ఒక పిచ్చివాడు కూడా అసలు ఉనికే లేని వస్తువులను గురించి ఊహిస్తూ ఉంటాడు. కానీ ఆధ్యాత్మిక జీవనంలో అటువంటి భ్రమలకు తావు లేదు.
సాధన ద్వారా సత్యసాక్షాత్కారం క్షణ మాత్రమైనా కలిగేటట్లు యత్నించాలి. ఆ క్షణం మనకు తెలియకుండా వస్తుంది. దానికి సుదీర్ఘకాలం క్రమం తప్పకుండా సాధనచేసి, మనల్ని మనం సన్నద్ధుల్ని చేసుకోకపోతే, విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చును.
దాని వలన మనం జీవితాంతం కలవరపాటుకు లోనుకావచ్చు. ఆ క్షణాన్ని ఎదుర్కొనే సన్నాహాలను చేసుకుని మనం ముందుగానే తయారవ్వాలి. అప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని మన అభివృద్ధికి ఉపయోగించుకోగలం.
ఆధ్యాత్మిక జాగృతి, సాధకునికి మొదట్లో ఆనందానికి బదులు దుఃఖాలనే కొనితెస్తుంది. సాధకుడి జీవితంలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమవుతున్న మొదటిదశలో జీవితం ఎంతో కష్టంగా పరిణమిస్తుంది. ప్రపంచంలో మనకున్న ఆస్థిపాస్థుల మీద, అందచందాల మీద, తెలివితేటల మీద ఆసక్తి తగ్గిపోతుంది.
మరొక వైపున ఆత్మసాక్షాత్కారం ఇంకా అందుబాటులోకి రాక గాలిలో తేలుతూ పైకీ పోలేక, క్రిందకీ రాలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.
No comments:
Post a Comment