Wednesday, 10 January 2024

ఇంట్లో నెమలి పింఛం ఉంటే ఎంత మంచిదో తెలుసా....!!

 


నెమలి పింఛం అంటే ఇష్టం లేనివారు ఎవరైనా ఉంటారా, నెమలి పింఛం మనస్సుకు ఎంత ఉల్లాసాన్ని ఇస్తుందో, దానివల్ల ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. 

మన పెద్దలు చెప్పే కొన్ని పద్దతులు మరియు అలవాట్లు మూఢ నమ్మకాలుగా అనిపిస్తాయి. 

కాని వాటిని ఆచరిస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 

కొన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించబడి, మంచివిగా పేరు దక్కించుకున్నాయి.

ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే మంచిది అంటారు. 

అలాంటి వాటిలో నెమలి పింఛం కీలకంగా ఉంటుంది. నెమలి పింఛం ఇంట్లో ఉంటే చాలా రకాలుగా మంచి జరుగుతుందని పండితులు మరియు ప్రముఖులు కూడా అంటున్నారు. 

నెమలి పింఛం అనేది దైవంకు రూపం అన్నట్లుగా చెబుతారు, శ్రీకృష్ణడు నెమలి పింఛంను తలపై పెట్టుకున్న విషయం తెలిసిందే. 

నెమలి పింఛంకు ఆయన అంత ప్రత్యేకమైన శ్రద్దను చూపాడు కనుక ఖచ్చితంగా నెమలి పింఛం గొప్పదనే భావన ఏర్పడింది.

 నెమలి పింఛంను ఇంట్లో ఉంచుకుంటే కలిగే లాభాలు, ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా లేదంటే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నా కూడా నెమలి పింఛం వల్ల అవి పోతాయి, అంతా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం. 

ఇక ఇంట్లో పిల్లలు లేదా పెద్దలకు గ్రహ దోషం వంటివి ఏమైనా ఉంటే ఇంట్లో నెమలి పింఛం పెట్టుకోమని పెద్దలు సూచిస్తున్నారు. 

నెమలి పింఛంతో ఆ దోషాల ప్రభావం తక్కువగా ఉంటుందని అంటున్నారు.

పిల్లల ఏకాగ్రత పెంచడంకోసం మరియు వారిని అహ్లాదపర్చడం కోసం కూడా వారిరూపంలో లేదా ఇంట్లో నెమలి పించం ఉంచడం మంచిది. 

నెమలి పింఛంను తదేకంగా చూడటం వల్ల మనసు ప్రశాంతంగా అయినట్లుగా అనిపిస్తుంది. 

అందుకే పిల్లలకు అది ఏకాగ్రత పెంచి చదువుపై ఆసక్తిని కలిగించేలా చేస్తుంది. 

రాహు కేతు పూజలు చేయించుకునేవారు, ఆర్థిక, ఆరోగ్య పరమైన సమస్యలు పడుతున్న వారు పడుకున్న సమయంలో తలగడ కింద నెమలి పింఛం పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. 

ఇంట్లో బెడ్‌ రూంలో తూర్పు వైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి పింఛం ఉన్నట్లయితే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

చిన్న నెమలి పింఛం పెడితే ఇంత మంచిది అన్నప్పుడు పెడితే పోయేది ఏముంది చెప్పండి. 

కాబట్టి మనందరి ఇళ్ళల్లో ఎలాగూ కృష్ణయ్య విగ్రహాలు ఉంటాయి. 

ఇప్పటి నుండి కృష్ణయ్య కిరీటంలో నెమలి పింఛంను కూడా ఉంచుదాం..

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment