Friday, 28 October 2016

దన త్రయోదశి నాడు ఈ వస్తువులు కొని పూజిస్తే…

దన త్రయోదశి నాడు ఈ వస్తువులు కొని పూజిస్తే



దీపావళి కి ముందు వచ్చే దన త్రయోదశి నాడు ఈ వస్తువులు కొని పూజిస్తే… అదృష్తంవ మీవెంటే…
దీపావ‌ళి అనగానే ఆ దీపాలులాగే పిల్లలు పెద్దలు అందరి మొఖాలు ఆనందంతో వెలిగిపోతుంటాయి. టపాసులు గురించి పిల్లలు వారం ముందునుంచి నాకు ఈసారి ఇలాంటివి కావాలి అలాంటివి కావాలి అంటూ ఉంటారు. ఇక కొత్త బట్టలు, ఆడవారికి పూజలు ఇలా ఇల్లంతా మరియు ఇంటి బయట కూడా ఆనందంతో అందంగా ఉంటుంది ఈ పండుగ. ఈ పండుగ ముందురోజు వచ్చే ధంతేర‌స్ రోజున అందరూ లక్ష్మీని పూజించడంతో పాటు ఎదో ఒక కొత్త వస్తువు కొంటారు. అయితే ఈ ధంతేర‌స్ ఏటా దీపావ‌ళికి ముందు రోజే వ‌స్తుంది, కానీ ఈ సారి మాత్రం రెండు రోజుల ముందే వ‌స్తోంది. ఈ నెల 28వ తేదీన ధంతేర‌స్ రానుంది. ఈ క్ర‌మంలో ఆ రోజున ల‌క్ష్మీ దేవి పూజ‌తోపాటు ప‌లు వ‌స్తువుల‌ను కూడా కొనాల‌ట‌. దీంతో అలా కొనే వారికి ఇంకా ఎక్కువ శుభాలు క‌లుగుతాయ‌ట‌. అలాగని కొందరు బంగారమే కొనాలేమో అనుకుంటారు. స్తోమత లేకపోతే బాధ పడతారు. బంగారం మాత్రమే కొనాలని రూల్ ఏమీ లేదు. ఈ క్రిందన ఇచ్చిన ఏ వస్తువునైనా ఆరోజు కొంటె మంచి జరుగుతుంది. మరి అవి ఏమిటో తెలుసుకుందాం…
చీపురు…
ధంతేర‌స్ రోజున చీపురును కొంటె .. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి ప‌ట్టిన ద‌రిద్రం పోతుంద‌ట‌.


వంట‌పాత్ర‌లు…
ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి వాటి ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

అకౌంట్స్ బుక్‌…
వ్యాపారం చేసే వారు అకౌంట్స్ పుస్త‌కాన్ని (రిజిస్ట‌ర్‌) కొనుగోలు చేసి దాన్ని వారి షాపులో లేదా ఆఫీసులో ప‌డ‌మ‌ర దిశ‌గా ఉంచితే… వ్యాపారం వృద్ధి చెందుతుంది.

గోమ‌తి చ‌క్ర‌…
గోమ‌తి చ‌క్ర అనే పేరున్న 11 గ‌వ్వ‌ల‌ను కొనుగోలు చేసి వాటిని ఒక ప‌సుపు రంగు వ‌స్త్రంలో చుట్టి మీ ఇంట్లోని లాక‌ర్‌లో పెట్టడం వలన ఇంట్లో సంప‌ద పెరుగుతుంది.

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు…
ఫ్రిజ్‌, మొబైల్ ఫోన్‌, టీవీ వంటి వ‌స్తువుల‌ను ధంతేర‌స్ రోజున కొనాల‌ట‌. అనంత‌రం వాటిని ఇంట్లో వాయువ్య దిశ‌గా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న ప‌నులు జ‌రుగుతాయ‌ట‌.

ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు…
ధంతేర‌స్ రోజున ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడు క‌ల‌సి ఉన్న ఫొటోను లేదా గోల్డ్ కాయిన్‌ను ఇంటికి తెచ్చుకుని వాటికి పూజ చేయాలి. దీంతో ఆ ఇంట్లో అన్నీ శుభాలే జ‌రుగుతాయి. సంప‌ద కూడా వృద్ధి చెందుతుంది.



 స్వ‌స్తిక్ చిహ్నం…
స్వ‌స్తిక్ బొమ్మ‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం లేదా గేట్ వ‌ద్ద వేలాడ దీయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

బంగారం…
ధంతేర‌స్ రోజున వీలైతే బంగారం కొంటె మంచిది. ఉద‌యం 6.34 గంట‌ల‌కు, సాయంత్రం 6.20 గంట‌ల‌కు బంగారం కొనేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయ‌ట‌.

చేసే వృత్తికి సంబంధించిన‌వి…
ఎవ‌రు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వ‌స్తువును ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి ల‌క్ష్మీ దేవిని పూజించాల‌ట‌. దీంతో వారికి ఆ రంగంలో విజ‌యం చేకూరుతుంది.

ఇందులో ఏ ఒక్కటి కొనుక్కున్న మనకు మంచి జరుగుతుంది. అందుకని ఈ విషయం వీలైనంత మందికి చెప్పి అందరికి అదృష్టాన్ని, వారి ఆర్ధిక స్తోమతను బట్టి ఏదైనా కొనుక్కుని ఆనందంగా, తృప్తిగా దీపావళి చేసుకోమని చెప్పి… ముందుగా దీపావళి శభాకాంక్షలు.

No comments:

Post a Comment