ॐॐॐॐॐॐॐॐॐॐ
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర,
తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద
కరుతై ప్పిళ్ళైత్తు కఞ్ఙన్ వయిత్తిల్
నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై
ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుతియాకిల్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్!!
భావం
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా ! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి, వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపినా ఆశ్రిత వ్యామోహము కలవాడా ! నిన్నే కోరి వచ్చినారము. 'పఱ' అను వాద్యమును ఇచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము.
ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము. మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము . నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.
అవతారిక
ॐॐॐॐॐॐॐॐॐॐॐ
గోపికలు ఈ పాశురములో శ్రీకృష్ణుని జన్మరహస్యమును కీర్తించుచు దానివలన తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్పుచున్నారు. కృష్ణుడు అవతరించిన తీరును, పెరిగిన తీరును తలచుకొని ఆ వాత్సల్యమునకు ముగ్ధులై ఆళ్వార్లు మూర్ఛనొందిరి. అట్లే గోపికలు వెనుకటి లీలలన్నిటికంటే చివరగా శ్రీకృష్ణ జనన ప్రకారము అనుభవించి పరవశలగుచున్నారు.
గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమకాని కేవల వ్యామోహము కాదు. భగవత్తత్వముగా ఎరింగి ఆ పరతత్వము మనకై సులభముగా దిగివచ్చి, నాలుగు అడుగులు నడచి వచ్చిన మనలను చూచి శ్రమ అయినదని జాలి పడుచున్నాడే ? మనకై అతడు పడిన శ్రమలో మనము ఆతనిని పొందుటకై పడెడి శ్రమ ఎన్నవ వంతు ? అని అతని జన్మ ప్రకారము అనుసంధించుచున్నారు.
'మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!' అని అండాళ్ తల్లి స్వామి ఆయా . అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి 'మీకేమి కావలయున 'నిన; మాకేవైన ప్రతిబంధకములున్న వానినెల్ల నీవే పోగొట్టి. మాలోని, అన్యకామనలేమైనయున్న వాటిని 'నశింపచేసి' మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన అండాళ్ తల్లి యీ (పాశురంలో) అర్ధించుచున్నది.
ॐॐॐॐॐॐॐॐॐॐ
శ్రీ కృష్ణావతార రహస్యం
ఆండాళ్ తిరువడిగలే శరణం
ॐॐॐॐॐॐॐॐॐॐ
ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది, అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావై ని మనం విశ్వసించాలి. భగవంతుడు మనకోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి, ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కల్గించి చేసే ఉపకారం. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతక గల్గితే మనం ఉన్నచోట భగవంతుణ్ణి సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా, ఇక సృర్తినిచ్చేవిగా ఉండగల్గుతాయి. గోదా దేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది.
No comments:
Post a Comment