Tuesday, 4 October 2016

లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం


లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

భవానీమాతే లలితాదేవి:
 
ఎరుపు రంగు దుస్తులు కట్టుకొన్న, ప్రేమమయ చూపులు కలిగిన పాశము, అంకుశం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం.

నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం.

మనసుతో పలకాలి:
భగవంతుడు/భగవతి ఒక సాకారమును దాల్చింది. అది దేవతల అదృష్టం, దేవతల వలన మనం పొందిన అదృష్టం. ఒకవేళ అమ్మవారి దగ్గరకు వెళ్లి పేరు పెట్టి అదే పనిగా లలితా.....లలితా.....లలితా..... అన్నామనుకోండి మనకి ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా!!! తెలియదు. అలా ఒక 1000 సార్లు లలితా.....లలితా.....లలితా..... అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా!!! లేకపోతే అమ్మవారికి కొన్ని పేర్లు చెప్తే ఏమైనా తెలుస్తుందా... అంటే ఇది లౌకికంగా పేర్లు పెట్టి పిలవడం కాదు స్తోత్రము. నామములు గౌనములు. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి. ఎదో ఒక నామం దగ్గర ఒంటి మీద వెంట్రుకలు నిక్కపోడుచుకుని కన్నుల నీరు వచ్చఇమ్మా!! ఇంత దయ కలిగిన దానివా తల్లీ.....ఇన్ని గుణములా..... ఈ గుణములన్ని మమల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటు వంటి గుణములా....లేకపోతే అసలు గుణముల యెక్క అవసరం అసలు నీకేంటి....నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి....నీవు అటువంటి తల్లివి. గుణములను ప్రకాశించేటట్టుగా అవసరం ఇచ్చారు. పిల్లాడికి అజ్ఞానం లేకపోతే, మన్నిచేటటువంటి గుణం అమ్మదెలా ప్రకాశిస్తుంది. పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయా అనే గుణం ప్రకాశించింది. పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వాడ్ని జ్ఞానమంతుడ్ని చేయగలిగినటువంటి ఔదార్యము, అటువంటి శక్తి అమ్మవారి యందు ప్రకాశించింది. గుణంగా అమ్మవారి యందు ప్రకాశించిన గుణములు మమల్ని ఉద్దరించడానికి పనికి వచ్చింది తప్ప అమ్మవారి యందు ప్రకాశించినటువంటి గ్గుణ ములు అమ్మవారిని ఉద్దరిచుకోవడానికి పనికి వచ్చేవి కాదు.లోకాలను మించి అతిలోక లావణ్యముతో లాస్యము చేసే లలితా మణి లలితాంబికా. ఆమెయే లలితా పరమేశ్వరి. ఆమె గురించి మొద ట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భవానీమాతే లలితాదేవి:
ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశము, అంకు శం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామం త్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటు వంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలను కుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహామునిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం.
183 శ్లోకములలో చెప్పబడినది:
ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది.
శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి. మా అన్న లక్ష్మీయే. మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.
అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.

No comments:

Post a Comment