దైవం పట్ల, గురువు పట్ల, పెద్దల పట్ల విద్య పట్ల శ్రధ్ధచూపాలి. మాటకు కట్టుబడి ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. దైవ నామస్మరణ మరువరాదు. నిత్యపూజచేయాలి. భగవంతుడు నమ్మినవారిని ఎన్నడూ పతనం కానివ్వడు. ఓర్పుతో ఉండాలి. ఓర్పే దానం, యజ్ఞం, సత్యం మరియు ధర్మం. ఓర్పువల్ల సకలం సిధ్ధిస్తాయి. ఓర్పే మహా బలం. అణకువ అందరితో అన్నివేళలా పనికి రాదు. దుర్మార్గుల పట్ల కఠినంగానే ఉండాలి. మన విజయాలకీ, వైఫల్యాలకి కారణం మనం చేసిన కర్మలే. బాధ్యతలను విస్మరించి దైవంకోసం తపించడం సరైన పద్ధతి కాదు. పనినే దైవంగా భావించాలి. బాధ్యతలను శ్రధ్ధగా నిర్వర్తిస్తూ, భగవంతున్ని మనస్సుతో ధ్యానిస్తేూ చాలు. తప్పకుండా సకలం సిద్ధిస్తాయి విజయం చేకూరి శుభాలు కలుగుతాయి.🙏
No comments:
Post a Comment