Sunday 16 October 2016

దీపారాధన

దీపారాధన

దీపంలో దేవతలున్నారు,
వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది,
కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు,మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.
"ఐదువత్తులదీపారాధన"
కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి.
1.మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని,
2.రెండో వత్తి అత్త మామల క్షేమానికి,
3.మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి,
4.నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ,
5.అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు.
దీపారాధన ఎవరు చేసినా రెండు వత్తులు తప్పనిసరిగా వుండాలి.
ఓ పక్క ఆవునేతితో, మరో పక్క నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం.
ఆవునెయ్యిలో సూర్యశక్తి నిండి వుంటుంది. దీనివల్ల
ఆరోగ్య,
ఐశ్వర్య,
సుఖ,సంతోషాలు
ప్రాప్తిస్తాయి.
ఆవునెయ్యిలో,నువ్వులనూనె, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి.
వేప నూనె,రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది.
కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది.
విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు.
వేరుశెనగ నూనెను
దీపారాధనకు అస్సలు వాడరాదు
దీపం సకల దేవతాస్వరూపం
దీపం పరబ్రహ్మ స్వరూపం.
దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మిస్థిర నివాసమై ఉంటుంది.
దీపం లేని ఇళ్ళు
కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని అని చెప్పారు.
దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు.
దీపం సకల దేవతా స్వరూపం.
దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.

దీపారాధన గురించి అనేక విషయాలు చెప్తారు. శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.
ఇంటిముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల నవ్వులు పోసి మూటకట్టి, ఆమూట చివర వత్తిగా చేసి, ఇనప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యాలి. ఈ దీపారాధనకూడా శివుడు, శనీశ్వరుడు, ఆంజనేయస్వామి ముందుచేసి శని దోషాలు పోవాలని నమస్కరించాలి. ఇది ఆధ్యాత్మకం.
 ఇంకా శాస్త్రీయం ఏమిటంటే ఈ దీపం చుట్టూ జీవ శక్తి ప్రసరిస్తూవుంటుంది. ఆ దీపం దగ్గరకూర్చుని పూజ చెయ్యటం, దానికి ప్రదక్షిణ చెయ్యటం, వగైరాలతో ఆ జీవశక్తి మన శరీరంపై ప్రభావం చూపి, మన శరీరంలోని చిన్నచిన్న లోపాలు పోగొడుతుంది.
బంగారం, వెండి ఆభరణాలు ధరించమని చెప్తారు. ఆ లోహాలను ఆయుర్వేదం మందుల్లోకూడా వాడుతూంటారు. బంగారం, వెండి ధరించటంవల్ల మన శరీరం వేడికి ఆ లోహాలు కరిగి కొంచెం కొంచెం శరీరంలోకి చేరతాయి. తద్వారా శరీరానికి కావాల్సిన ధాతువులు అందుతాయి.







అలాగే బంగారం, వెండి ప్రమిదల్లో ఆవునెయ్యితో దీపారాధనచేసి ఆ దీపం దగ్గర కూర్చుని పూజ చేసినట్లయితే మనలో జీవ శక్తి ప్రవేశించి చిన్న చిన్న లోపాలు సవరింపబడతాయి.


No comments:

Post a Comment