Monday, 8 January 2024

🙏శ్రీరామనామ మహిమ🙏

 

                

పరబ్రహ్మ సాకార రూపానికి ఈ నామము పెట్టినది బ్రహ్మశ్రీ సప్తమహర్షులలో ఒకరైన వసిష్ఠుడు. వారే శ్రీరామునకు గురువుకూడా, గురువుల పెట్టిన నామం...

*రామ: వేదములలో మాట. 

ఈ మాట అన్నది శ్రీ లక్ష్మణస్వామి అదీ శబరి ‘శ్రీ రామ రామ’ అని జపము చేస్తుండగా, ‘ఎవరు ఈ నామము చేస్తున్నది?’ అని రామునిప్రశ్నకుసమాధానముగా, 

*అన్ని మంత్రాలూ ఒక ప్రక్క 

శ్రీ రామ తారక మంత్రం ఒక ప్రక్కఅనియజుర్వేదములోని  మాట,..

*ఇంకా అన్ని మంత్రాలకు నియమాలు ఉంటాయి, కానీ రామ నామానికి నియమాలు లేవు. 

*నామము సులువు, ఫలితం అధికం  ఇంతమంచి పేరెలా పెట్టారయ్యా అంటాడు శ్రీ త్యాగరాజు తన కీర్తనలో. 

*ఈ నామ మహిమ, దాని జప, మననము వల్ల కల్గు ప్రయోజనములు చూద్దాము...

*అందరికి తెలుసు రామ నామము  వేదములలోనిది అని. 

*ఆ నామమే శ్రీ వశిష్ఠ మహర్షి స్పృహకు వచ్చినది.

*రామ అంటే అందగాడు, ఆనంద స్వరూపుడు అని అర్ధం. 

*సత్ (శాశ్వతమైన ఉనికి), 

చిత్ (చైతన్యం) ఆనందస్వరూపుడు, జగదానందాకారకుడు...

*యజుర్వేదంలోని సారతారోపనిషత్ ఆధారముగా రామ లో వున్న బీజాక్షరాలు మూడు, 

ఈ మూడు - మూడు రత్నాలు, వీటిని మనము రోజు చూస్తూనే వున్నాము, అవి లేకుండా ఈ ప్రపంచము, జీవరాశి బ్రతుకలేవు, పరబ్రహ్మ స్వరూపాలు.

1) ర - అగ్ని,

2) అ - సూర్య,

3) మ- చంద్ర...

*శ్రీకృష్ణపరమాత్మ భవత్గీతలో సూర్య, చంద్ర అగ్నులలో తేజోరూపము లేదా తేజస్సు నా రూపము అన్నాడు. 

ఈ మూడింటిలో వుంటూ మూటిలో  వున్న తేజస్ స్వరూపం రాముడు. 

నిజానికి ఈ మూడు శక్తులు మనలో కూడా వున్నాయి.

1) ర-అగ్ని - వాక్కు ,

2) అ -సూర్య -దృష్టి 

3) మ - చంద్ర -మనస్సు,

...ఇవే మనోవాక్కాయములు.

ఈ త్రికరణాలకు శక్తిని ఇస్తూ వీటికి అతీతముగా మనలో వున్న ఆత్మ స్వరూపుడు.

*రామ పదానికి మతానికి, కులానికి లింగ వర్గ భేదాలు ఉన్నాయా... రామ ఒక  వ్యక్తి పేరు కాదు, పరమాత్మ పేరు..!

*సర్వజీవులలో ఆనందమూర్తిగా ప్రకాశించువాడు. 

*అందుకే అంతా రామమయం అన్నాడు  శ్రీ రామదాసు... ఆయనకు రాముడు అలా అర్ధం అయ్యాడు.

*శ్రీ విద్య పరిచయం ఉంటే, 

*శ్రీ చక్రం లో 9 ఆవరణలు వుంటాయి. 

అవి మొదటి మూడు అగ్ని మండలం, తరువాతి మూడు సూర్య మండలం ఆ తరువాతి మూడు చంద్రమండలం. 

*అంటే శ్రీచక్రం= శ్రీ రామ. 

అవి మనలో కూడా వున్నాయి, మనలో మూలాధార చక్రము నుండి మణిపూరక చక్రము వరకు అగ్ని మండలం, హృదయస్థానం - అనాహతం నుండి ఆజ్ఞా చక్రం వరకు సూర్యమండలం, 

ఆపైన చంద్రమండలం. 

శ్రీ విద్య యే శ్రీ రామ.  

అందుకే అన్నారు శ్రీరామో లలితాంబిక. 

లలిత = అతి లావణ్యమైన,

రామ= అత్యంత అందగాడు, రెండు ఒకటే. 

*శ్రీ రామ రామ రామ అంటూ ఉంటే మనకు తెలియకుండానే కుండలినీ శక్తి జాగరణ చెందుతుంది. 

*ఇంకో విషయం ఏమిటి అంటే ఇక్కడ యజ్ఞపరముగా:    

రా  లో రెండు అక్షరాలు కలసే వున్నాయి  అంటే  ర+అ = అగ్ని+సూర్య (వేడి), మ అంటే చంద్ర అంటే సోమము, అంటే తడి పొడి, ఇది వేదములలో మాట,  ఈ జగత్తు మొత్తం అగ్ని సోమాత్మకం.  

యజ్ఞం చేస్తున్నపుడు అగ్ని కి సహకార సోమము (నేయి). యజ్ఞం ద్వారా వచ్చేవాడు యజ్ఞస్వరూపుడు పరమాత్మ, యజ్ఞముద్వారా దేవతలకు శక్తి ఇస్తున్నాడు. 

ఇక్కడ రామ = యజ్ఞస్వరూపుడు. 

అగ్ని పైకి, సోమము క్రిందకు చూపిస్తున్న త్రికోణం వేస్తె అదే షణ్ముఖ శక్తి షట్కోణం, అక్కడ ఉద్బవమయ్యే శక్తి సుబ్రహ్మణ్యుడు. 

ఇక్కడ రామా అంటే సుబ్రహ్మణ్యుడు.  

ఇంకా ఎన్నో ఎన్నో, ఎన్నని చెప్పాలి అందుకే శివుడు అన్నాడు ‘శ్రీ రామ రామ రామ’ అని మూడు సార్లు అనరాదా దాని మహిమ… 

అంటే సహస్రనామ చేసినట్లే. 

అంటే ఇక్కడ సహస్రనామము పారాయణ తప్పించుకోడానికి చెప్పిన మార్గము కాదని మనవి. 

ఆ మూడు సార్లు రామ నామము అంటే దాని మహిమను చెప్పడానికి పరమాత్మ చెప్పిన సమాధానము. 

దానికి ముందు జై పెట్టి, అమ్మ సీతమ్మను కూడా కలిపితే అదే మహా మంత్రము.🙏

🙏 జై శ్రీ సీతారామ్..🙏

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment