మనలోపలో ఉన్న, ఇంద్రియములు, గ్రంథులు, ఆర్గానులు, గుండె, రక్తప్రసరణ, ఎముకలు అన్నీకలిసి ఒక గొప్ప ఫాక్టరీని నడిపిస్తుంటాయి.
పరమాత్ముడు పోసిన ప్రాణంతో, శరీరంలోని ఫాక్టరీ, చక్కని డిమోనిస్ట్రేషన్ చూడండి.
యాంత్రిక, లోహ ఫాక్టరీలలో అయితే నిర్దేశించిన ఉత్పత్తి మాత్రమే, యూరియా అంటే యూరియానే ఉత్పత్తి అవుతుంది, సిమెంట్, అంటే సిమెంటే, వస్త్ర పరిశ్రమ అంటే వస్త్రాలు మాత్రమే చక్కెర పరిశ్రమలో చక్కెర మాత్రమే ఉత్పత్తవుతాయి.
కాని, మానవశరీరంలోని పరిశ్రమ, ఎన్నో రకాల వనరులను పదార్థాలను, ఇంధనంగా, ఆహారంగా మలుచుకుంటూ, ఒప్పుకుంటూ, నడుస్తూనే పెరుగుతుంది, బాల్యము నుండి వృద్ధాప్యంవరకు, ఎన్నో రకాల ఉత్పత్తులను, తనలాంటి ఫాక్టరీలను (సంతానాలను) పరిశోధనలను, సరిగమలను సంగీతాలను చదువులను, వైద్యాన్ని, వైజ్ఞానికతలను, వినయవిధేయతలను, గురువు, భక్తి, దయ, దానం, ధర్మం, విచక్షణ, తపస్సులను, ఆధ్యాత్మికతలను, ప్రేమ, శాంతి, అరిషడ్వర్గాలను, మనస్సు నిండా అనంతమైన, విషయాలను ఉత్పత్తి చేయగలదు, వాటి నియంత్రణకు యోగా, ధ్యానం, తపస్సులను కూడా, ఉత్పత్తి చేస్తుంది, పరమాత్ముని సృష్టి, అయిన ఈ అందమైన ఉపాదినే, మానవ జన్మ అంటాము.
హిందూ కర్మసిధ్ధాంతం ప్రకారం, ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత లభించిన దేహం, దైవం కూడ పొందిన అత్యుత్తమ మైన ఉపాది, దానిని అరిషడ్వర్గాలకు ఉపయోగించకుండ, మానవసేవకు పంచభూతాలసేవకు మరియు హిందూధర్మ సంస్కృతికి, ఆధ్యాత్మికతా వ్యాప్తికి, ఉపయోగించి, భగవంతునిపట్ల కృతజ్ఞులమైఉందాం, ప్రాణమున్న ఫాక్టరీతో జీవితాలను చరితార్థం చేసుకుందాం.
No comments:
Post a Comment