ఎడ్లు నెడ్ల బండ్లు నేడాది మొత్తమూ
కష్టమందు నిలువ గనుమ నాడు
గౌరవించి వాని గరుణతో కొలుతుమే
సకురు అప్ప రావు సత్య మిదిర!
భావం: రైతులకు ఏడాది మొత్తం వ్యవసాయ పనుల్లో ఎండనకా వాననకా కష్టపడి సహకరించిన ఎడ్లనూ,ఎద్దుల బండినీ ఒక్క సారి శుభ్రం చేసి, రంగులు వేసి, రిపేర్లు చేయించి బాగు చేసుకుని, వాటి సహకారానికి ప్రేమతో కృతజ్ఞతలు తెలిపి, వాటిని పూజించి, పనులు జరిపించుకునే క్రమంలో వాటి పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటే దయచేసి క్షమించి, ఆ పాపం మా కుటుంబానికి తగలకుండా చూడండమ్మా (కనుమా) అని వేడుకుని, వాటిని గౌరవంతో పూజిస్తాము!(మా హిందువులది అజ్ఞానమో, మూర్ఖత్వమో, పిచ్చితనమో కాదు! ప్రకృతిలోని ప్రతీ వస్తువులో, ప్రతీ జీవిలో భగవంతుని ప్రేమ తత్వాన్ని చూడగలిగే సున్నితత్వం! భగవంతునిచే సృష్టించబడిన ప్రతీ వస్తువునూ ఆయన మాకు ఇచ్చిన కానుకగా భావించి, వాటిని ఎంతో గౌరవంగా చూసుకుంటాం! మాకు ఆయన ఎంతో - ఆయనిచ్చిన కానుకలూ అంతే! )
No comments:
Post a Comment