సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమైన రోజు కనుమ. ఇది రైతులకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే పశువులను దేవుడిలా పూజిస్తారు. తాను కడుపు నింపుకోకున్నా పశువులకు పొట్ట నింపే ఆలోచనతో ఉంటాడు రైతు. అందుకే వాటిపై మమకారం ఎక్కువగా ఉంటుంది. పంట చేతికి అందండంలో సాయపడే పశు పక్ష్యాదులకు కనుమ రోజున పూజ చేస్తారు.
పశువులు అంటే రైతులకు చెప్పలేని ప్రేమ ఉంటుంది. అలాగే పక్షులను కూడా ఎంతగానో ప్రేమిస్తాడు అన్నదాత. వాటి కోస కనుమ నాడు ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. మూడు రోజుల పండుగలో కనుమ రోజునే రైతులకు తృప్తి. వ్యవసాయంలో సాయం చేసిన వాటిని పూజించుకుంటే అదో ఆనందం.
కష్టానికి తగని ప్రతిఫలం కనుమ.. శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ.. మనలో మంచితనం వెలిగించే దినం కనుమ...
రోకల్లు దంచే ధాన్యాలు.. మనసులను నింపే మాన్యాలు.. రెక్కల కష్టంలో సాయం చేసే పాడి పశువులు.. మళ్లీ మళ్లీ చేసుకోవాలి ఇలాంటి వేడుకలు..
No comments:
Post a Comment