Friday, 7 October 2016

దేవి నవరాత్రులలో ఏడవరోజు అమ్మవారి స్వరూపం కాళరాత్రి -సరస్వతీ దేవి





 శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతీ దేవి అలంకారము



శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతీ పూజ చేసుకు౦టాము. శ్రీ మహాసరస్వతి పరమశివుని సోదరి. పార్వతీ దేవి విష్ణుమూర్తి సోదరి. వేదములలో స్ఫటికమువలె స్వచ్ఛమైన పరమేశ్వరుని ఆకృతి, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రముల ప్రసక్తియున్నది. ఆభగవఒతుని జ్ఞానప్రదమగు రూపమే శ్రీదక్షిణామూర్తి. ఆ మూర్తి చేతిలోని పుస్తక ప్రసక్తి కూడా వేదములలో ఉన్నది. ఆ సదాశివుడు సమస్త విద్యలకు ఈశానుడు(ప్రభువు) అని వేదము స్తుతి౦చుచున్నది. ఈ లక్షణములన్నియు శ్రీ సరస్వతీదేవికి కూడా అన్వయిస్తాయి. పుస్తకము, స్ఫటికమాల, శ్వేతవర్ణము, జటాజూటము, చ౦ద్రరేఖ, త్రినేత్రములు, జ్ఞానప్రదానము ఇవన్నీ పరమేశ్వరునికి, సరస్వతీ దేవికి సమాన లక్షణములే. కోరికలు మనసుని క్షోభి౦పజేసి, జ్ఞానాన్ని ప్రతిబ౦ధిస్తాయి. తృతీయనేత్రము కోరికలని దహి౦చి వేసి జ్ఞాన ప్రాప్తికి సహాయమౌతు౦ది. సూర్యుడు చాలా కా౦తిమ౦తుడే గాని, ఆకా౦తి వేడి తాపాన్ని కలిగిస్తు౦ది. చ౦ద్రరేఖ వెన్నెలని దానితోపాటు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని కూడా అ౦దిస్తు౦ది. చ౦ద్రకళల అభివృద్ధి జ్ఞానాభివృద్ధిని సూచిస్తు౦ది. స్ఫటికము స్వచ్ఛతని, దోషరాహిత్యాన్ని సూచిస్తు౦ది.
సరస్వతీ దేవిని ఆరాధించే విధానం ఎలాంటిది అని అంటే అన్ని ధవళ వస్తువులు ఈ తల్లికి ప్రీతికరం. జ్ఞానానికి సంకేతమే తెలుపు. అందుకు ఈ తల్లికి ఇవ్వవలసినవి – సుగంధం శుక్ల పుష్పంచ సుగంధం శుక్ల చందనం! తెల్లని చందనము, తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు, శంఖము, ముత్యాల మాలలు, ఈ తల్లికి సమర్పించాలి పూజా సమయంలో. పైగా మరొక ప్రత్యేకత ఏమిటంటే తెల్లని చందనంలో ముంచిన తెల్లని పువ్వులతో పూజిస్తే ఒక విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు సనక సనందనాదులు బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ విద్య చెప్పమని కోరుకున్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ధ్యానం చేసి చెప్తా ఉండు అనేటప్పటికల్లా నోట మాట రాలేదు. ఎంతో తెలుసు అనుకున్నానే, నానోట మాట రావడం లేదు, బుద్ధికి ఏమీ తోచడం లేదు అనుకున్నాడట. ఒక్కొక్కప్పుడు ఎన్ని తెలిసున్నప్పటికీ నోరు పెగలదు, బుద్ధికి ఏమీ తోచదు. అప్పుడు ఆ సమయంలో నారాయణుడు అక్కడికి వచ్చి సరస్వతీ దేవి మంత్రాన్నిచ్చి జపం చేయమని చెప్పాడు. అప్పుడు సరస్వతీ దేవిని తలంచుకోగానే బ్రహ్మకు ఆలోచన, జ్ఞానము కలిగి బోధ చేశాడు. అందుకు మన బుద్ధికి ఒక మంచి జ్ఞానం రావాలన్నా వచ్చిన జ్ఞానం అవతలి వారికి అందించాలన్నా సరస్వతీ దేవి అనుగ్రహం కావలసిందే

శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం -
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా -
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
అని పోతనామహత్యుడు అమ్మ ని ప్రార్ధించారు.
సరస్వతి దేవి తెలుపుదనాన్ని సందర్సించి అర్చించాలని కోరుకున్నారు పొతన. తెల్లని పద్మముంపై కూర్చుని ఒక కాలు దానిపై అడ్డముగా ముడుచుకుని కూర్చునట్లు, లేక నిలబడి ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్ట్లు పద్మ పురాణములో చెప్పబడింది. ఆ తల్లి తెల్లని పువ్వులు ధరించి, తెల్లని పూసల కంఠహారం ధరించి, ఆ కంటహారం పై తెల్లని గంధం పూతతో దర్శనమిస్తుంది.
శ్రీ సరస్వత్యై నమః


కాలరాత్రి స్వరూపం



ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।
 

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
 

 వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।
 

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥

దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె 
శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై 
ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ 
ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి 
విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు 
భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె 
వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర 
ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను 
కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక 
ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె 
ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను 
‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ 
భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.

దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు 
సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి 
బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ 
చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే 
స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము 
లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు 
పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత 
మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ 
భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు 
మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ 
మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో 
ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. 
త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే 
వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, 
ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం



No comments:

Post a Comment