Saturday, 13 January 2024

భూ లాభం-జాతక విశ్లేషణ

 




భూమి వలన లాభం పొందడం అనేది జాతకంలో గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ఉంటుంది ఉంటుంది. భూమి వలన లాభం వివిధ రకాలుగా ఉండవచ్చు భూములు కొనడం, అమ్మడం ద్వారా, భూములు కొని రియల్ ఎస్టేట్ కి ఉపయోగించడం, భవనాలు షాపులు షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టి అమ్మడము, ఇళ్లు నిర్మించి అద్దెలకు ఇవ్వడం, వ్యవసాయం ద్వారా భూమి లాభాన్ని పొందడం, పలు రకాలుగా భూమి వలన ఆదాయం పొందవచ్చు.

అందరికీ భూమి యోగించదు జాతకంలో కొన్ని గ్రహాల ప్రత్యేక అమరిక ఉన్నవారికి మాత్రమే భూమి వలన లాభం పొందగలుగుతారు. దీనికి సంబంధించిన విషయాలు జ్యోతిష్య పరంగా తెలుసుకుందాము.

భూతత్వరాసులైన వృషభము కన్య మకర రాశులు అదేవిధంగా భూమికి కారణమైన గ్రహాలు కుజుడు మరియు బుధుడు కూడా ఉంటారు. భూతత్వరాసులైన వృషభము వ్యవసాయ భూమిని సూచిస్తుంది.

కన్యారాశి ప్రజలు నివసించే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, షాపింగ్ కాంప్లెక్స్ లు మొదలైన వాటిని సూచిస్తుంది. మకర రాశి చిత్తడి నేలలను సూచిస్తుంది.

అనగా సముద్రం తీరం వెంబడి లేదా నదీ తీరంలో నిర్మించే భారీ నిర్మాణాలను మకరం సూచిస్తుంది. జాతకంలో లాభాధిపతి పైన తెలియజేసిన ఏదైనా ఒక భూతత్వరాసులో ఉండి ఆ గ్రహం యొక్క దశా భుక్తులలో జాతకుడికి భూమి వలన అత్యధిక ఆదాయం ఖచ్చితంగా వస్తుంది.

ఉదాహరణకు మేష లగ్న జాతకులకు శని భగవానుడు లాభాధిపతి ఈ శని భగవానుడు వృషభంలో కానీ కన్యలో కానీ మకరంలో కానీ ఉంటే పైన చెప్పిన విధంగా భూమి వలన అత్యధికంగా వస్తుంది.

వృషభంలో ఉన్నప్పుడు వ్యవసాయ భూముల ద్వారా లాభం, కన్యలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్, అపార్ట్మెంటులో ఇల్లు నిర్మించి అమ్మడం ద్వారా లాభము, మకరంలో ఉన్నప్పుడు సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణాలు, నీరు భూమి కలిసే చోట నిర్మాణాలు వలన అత్యధిక లాభాన్ని పొందుతారు. వృషభ లగ్న జాతకులకు లాభాధిపతి గురుడు ఈ గురు భగవానుడు వృషభంలో ఉన్నప్పుడు, మిధునం లో ఉన్నప్పుడు భూమి లాభం ఉంటుంది. మకరంలో అయితే గురు భగవానుడు నీచ స్థితి పొందుతారు

కావున లిటికేషన్ భూముల వలన లాభాలను కచ్చితంగా పొందుతారు. మిధున లగ్న జాతకులకు లాభాధిపతి కుజుడు వీరికి వృషభంలో కుజుడు ఉన్నప్పుడు మాత్రమే భూమి ద్వారా లాభం పొందగలుగుతారు. కన్యలో కానీ మకరంలో కానీ కుజుడికి అనుకూల స్థానాలు కావు. కావున మిధున లగ్నం వారికి భూమి ద్వారా తక్కువ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా లాభాధిపతి భూతత్వరాసులలో ఉండి అవి లగ్నానికి అనుకూల స్థానాలు అయినప్పుడు ఆ దశాబుక్తులలో భూమి వలన జాతకుడు ఖచ్చితంగా లాభాలను పొందుతారు. కొందరు డబ్బు ఎక్కువగా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మకాలు ఆగిపోయి అత్యధిక నష్టాలు చవి చూస్తుంటారు.

భూమి వలన లాభం తన జాతకంలో ఉందా లేదా అనేది పరిశీలించుకుని వ్యాపారం ప్రారంభిస్తే అత్యధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment