Sunday 16 October 2016

అక్టోబర్ 16.. ఆకాశంలో సూపర్ బ్లడ్ మూన్ చూడండి.. ఆరెంజ్ రంగులో శరత్ పున్నమి..


అక్టోబర్ 16.. ఆకాశంలో సూపర్ బ్లడ్ మూన్ చూడండి.. ఆరెంజ్ రంగులో

శరత్ పున్నమి..



అక్టోబర్ 16 రోజున ప్రకృతి ప్రేమికులకు ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకోనుంది. చంద్రుడి పున్నమి కాంతులు వెదజల్లే అద్భుతమైన ఘటన ఈ రోజే జరగనుంది. అంతేకాదు అక్టోబర్ 16న చంద్రుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. చంద్రుడు తన కక్ష్య నుంచి భూమికి దగ్గరగా రావడం వల్ల ఇలా కనిపిస్తాడు. సూర్యకాంతి చంద్రుడిపై పడటం వల్ల చంద్రుడు నారింజరంగులో మెరిసిపోతూ అబ్బురంగా కంటికి కనిపిస్తాడు. అందుకే శాస్త్రవేత్తలు దీనిని బ్లడ్ మూన్ అంటారు. గతేడాది సెప్టెంబర్ లోనూ ఇలాగే చంద్రుడు కనువిందు చేశాడు.ప్రతి నెలా పున్నమి రోజున కనిపించే దానికంటే పెద్దగా చంద్రుడు కనిపిస్తాడు. ఇంత ప్రత్యేకతున్న ఈ పున్నమిని శరత్ పున్నమి అంటారు. శరదృతువులో వచ్చే పౌర్ణమికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానమున్న సంగతి తెలిసిందే. ఎన్నో వర్ణనలు, కావ్యాలు శరదృతువు పౌర్ణమి వచ్చాయి. అంతేకాక ఈ పున్నమికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. చంద్రుడు సూపర్ బ్లడ్ మూన్‌గా దర్శనమివ్వనుంది. ఆకాశంలో చాలా అరుదుగా ఈ దృశ్యం కనిపిస్తుంది.

No comments:

Post a Comment