Friday, 5 January 2024

గుర్రప్పందెం - గుణపాఠం


                 


పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒకరోజు మధ్యవయస్కుడైన ఒక పెద్దాయన వచ్చారు. అతను చూడడానికి చాలా దిగాలుగా ఉన్నాడు. అతని కుమారుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. చాలా మంచి సంపాదన, అయినా ఇంటికి ఒక్కపైసా కూడా రాదు. ఇంటికి వెళ్ళేదారిలోనే అంతా అయిపోతుంది. గిండి రేస్ కోర్సులో గుర్రప్పందాల్లో మొత్తం పోగొట్టుకుంటాడు.

“కొన్నిసార్లు కార్యాలయం డబ్బుని కూడా దీనికోసం ఉపయోగిస్తాడు. అతని గౌరవం కాపాడడానికి అతని అధికారులకి నేను డబ్బు కడుతుంటాను పెరియవ. వాడి సంసారం కూడా సవ్యంగా లేదు. ఆ గుర్రప్పందాలు వాణ్ణి దయ్యంలాగా పట్టుకున్నాయి” అని స్వామివారి ముందు వాపోయాడు.

మహాస్వామివారు వారి అబ్బాయి గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పెద్దాయనను అనునయించి ఇంటికి పంపించారు.

తరువాత మహాస్వామివారు ఆ వ్యక్తి పనిచేసే కార్యాలయంలోని ఒక భక్తికలిగిన సహోద్యోగిని పిలుచుకు రమ్మని శిష్యుణ్ణి ఆదేశించారు.

ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు ఆ శిష్యుడు. అతను స్వామివారి ముందు భక్తితో చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

“మీ కార్యాలయం దగ్గరున్న పోలీస్ స్టేషనుకు వెళ్ళి, అనధికారికంగా ఒక రక్షక భటుణ్ణి మీ కార్యాలయానికి రమ్మని చెప్పు. ఆ గుర్రప్పందాలకు వెళ్ళే అతను బయటకు వెళ్ళగానే ఈ రక్షక భటుణ్ణి అతనితో, కార్యాలయం లెక్కలలో అవకతవకలకు పాల్పడినందుకు నిన్ను అరెస్టు చెయ్యడానికి ఉత్తర్వులు ఉన్నాయని భయపెట్టమని చెప్పు. ఇలా చెయ్యమని నేను చెప్పానని ఆ రక్షక భటుడుకి చెప్పు“ అని స్వామివారు ఆ సహోద్యోగిని ఆదేశించారు.

పరమాచార్య స్వామివారి ఆజ్ఞానుసారమే అన్నీ జరిగాయి. అతని మాటలకు ఆ జల్సారాయుడు భయపడిపోయాడు. “నిన్ను ఇoకొక్కసారి రేస్ కోర్స్ దగ్గర చూసానంటే అదే నీకు అరెస్ట్ వారెంట్” అని గట్టిగా మందలించి వెళ్ళిపోయాడు ఆ రక్షక భటుడు.

ఆనాటి నుండి ఆ యువకుడు ‘గిండి’ అనే పదం వింటేనే భయపడిపోయేవాడు.

ఇది మహాస్వామివారి ఆక్షేపణా? లేక దయా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

🙏కంచిపరమాచార్యవైభవం

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment