ప్రపంచం మొత్తం మీద భారతదేశం 1 నాగరికత నేర్చిన దేశం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే వేదం అనే పేరుతో విజ్ఞానశాస్త్రము జ్యోతిష రూపంలో వేదభూమి ఒక అద్భతమైన వరాన్ని అందించింది.
వినాయకుని మన లగ్నం గా భావిస్తారు. ప్రతి ఒక దేవుడి పేరు చెప్పి మనం రాశులనీ గౌరవిస్తాం ,పూజిస్తాం .
శ్రీరాముడిని మేషరాశిలో
వృషభములో శివుడునీ
కర్కాటకము లో కార్తికేయుడు
మీనం విష్ణుమూర్తి మత్స్యావతారము అంటూ కుంభము ధన్వంతరి రూపమని కూడా ప్రార్థిస్తారు హిందువులు. జ్యోతిషం శివ శక్తశక్తి స్వరూపంగా, శ్రీచక్ర ప్రతిరూపంగా ఆరాధిస్తాం. దేహము దేవాలయం, నాడీ వ్యవస్థను నవగ్రహ రూపాలుగా కొలుస్తాము. ఉచ్చ్వాస, నిస్వాసములను ఓంకార నాదం తోనే పిలుస్తాము.
ప్రాణి పుట్టుక నుండి చివరివరకూ దైవ సంబంధిత కార్యక్రమాలతో జరిపించే జాతి మనది.
పాపులుగా పిలవబడే సర్ప రూపాలైన రాహు కేతువులకు కూడా మనవారు సముచిత స్థానం ఇచ్చారు .
విష్ణుమూర్తి పవళించే పానుపు ఆదిశేషువు మరియు శివుని మెడలో హారంగా ఉన్న సర్ఫరాజు, రెండూ మనకు వందనీయములే.
ఈ మధ్యనే శాస్త్రవేత్తలు, జ్యోతిష పండితులు రాహుకేతువులకు మంచి తార్కికమైన భావనను ఆపాదించారు రాహువు కోరికలకు మరియు కేతువు వైరాగ్యానికి సూచన అని అంటారు. విష్ణుమూర్తి పవళించిన ఆదిశేషుని దృష్టి విష్ణుమూర్తి పాదములు వద్ద ఉన్న లక్ష్మీదేవి మీద సూటిగా పడుతుంది అని చక్కగా సెలవిచ్చారు. లక్ష్మీదేవి కోరికలకు మూలమైన శుక్రుని సూచిస్తుంది రాహు రూపాన్ని ప్రతిబింబిం గా ఉన్న ఆదిశేషుడు
నిరంతరం శ్రీ లక్ష్మి మీదనే తన దృష్టి పెట్టడం వలన కోరికలకు ఆలవాలం అయ్యాడు అని అన్నారు. నిజంగానే రాహువు శుక్రుడు మంచి మిత్రులు. అదేవిధంగా ఆదిశేషుని తోక భాగం అమ్మవారికి తగలకుండా పాలసముద్రంలో అడుగు భాగంలో ఉంటుంది. అనగా కోరికలు కు వ్యతిరేకంగా వాంఛలకు దూరంగా మోక్ష సాధనకై వేచి చూస్తూ ఒంటరిగా ఉంటుంది . సముద్రపులోతులో అన్వేషిస్తూ గడుపుతూ ఉంటుంది కానీ, ఊర్థ్వ మొఖం కేసి దృష్టి పెట్టదు. ఇది అంతా కూడా కేతువు స్వభావం. మనము కూడా రాహు కేతువులు ఒక్క శరీరం నుండి ఉద్భవించారు నమ్ముతాము కదా! అనగా రాహు కేతువులను తన ఆధీనంలో ఉంచుకున్న లక్ష్మీనారాయణుడు చూపే మాయాజాలంలో వ్యామోహంలో జీవి చిక్కకుండా తన కర్మని నిర్వర్తించాలి. అది భగవద్గీతలో విష్ణుమూర్తి మళ్ళీ తానే అయి బోధించాడు . ఇదంతా చదువుతూ ఉంటే లేదా విషయాలు తెలుసుకుంటూ ఉంటే ధర్మం ఎలా పాటించాలి, ఏవేవి ధర్మానికి అనుకూలంగా ఉంటూ ఉంటాయి అనేవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి.
వేదం పని అనగా కర్మ సిద్ధాంతం చెబుతుంది. అందుకే ఈ విజ్ఞానం అందరికీ పంచుదాం. శుభం.
No comments:
Post a Comment