ఆది కావ్యమైన శ్రీమద్ వాల్మీకి రామాయణము మన ఇతిహాసము. ఇందులోని ప్రథమ సర్గము "సంక్షేప రామాయణము" గా చెప్పబడింది. ఇందులో వాల్మీకి మహర్షి కొన్ని ప్రశ్నలు అడుగగా నారద మహర్షి సమాధానం ఇస్తారు. వీరి సంభాషణ నూరు శ్లోకాల్లో కొనసాగుతుంది. ఈ నూరు శ్లోకములలోనే సంక్షేపముగా సంపూర్ణ రామ కథను చెప్పడం జరుగుతుంది.
ఈ సంక్షేప రామాయణమును పూర్తి చేస్తూ నారదుల వారు రామ కథను పఠిస్తే కలిగే ఫలితం ఏమిటో చెబుతూ, "వేద సమ్మతమైన ఈ రామ చరితము పవిత్రమైనది, పఠించిన మాత్రాన పాపములను పోగొట్టునది. పఠించువారి పుత్ర పౌత్రాదులే కాకుండా సేవకులు సహా స్వర్గాది ఉత్తమ లోకములకు వెళతారని, అన్ని వర్ణముల వారికి, వర్ణోచిత ఉత్తమ ఫలితం లభిస్తుంది" అని చెప్పారు.
అంటే రామ కథను పఠించన మాత్రాన ఇహలోకములో భోగము పరలోకములో మోక్షము సులభమవుతాయి.
మన శాస్త్రాలలో మౌఖిక జపం లేదా పాఠం చేయడం కంటే లేఖన జపానికి మహాత్మ్యము మరియు ఫలితము ఎక్కువగా చెప్పారు. మౌఖిక జపము పాఠము చేసేటప్పుడు మనసు కుదురుగా ఉండడం అంత సులువు కాదు. కానీ లేఖనం చేసేటప్పుడు చేతులు, వాక్కు, కన్నులు, మనసు అన్నీ ఆ క్రియలో లీనమవుతాయి. ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా చేస్తేనే కదా పూర్తి ఫలితాన్ని ఇచ్చేది. అందుకే చాలామంది రామ నామాన్ని జపించే కన్నా రామకోటి రూపంలో రాయడం చేస్తూ ఉంటారు.
ఈ ఆలోచనే ఆధారంగా చేసుకుని రామభక్తుల సేవలో "సంక్షేప రామాయణము" ను లేఖన పుస్తకము రూపంలో తేవడం జరిగింది. ఇందులో శ్లోకములన్నీ ముందుగానే dotted రూపంలో ఉన్నాయి. మీరు పఠిస్తూ ఆ ఆక్షరాలపై pen త్రిప్పితే చాలు. ఇలా మీకోసం రామాయణ లేఖనం అత్యంత సులువు చేయటానికి ప్రయత్నించాము.
భాష, వ్యాకరణం ఇత్యాది వచ్చినా రాకపోయినా సరే చిన్నపిల్లలతో సహా అందరూ సులువుగా రామాయణం రాయగలగాలనేదే మా ఏకైక లక్ష్యం. మీరు ఈ సదవకాశాన్ని వినియోగించగలరని మనవి.
శ్రీసీతారామచంద్రులు మీకు నారదుల వారు చెప్పినట్టుగా ఇహ పర లోకములలో భోగ మోక్షములను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తున్నాము.
మీ కుటుంబములో శ్రీరామ భక్తి నిరంతరము ప్రవర్ధమానమవుగాక.
ఈ పుస్తకము 100% FREE/నిఃశుల్కము.
No comments:
Post a Comment