Friday, 12 January 2024

 


విగ్రహ ప్రతిష్టాపన జరుగకుండానే...పూజలు చేయకుండానే అక్షతలు ఎలా వచ్చాయి అని మా Meenakshi Vedula  అక్కయ్యకి సందేహం కలిగింది. చాలామంది ఇదే వారి సందేహమని అన్నారు.

మనకు పంపిణీ చేస్తున్న అక్షింతలు విగ్రహ పూజకి సంబంధించినవి కావు. వాటిని అక్కడి పురోహితులు విజయ అక్షతలు అని వర్ణించారు. 500 సంవత్సరాల పోరాటం తరువాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక, ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి, నిర్మాణం జరిగిన తరువాత, బాల రాముని సన్నిధిని కలిగిన ఆలయ ప్రాంగణంలో,  విజయ అక్షతలను బియ్యమూ..పసుపూ..నూనెలతో మంత్రోచ్ఛారణ చేస్తూ కలిపి ఇంటింటికీ పంపించాలని సంకల్పించారు. రాముడు వనవాసం తరువాత అయోధ్యకి తిరిగి వస్తుండగా అందరూ అక్షతలూ పూలూ చేతులలో పట్టుకుని ఆయన రాగానే వాటిని చల్లి.. ఆహ్వానం పలికారట.

 అలాగే మరల అయోధ్య లో రాముని ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షింతలు మనం ఇంట్లో పూజకు వాడి  శిరస్సున ధరించాలని ఉద్దేశ్యము  అక్షయమైనవి అక్షింతలు. క్షయము లేనివి. రామ రాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ  మనందరం విగ్రహ ప్రతిష్ఠ  రోజున (దగ్గరలో ఉండి అక్షింతలు వేయలేకపోయినా...) ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారయిన విజయ అక్షతలతో పూజ చేసుకుని వాటిని శిరస్సున ధరించవచ్చు. క్రింద పడితే తొక్కుతామనే సందేహం ఉంటే పూజలో వాడిన అక్షింతలని నైవేద్యం కోసం వాడుకోవచ్చును. ఈ విషయాలను వీడియోల ద్వారా పండితులు తెలియజేశారు....

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment