Thursday, 4 January 2024

ఏయే హోమాదులకు ఏయే ద్రవ్యములు ఉపయోగించాలి?

 



గణపతి హోమమునకు చెరుకుముక్కలు, వరిపేలాలు, బెల్లము ముక్కలు, పటికబెల్లం ముక్కలు, తేనె, కొబ్బరిముక్కలు, జీడిపప్పు, బాదం

పలుకులు, ఎండుఖర్జూరాలు, తామరపువ్వులు, తామరగింజలు, ఎండుద్రాక్ష, ఎండు కిస్మిస్, కుడుములు, అరటిపండ్లు, వెలగపండ్లు.

కార్తవీర్యార్జుననకు క్షీరాన్నముతో హవనము చేయాలి.

రుద్రహోమమునకు మారేడుకాయలు, మారేడుదళాలు,

మారేడు సమిధలు, మేడికాయలు, మేడిదళాలు, మేడిసమిధలు, ఉసిరికాయలు, ఉసిరిదళాలు, ఉసిరిసమిధలు, జువ్విసమిధలు, నెయ్యి. సర్పహోమాలకు: కాలసర్పదోష నివారణకు విషముష్టి విత్తనాలు, విషముష్టి చెక్క వాడతారు.

సంతానముకొరకు: సర్పదోషంవల్ల సంతానం కలగకపోతే

మామిడివేరు, వ్యాఘ్రపాదం, త్రివృత్తమూలం, లక్ష్మణవేరు, ఉత్పలం, తగరం, చెంగల్వకోష్టు, యష్టిమధుకం, చందనం, మేకపాలలో ముంచి

హవనం చేయాలి. సర్పదోషంవల్ల బహిష్ఠు, అనారోగ్యాలు ఉంటే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు (త్రికటు), కరక్కాయ, తానికాయ, ఉసిరి (త్రిఫల) చిత్రమూలం, ఇంగువ, లక్ష్మణవేరు, మేకపాలలో ముంచి హవనం చేయాలి. సర్పదోషంవల్ల పక్షవాతము లేదా తీవ్రజ్వరం వుంటే చిట్టాముదపు వేరు, మామిడివేరు, తెల్లతెగవ వేరు, నీలోత్పలం, తగరం, చెంగల్వకోస్టు, యష్టిమధురం, తెల్లచందనం, లక్ష్మణవేరు, మేకపాలలో ముంచి హవనం చేయాలి. సర్పదోషంవల్ల పుంస్త్వలోపం వుంటే మంజిష్టం, అతిమధురం, చెంగల్వకోస్టు, త్రిఫల, పంచదార, ముత్తువ, పులగం, మేథ, పయస్య, కాకలీదుంప, అశ్వగంద, అజామోద, పసుపు, ఇంగువ, పటుకరోహిణి, ఉత్పలం, కలువ, ద్రాక్ష, చందన, రక్తచందనములు కలిపి హవనం చేయాలి. వైష్ణవ హోమాలకు క్షీరాన్నం, ఆవునెయ్యి, ఎండు కిస్మిస్, కొబ్బరిముక్కలు, బాదం పలుకులు, జీడిపలుకులు హవనం చేయాలి. దశమహావిద్యలకు దర్భ, గరిక, తెల్లఆవాలు, నవధాన్యాలు, మారేడుకాయలు, బార్లీగింజలు, తెల్లనువ్వులు, కమలబీజాలు, వరిపేలాలు, పంచామృతాలు, బెల్లం ముక్కలు, కురిడి కొబ్బరిముక్కలు, అరటిపండ్లు, హవిషాన్నం, లడ్లు, విప్పపువ్వు హవనం చేయాలి.

యోగినీదేవతలకు కనుక, చెరకు, తాళ, వేప, భూజ్య పత్రం, తేనె, ఏలక, లవంగ, నిమ్మ, దానిమ్మ, మండపసుపు, నల్లపసుపు, నేలములికి (నాలుగు రంగులలో తెలుపు, పసుపు, ఎరుపు, నీలం), నారింజ, జటామాసి, సంపెంగ హవనం చేయాలి.

అప్సర, కిన్నరీ హోమాలకు సైంధవలవణం, రాగి, మట్టి, మామిడి, ఉత్తరేణి, తులసి, అత్తిపత్తి, తెల్లగలిజేరు, విష్ణుక్రాంత, తెల్లమోదుగ, ఎఱ్ఱమోదుగ (తీగమోదుగ వాడకూడదు), తెల్లజిల్లేడు, తెల్లగరిక, నల్ల ఉమ్మెత్త, బ్రహ్మదండి, నక్కపీతరి గడ్డ వాడాలి.

భైరవీ భైరవులు హోమాలకు బ్రహ్మజెముడు, నాగజెముడు, రుద్రజెముడు, మొద్దుజెముడు, కొబ్బరిముక్కలు, ఊడుగ, బ్రహ్మదండివేర్లు, భస్మము, తాళకం, అభ్రకం, కిలస్తుఘ్నం, మైసాక్షి, లోభాన్, గుగ్గిలం, సాంబ్రాణి, నల్లపటిక (రాగిపటిక), నల్లనువ్వులు, మిరియాలు హవనం చేయాలి.

శక్తిహోమాలు చేసేటప్పుడు దశమహావిద్యలకు వాడే ద్రవ్యాలతోపాటు కుంకుమ కలిపిన అన్నము కూడా వాడాలి. ప్రత్యంగిరలకు తానికాయ (విభీతకి), తెల్లజిల్లేడు, చండ్ర, శొంఠి, పిప్పళ్ళు, తిప్పతీగ, మిరియాలు, నల్లనువ్వులు, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు, వేపనూనె, ఆముదము,

నల్లనువ్వులనూనె, అవిసెనూనె, విప్పనూనె వాడాలి.

జ్వరనివారణకు, అపమృత్యు నివారణకు, ఆహార పాచన మంత్రాలకు, మాలామంత్రాలకు, గాయత్రీ మంత్రాలకు మిరియాలు, ఆవునెయ్యి వాడాలి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment