Saturday, 8 October 2016

దేవి నవరాత్రులలో ఎనిమిదవ అలంకారం సర్వసిద్ధి ధాత్రి - దుర్గాదేవి



శ్రీ దుర్గా దేవి:


“ విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిః కరవాలఖేట విలద్దస్తా భిరాసేవితాం !
 హసైశ్చక్రగదాసిఖేట విసిఖాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ‘’
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుడ్ని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడ్ని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు ఈ అమ్మనామాన్ని జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు ఈమె శీఘ్ర అనుగ్రహకారిణి. ఎర్రనిబట్టలు పెట్టి ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణ చెయ్యాలి. “ ఓం దుం దుర్గాయైనమః ‘’ అనే మంత్రం పఠించాలి. పులగాన్నం నివేదన చెయ్యాలి. దుర్గా, లలిత అష్టోత్తరాలుపఠించాలి.

ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.

వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పెద్దలు చెబుతారు. 


దుర్గా దేవి శక్తి స్వరూపిని. దుర్గాదేవికి మరో పేరు భవాని, అంబా, ఛండిక, పార్వతి, వైష్ణోదేవి ఇలా వివిధ రకాల పేర్లు ఉన్నాయి ఈమెకు అత్యంత శక్తి వంతమైన శక్తులను కలిగి ఉంటుంది. ఆమె చేతులు వివిధ రకాల ఆయుధాలుంటాయి. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.
అష్టమికి ఉన్న ప్రత్యేకత ఎమిటి అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించాలి కొన్ని ప్రత్యేకమైన తిధులు ఉన్నాయి...అవి అష్టమి,నవమి,చతుర్దశి, అమావాశ్య,పౌర్ణమి, ఈ తిధులను పంచమహాపర్వములు అని అంటారు, వీటిలో ఇప్పుడు అష్టమి అంటే మహాపర్వము అని అర్ధము.ఈ తిధులలో అరాధిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది. కాని శరన్నవరాత్రులలో సప్తమి తో కూడిన అష్టమి పనికిరాదు. సూర్యోదయానికి అష్టమి తిధి ఉండాలి.
అశ్వినస్య చితాష్టమ్యాం అర్ధరాత్రేతు పార్వతి
భద్రకాళి సముత్పన్నా పూర్వాషాడః సమాయుతే
తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయగ్న వినాసిని
ప్రాతుర్భూతా మహాఘోర యోగిని కోటివిస్సః
ఆశ్వియుజ శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్ర కాళి రూపేణ ఆవిర్భవించింది.
భద్రకాళి అంటే దక్షయగ్న వినాసనం కోసం, శివుని జటాజూటం నుండి వీరభద్రుని తో పాటు ఉద్భవించినటువంటి అమ్మ ! నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.
అష్టమి , నవమి తిధుల యందు అమ్మని దుర్గ గా , కాళి స్వరూపేణ పూజలు అందుకుంటుంది
సర్వవర్ణాల వారు ,సర్వ మతాల వారు , సకల జనుల వారు, సకల జనులు నిరభ్యంతరముగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ....దుర్గమ్మ! ఈ తల్లి సర్వజీవ అంతర్యామి. సంకటనాశిని. జగన్మాత, స్త్రీ, పురుష వయో భేదం లేకుండా సర్వులు ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ..
కామ బీజ స్వరూపిణి మహాకాళిగా, మాయా బీజ స్వరూపిణి మహాలక్ష్మిగా, వాగ్బీజ స్వరూపిణి మహాసరస్వతిగా దుర్గాదేవిని ధ్యానిస్తూ షట్కోణ సంయుక్తా అష్టదళ పద్మ - చతుద్వింశతి పత్రక - భూగృహ సమాయుక్త......ఇలాగ దుర్గమ్మను ధ్యానిస్తూ ఆరాధన చెయాలి.
సాలగ్రామములో కాని, మంగళకలశములో కాని, శ్రీ చక్రయంత్రములో కాని, దేవి ప్రతిమలో గాని, బాణ చిహ్నములో కాని, సూర్యుడిలో కాని....ఇలాగ ఎవరి ఆచారవిధానములబట్టి.....అమ్మ ని ఉపాసన చేయాలి.
జయాది శక్తియుతమైన పీఠములో దుర్గాదేవిని నిలిపి తూర్పు కోణములో సరస్వతి సమేత బ్రహ్మను, నైఋతి కోణములో లక్ష్మి సమేత మహా విష్ణువుని, వాయువ్య కోణములో పార్వతి సమేత పరమేశ్వరుడిని, దేవికి ఉత్తరముగా సింహాసనము, దక్షిణముగా మహిషాసురుడిని నిలిపి అర్చన చెయ్యాలి.
అనంతరం అష్టదళాలలో వరుసగా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారహి, నారసిమ్హ, ఐంద్రి, చాముండికా రూపాలని ఆహ్వానించి అర్చన చెయ్యాలి.
దుర్గా స్తోత్రములు, అష్టొత్తరముతో పూజించాలి.
ఇలాగ మన శక్తి మేరకు అమ్మని పూజించి, ఆవిడ అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాలి....
అమ్మని ఆరాధించడం వల్ల సర్వరోగాలు, సర్వ భయాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. ధైర్యం వృద్ధి చెందుతుంది. దుఃఖం నశించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తాయి..
శ్రీ దుర్గా దేవ్యై నమో నమః







సర్వసిద్ధి ధాత్రి

 
 

సిద్ధం గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ||

మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి.

ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా  అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి. లౌకిక, పారలౌకిక మనోరథాలు నెరవేరతాయి. నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి.

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…
1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.
సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.
నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.
ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.
నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.
దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.





ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


















No comments:

Post a Comment