జాతకం లో ఉన్న భయంకరమైన నాగ దోషాలు,కాలసర్ప దోషాలు తొలగించుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం.
చాలా మంది జీవితంలో ఎంత కష్టపడ్డా సరే అభివృద్ధి ఉండదు.ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. చేతిలో డబ్బు నిలవదు.కుటుంబ సమస్యలు ఉంటాయి, అకారణంగా గొడవలు పడుతూ ఉంటారు వీటన్నింటికి కారణం జాతకంలో రాహు కేతువు
దోషాలు ముఖ్యమైన కారణంగాచెప్పవచ్చు.
జాతకం లో గ్రహాలన్నీ రాహుకేతువులు మధ్య ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు.
జాతకం లో ఉండే రాహు కేతువు గానీ దోషపూరితంగా ఉంటే దానిని రాహు కేతు దోషం అంటారు.రాహువు సర్పముయొక్క తల ఆకారంలో ఉంటుంది. కేతువు సర్పముయొక్క
తోక ఆకారంలో ఉంటుంది.
ఈ రెండింటి మధ్యన గ్రహాలు బంధింపబడి వున్నప్పుడు జాతకంలోని అదృష్టమంతా ఈ రెండు గ్రహాల మధ్యన ఇరుక్కుపోయి ఉంటుంది. దీనివలన జాతకుడికి అదృష్టముండదు, డబ్బు ఉండదు, వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటాయి,సంతానం పరమైన సమస్యలు ఉండవచ్చు, సంతానం తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు,ఏది కలిసి రాకుండాఉంటుంది.
జాతకంలో రాహు దోషం కానీ నాగదోషం లేదా సర్పదోషం గాని ఉన్నప్పుడు నూటికి తొంభై మందికి అదృష్టం కలిసి రాదు. జీవితంలో స్థిరత్వం లేకుండా ఉంటుంది, డబ్బు నిలబడకుండా ఉంటుంది. ఏం చేసినా కలిసి రాదు జీవితంలో డబ్బు ఉండదు. అదృష్టం తొందరగా కలిసి రాదు కాబట్టి తొందరగా కలిసిరావాలంటే బాగా డబ్బు సంపాదించాలంటే జాతకంలో వున్న రాహు దోషాలు కాలసర్ప దోషాలు పోగొట్టే పరిహారం పాటించాలి.
మొదటిగా ప్రతిమంగళవారం దేవాలయానికి వెళ్లి ఆ దేవాలయంలో ఉన్నటువంటి రావిచెట్టు కింద కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఉన్న జంట నాగుల విగ్రహం దగ్గరికి వెళ్లి ఆ నాగులు విగ్రహంపైనా కొద్దిగా పసుపు కుంకుమ జల్లి పాలుపోసి అభిషేకం చేయాలి. వాటితోక దగ్గర జిల్లేడు ఆకు పై బెల్లం ముక్క ఉంచి నైవేద్యం పెట్టాలి.
ఈ విధంగా కనీసం తొమ్మిది మంగళవారాలు చేస్తే దోషాలన్నీ పోయి అదృష్టం కలిసి వస్తుంది ,అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి.
అలాగే ఆదివారం పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ జల్లి పుట్టలో పాలు పోయాలి. పుట్ట దగ్గర చలిమిడి నైవేద్యం పెట్టి చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి ఇలా మంగళవారం జంట నాగుల విగ్రహాలకు ఆదివారం పుట్టలకు పూజ చేస్తూ ఉంటే రాహు కేతువు దోషాలు తొలగి పోతాయి.
వీలైనప్పుడు మంగళవారం పూట సుబ్రమణ్య స్వామి దేవాలయానికి వెళ్లి మధ్యాహ్నం 3 నుంచి నాలుగున్నర సమయం మధ్యలో దేవాలయం లో దీపం పెట్టండి. దీనివలన మీకు ఉన్న దోషాలు తొలగిపోయి తొందరగా అదృష్టం కలిసొస్తుంది
No comments:
Post a Comment