ఏకలవ్యుడి గొప్ప శిష్యుడు అని అతని బొటన వ్రేలు ను అన్యాయం గా తీసుకొన్నాడు అని భావించవద్దు.
ద్రోణుడికి అర్జునుడి పై పక్షపాతం ఉండి ఆవిధంగా ప్రవర్తించాడు అనడానికి ఆస్కారం లేదు.
ఒక ఉదాహరణ:
ద్రోణుడి పై పగతో దృపదమహారాజు యజ్ఞం చేసి కూతురు గా ద్రౌపదిని, పుత్రుడు గా ధృష్టద్యుమ్నుడిని పొందుతాడు.
అలా తనను చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుని కి కూడా శిష్యుడు గా వస్తే ఏ సంకోచం భయం పక్షపాతం లేకుండా విద్య నేర్పిన మహనీయుడు ద్రోణాచార్యుడు.
తన కుమారుడైన అశ్వద్ధామ కు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశిస్తే దుష్ట స్వభావం తో దుర్వినియోగం చేస్తాడని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే నేర్పాడు గాని ఉపసంహార మంత్రాన్ని ఉపదేశించలేదు ప్రయోగం ఉపసంహార మంత్రాలు వస్తేనే అది పూర్తి అవుతుంది.
ఆ సగం కూడా అశ్వద్ధామ పోరు పడలేక నేర్పాడు. ఆనేర్చిన సగం తోనే అభిమన్యుని భార్య ఉత్తర గర్భం లో ఉన్న పాండవ వంశబీజాన్ని సంహరించాలని చూశాడు.
అటువంటి ద్రోణాచార్యునికి ఏకలవ్యుడి కి జాతి వివక్ష తో ప్రవర్తించాడు అనడానికి ఆధారాలు లేవు.
మరి ఏ కారణం చేత ఏకలవ్యుడి బొటన వేలు తీసుకున్నాడు అంటే …
ఏకలవ్యుడి యొక్క ఏకాగ్రత చాలా గొప్పది. అతడు ద్రోణాచార్యుడి విగ్రహం ఎదురుగా పెట్టుకుని సాధన చేసి విలువిద్య నేర్చుకున్నాడు.
ఒక సారి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి విలువిద్య కౌశలం గురించి విని అతనిని చూద్దాం అని వెళ్ళగా దారిలో ఒక కుక్క కనిపిస్తుంది. దాని నోటికి పైనుంచి క్రిందకు అడ్డంగా బాణాలు కొట్టబడి ఉండటం చూస్తాడు. ఎవరు కొట్టారు ఈవిధంగా అని ఆరాతీస్తే అది ఏకలవ్యుడు అని తెలుస్తుంది.
ఎందుకు కొట్టావు అని అతనిని ప్రశ్నిస్తే అది ఏక లవ్యుడి పైకి అరుస్తూ మీద పడబోతే అలా కొట్టాడు అని తేలింది.
ఒక చిన్న తప్పుకు తను నేర్చిన విలువిద్యను దుర్వినియోగం చేసేవాడు తన విద్యను ప్రయోగించే అర్హత లేని వాడు గా ద్రోణాచార్యుడు గుర్తిస్తాడు.
మనం ఈ కాలంలో చూస్తున్నాం…పాకిస్థాన్ లాంటి టెర్రరిస్టు దేశంలో ఉన్న అణుబాంబు లు ఏవిధంగా ప్రపంచాన్ని బెదిస్తున్నదో…!
ఉగ్రవాదులు తమ ఆయుధాలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఆ నాడు జరిగిన ప్రపంచ యుద్దం కురుక్షేత్ర సంగ్రామంలో ఏకలవ్యుడు కౌరవుల పక్షాన యుద్దం చేయడం కూడా మీరు మహాభారతం లో చూస్తారు.
No comments:
Post a Comment