Tuesday, 4 October 2016

దేవి నవరాత్రులలో ఐదవ రూపం లలిత పరమేశ్వరి - స్కంధమాత.




అమ్మవారిని లలితా ప్రతిపురసుందరీ దేవిగా అలంకరిస్తారు. త్రిపురాత్రయంలో రెండవశక్తి ఈమె. త్రిమూర్తుల కంటె ముందునుంచి ఉన్న శక్తి కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబ డుతోంది. ఈ తల్లి శ్రీ చక్ర అధిష్టాన శక్తి గా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవత గా, తనను కొలిచే భక్తులను అనుగ్రహి స్తోంది. శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూ డా ఈ లలితాత్రిపుర సుందరీదేవే. ఘోర మైన దారిద్య్ర బాధల నుంచి విముక్తి కలిగించి, మనకు మహదైశ్యర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి.
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో లలితాదేవి ఆలంకారాన్ని, లలితా సహస్రనామ స్తోత్రం లో వర్ణించినట్లుగా సచామర రమావాణీ విరాజితా అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నిలుచుని, లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్లుగా అలం కరిస్తారు. మధ్యలోనున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెరకుగడను ధరించి, శివుడి వక్షస్థలం మీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.

ప్రాత:స్మరామి లలితా వదనారావిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌
ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయైనమ:

నవరాత్రులలో  రూపం  - స్కంధమాత.


దుర్గామాత ఐదవ స్వరూపం స్కంధమాత. స్కంధుడనగా కుమారస్వామి. శక్తిధరుడు. దేవసేనల అధిపతి. నెమలి వాహనుడు. ఈయనకు తల్లి కాబట్టి ఈమెకు 'స్కంధమాత' అనే పేరు వచ్చింది. ఈ తల్లి నాలుగు చేతులతో ఉంటుంది. స్కంధుడిని పట్టుకొని పద్మం ధరించి, ఎడమచేతిలో అభయముద్రను, కమలాన్ని ధరిస్తుంది. కమలవాసిని. శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. సింహవాహనాన్ని అధిష్టిస్తుంది. ఈమెను ఉపాసించిన విశుద్ధచక్రంలో మనసు స్థిరమవుతుంది, భవసాగరాలనుంచి విముక్తులై మోక్షాన్ని సులభంగా పొందవచ్చును. నైవేద్యంగా పెరుగు అన్నం సమర్పించాలి.


సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా ।
 

 శుభదాఽస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

దుర్గా మాతయొక్క ఐదవస్వరూపము ‘స్కందమాత’ అనే పేరుతో ప్రసిద్ధి 
గాంచింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు ‘కార్తికేయుడు’ అనే 
మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామంలో ఈయన దేవతల సేనలకు 
అధిపతిగా ఉన్నాడు. పురాణాలు ఈయనను శక్తిధరుడని పేర్కొని, ఈయన 
మహిమలను వర్ణించాయి. ఈతడు నెమలి వాహనుడు. స్కందభగవానుడి 
తల్లి అయినందున దుర్గాదేవి ఐదవ స్వరూపానికి ‘స్కందమాత’ అనే పేరు 
ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజున ఈ స్వరూపంలో 
దుర్గాదేవి ఆరాధించబడుతుంది.

ఈ రోజు సాధకుని మనస్సు విశుద్ధచక్రంలో స్థిరమవుతుంది. ఈమె మూర్తిలో 
బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉంటాడు. స్కందమాత 
‘చతుర్భుజ’. తన ఒడిలో చేరి ఉన్న స్కందుడిని తన కుడిచేతితో పట్టుకొని 
దర్శనమిస్తుంది. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉంటుంది. 
ఎడమవైపున ఒక హస్తం అభయముద్రలో ఉంటుంది. మరొక కరములో 
కమలమును కలిగి ఉంటుంది. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనంపై 
విరాజిల్లుతుంటుంది. కనుక ‘పద్మాసన’గా ప్రసిద్ధికెక్కినది. సింహవాహన.

నవరాత్రి ఉత్సవాలలో ఐదవనాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని 
ఉన్నది. దాని మహా మాహాత్మ్యం గురించి శాస్త్రాలు వేనోళ్ళ శ్లాఘించాయి. 
విశుద్ధచక్రంలో స్థిరమైన మనస్సుగల ఉపాసకునికి లౌకిక ధోరణులు, 
చిత్తవృత్తులూ అంతరిస్తాయి. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో 
పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయా 
బంధములనుండి విముక్తిని పొంది, పిదప పద్మాసనంలో ఆసీనయైన స్కందమాత స్వరూపంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈ సమయంలో 
సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనలో ముందుకు సాగాలి. అతడు తన 
ధ్యానవృత్తులలో ఏకాగ్రతను కలిగి ఉండి సాధనలో పురోగమించాలి.

స్కందమాతను ఉపాసించటంవల్ల భక్తుల కోరికలన్నీ నేరవేరుతాయి. ఈ 
మృత్యులోకంలోనే వారు పరమశాంతిని, సుఖాలనూ అనుభవిస్తారు. 
వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచుకొని వుంటుంది. 
స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునికీ చెందుతాయి. ఈ దేవిని 
ఆరాధించటంలో ఉన్న వైశిష్ట్యము ఇదే! కనుక భక్తులు స్కందమాతను 
ఆరాధించటంపై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండల 
అధిష్ఠాత్రి అవటంవల్ల ఈమెను ఉపాసించేవారు దివ్యతేజస్సుతో, 
స్వచ్ఛకాంతులతో విరాజిల్లుతుంటారు. ఒక అలౌకిక ప్రభా మండలం అదృశ్యరూపంలో సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలం అనుక్షణమూ వారి యోగక్షేమాలను వహిస్తుంటుంది.

కాబట్టి మనము ఏకాగ్రతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను 
శరణుజొచ్చుటకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ ఘోర భవసాగరముల 
దుఃఖమునుండి విముక్తులమై మోక్షమును సులభంగా పొందటానికి 
ఇంతకుమించిన ఉపాయము మరొకటి లేదు.





ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment