Sunday, 30 October 2016

ఆకాశదీపం






కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.

ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో  ద్వజస్తంభానికి ఇత్తడి ప్రమిదలో దీపం  వేలాద దీస్తారు.ఈ దీపాన్ని దర్శించుకోడానికి భక్తులు అత్యంత ఉత్సాహం తో వెళతారు.ఈ దీపాన్ని ఆకాశ మార్గాన పయనించే పితృదేవతల కోసం వెలిగిస్తారు.

No comments:

Post a Comment