గలవారు మినహా మిగిలిన అన్ని నక్షత్రములవారు ఈ పచ్చలను ధరించుట వలన శుభఫలితాలను పొందగలుగుతారు. పచ్ఛలను ధరించుట వలన జనన సమయము నందలి జాతక గ్రహముల యొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశలు, గోచారము బాగుగా పరిశీలించి బుధగ్రహము దోషప్రదునిగా నున్న సమయములందు మాత్రమే పచ్ఛను ధరించిన యెడల గ్రహముల వల్ల సంభవించే అన్ని విధములైన అరిష్టములు హరించుకొనిపోయి శుభఫలితాలు కల్గును.
జన్మ సమయమున ఏర్పడిన జాతక చక్రము బుధగ్రహము 6-8-12 స్థానాధిపత్యములను పొందియుండుట ఆ స్థానాధిపతులతో కలసియుండుట, వారిచే చూడబడుట 6-8-12 స్థానమునందలి దోషప్రదము మరియు బుధుడు అష్టమ వ్యయాదిపత్యములు కలిగి , ద్వితీయ సప్తమ దశమ స్థానములందుండుట, యోగకారకుడై నీచ , శతృక్షేత్రములందుండుట, పాపగ్రహసహితుడై కేంద్రకోణ రాశులయందుండుట, పాపగ్రహ సహితుడై కేంద్ర కోణ రాశులయందుంచుట, షడ్వర్గ అష్టకవర్గ బలములను బుధుని దుష్టత్వము నధికము గావింపగలవు.
బుధుడు దుష్ట లక్షణముతో కూడియుండి అతని యొక్క మహర్దశగానీ అంతర్దశగానీ సంభవించినప్పుడు, లేక గోచారమునందు దుష్టస్థాన సంచారము కలిగిన కాలము, ఇతర రాజయోగ దశలయందు బుధుని అంతర్దశలు, విదశలు సంభవించిన కాలమునందు అనేక విధములైన కష్టనష్టములు ఆపదలు సంభవించగలవు. అట్టిచెడు సమయములందు ముఖ్యముగా కఫ పైత్య వికారములచే కలుగు వ్యాధులను, బుద్ధిబలము లోపించుట, వ్యాపారాటంకములు, వ్యాపార నష్టములు, కుటుంబకలహములు, దైవనింద వ్యవహార బాధలు, నరముల బలహీనత, విధ్యార్థులకు పరీక్షలలో అపజయము, అందున గణిత విభాగమునందు పురోభివృద్దిలోపించుట కృత్రిమ ప్రయోగాది బాధలు, మతి విభ్రమము, విడువనట్టి జ్వరభాధ, కామెర్లరోగము స్త్రీలకు సంభంధించిన వ్యాధులు కష్ట ప్రసవము మొదలగు అనేక విధములైన వ్యాధి బాధ దుఃఖములు కలుగుచుండగలవు.
పచ్చ ద్వారా కలిగే శుభయోగాలు :
శ్రేష్ఠమైన పచ్చలను ధరించిన యెడల, బుద్ధి జ్ఞానములు అభివృద్దినొందగలవు. విధ్యాజయము, పాండిత్యము, చక్కని వాక్కులు, జ్యోతిషశాస్త్రాభిరుచులు కలుగగలవు. మాటలు సరిగారాని వారికి, నత్తి మాటలుగలవారు ఈ పచ్చను ధరించిన వారి వాక్కులు సుస్పాష్టములై యుంటవి. తల్లివర్గీయులైన భంధువులతో గల స్పర్థలు అంతరించి వారివలన సహాయ సహకారములు పొందగలరు.
తాము చేయుచున్న వృత్తులలో కలిగే ఆటంకములు, అవాంతరములు తొలగిపోయి వారివారి వృత్తులు నిర్విఘ్నంగా కొనసాగ గలవు. కుటుంబములో సంభవించే గృహచ్ఛిద్రములు అంతరించి కుటుంబసౌఖ్యం లభిస్తుంది. వ్యాపార వ్యవహారములందేర్పడిన స్తబ్దత తొలగిపోయి వ్యాపార విజయము చేకూరును. దైవభక్తి జ్ఞానాభివృద్ది, సత్కార్యచరణ సమాజంలో గౌరవ ప్రతిపత్తులు ధన సంపద ఐశ్వర్యాభివృద్ది కల్గుటయే గాక, శరీరమునందు కలిగే అనేక విధములైన జ్వరాతిసార కామిలాది బాధలు నివారణ కాగలవు. బి.పి అధికంగానున్న వారికిది దివ్యౌషధము, మరియు ఈ రత్నము, అంతభ్రమణము, మూర్చరోగము, కంఠమునందలి వొణుకు, నాలుక యందలి దోషములు స్త్రీల యొక్క ఋతు సంభంధమైన వ్యాధులు నివారింపగలదు. ప్రసవవేదనజెందు స్త్రీలకు ఈ పచ్చను ధరింపజేసిన సుఖప్రసవము కాగలదు. వ్యాధి నివారణతో బాటు పరిపూర్ణ ఆరోగ్యమును కూడా ఈ పచ్చ ప్రసాదించగలదు.
పచ్చను ధరించే పద్దతి :
పచ్చలను దోష రహితమైనవిగా చూచుకొని ధరించాలి. ఉత్తమ మైన మరకతాలు సత్ఫలితాలను కలిగించగలవు. మరకత రత్నాన్ని బంగారంతో పొదగబడిన బాణాకారంగల ఉంగరంలో ఇమిడ్చి ధరించడం శాస్త్రీయము. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములు కలిగిన బుధవారంగానీ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములు గల శుక్రవారం నాడు గానీ బుధుని యొక్క హోరాకాలంలో వర్జ దుర్ముహుర్తములు లేకుండా బోడి రత్నమును (పచ్చను) ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరమును ఒక దినము ఆవు పంచకంనందు ఉంచి రెండవదినము పశుపు నీటియందు నిద్ర గావింపజేసి పంచామృతములచే శుద్దిచేసి పూజించాలి.
ధరించెడివారు తమకు తారాబలం చంద్రబలం కలిగిన శుభతిదులయందు, ఆది, బుధ, శుక్రవారములలో వృషభ, సింహ, కన్య, తులా లగ్నములుగల సమయమునందు ఉంగరము ధరించవలెను. ధారణకు ముందే శాస్త్రోత్తమముగా పూజలు జరిపి కుడి హస్తమునందుంచుకొని ఈ శాన్యదిశగా తిరిగి గురువుని, గణపతిని స్మరించి "ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం సౌమ్యాయ సౌః క్లీం ఐం బుధాయస్వాహా" అను మంత్రమును 108 సార్లు జపించిన తర్వాత ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి చిటికెన వ్రేలునకు గానీ, లేక ఉంగరపు వ్రేలునకు గానీ ధరించవలెను. స్త్రీలు ఎడమ చేతి చిటికెన వ్రేలుకి ధరించుట ఆచారమై ఉన్నది. ఉంగరము అడుగుభాగం మాత్రము రంద్రము కలిగి యుండాలి. కొందరు సిద్ద పురుషులు మరకత రత్నమును శివలింగములుగా దీర్చి దేవ తార్చనయందు నిత్య పూజలు నిర్వహించుచుండెదరు. అట్టివారి పుణ్యఫలితము అనంతము. వారికి త్వరగా మోక్షము ప్రాప్తించగలదు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
like and share
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888
Printerest
https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
ph: 96666౦2371
No comments:
Post a Comment