Monday, 8 January 2024

అమ్మవారి కుంకుమ పూజ చేయుట, ఫలితం.

 


అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది అమ్మవారు. 

మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది.

స్త్రీలు చేస్తే వారిలో తన రూపాన్ని అమ్మవారు చూసుకుంటుంది. ఆడవారు కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్త్రనామ పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు అక్కడే ఉండి వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. 

ఈ నిదర్శనమే వశిన్యాది దేవతలకు లలితా రహస్య సహస్త్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో  పలికేది మీరైన మీలో ఉండి పలికించేది నేనే అని అమ్మవారు చెప్పారు.

లలితా పారాయణం చేస్తు కుంకుమ పూజ చేస్తున్న స్ట్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది.

అంత కన్నా ఏమీ వరం కావాలి మీకు అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్ని నశించి పోతాయి నీ దేహం మనసు పవిత్రం అవుతుంది. 

మళ్ళీ మళ్ళీ పాప కర్మలు చేసి పాపాన్ని కర్మలను  అంటించుకుంటున్నారు. 

సదా సత్ ప్రవర్తనతో ఉంటే దేవీ ఉపాసన చేసే ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే... ప్రతి రూపాలే..

ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే అయితే ప్రవర్తన కర్మను అనుసరించి, పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ  డవలప్ అవుతుంది.

నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ జరగనిదే అక్కడ జరిగిన అమ్మవారి పూజకు ఫలితం ఉండదు.

పవిత్రమైన స్ధలంలో కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యానికి అంత శుభం కలుగుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment