మనుషులను గుర్తించడానికి నమోదుచేసే అంశాలలో వేలిముద్రలు, పుట్టుమచ్చలు ముఖ్యమైనవి. ఈ రెండూకూడా ఎవరివి వారికే తప్పించి… ఒకరికి ఉన్నట్లు మరొకరికి ఉండవు. అందుకే ప్రతి విద్యార్ధికి వారి స్కూల్ రికార్డ్ లో తప్పనిసరిగా పుట్టుమచ్చలు నమోదుచేస్తారు. అవే వారికి జీవితకాలం గుర్తుగా నిలుస్తాయి. జ్యోతిష్యులు శరీర లక్షణాల ఆధారంగా వ్యక్తి జీవితాన్ని చెబుతారు. అందులో పుట్టుమచ్చల ఆధారంగా కూడా కొన్నిఫలితాలు చెప్పగలుగుతారు. అయితే పుట్టుమచ్చలు ఒకటే కాక మిగతా విషయాలన్నీ సమన్వయించుకుని జ్యోతిష్యశాస్త్రజ్ఞుడు ఫలితాలు చెబుతాడు. అంతర్జాలంలో దొరికిన ఈ వివరాలను కేవలం సమాచారం కోసం మీకందిస్తున్నాము.
1. ముఖం పై పుట్టుమచ్చల ఫలితాలు
- ఎడమకన్ను – స్వార్జిత ధనార్జన
- కుడికన్ను – అనుకూల దాంపత్యము
- ముక్కుమీద – కోపము, వ్యాపార దక్షత
- గడ్డము – విశేష ధన యోగము
- నుదిటి మీద – మేధావి, ధన వంతులు
- దవడల యందు( స్త్రీ లకు ) _ దుఖ: వంతులు
- ముక్కు ప్రక్కల యందు – దేశ సంచారి
- గడ్డమందు – ధనము ,కీర్తి
- పెదవులందు – చమత్కారులు
- ముక్కు మీద – కార్య సిద్ది
- చెక్కిలి యందు – సకల భోగాలు
- ఎడమ కనుబొమ్మ – దురదుష్టం
- కుడి కనుబొమ్మ – ధన వంతులతో వివాహం
- ఎడమ కణత – అపజయాలు, దుర దృష్టం
- కుడి కణత – ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు
2. మొండెము భాగం లో గల పుట్టుమచ్చలకు ఫలితాలు
- గళము నందు – వివాహం వలన ధన ప్రాప్తి
- కంఠము – ఆకస్మిక ధన లాభం
- మెడమీద – భార్యద్వారా ధనయోగం
- చంకల నుండి కటి ప్రదేశము వరకు (కుడి ఎడమ ప్రక్కలు ) – ఆరోగ్య భంగం, ధన వ్యయం
- కుడి భుజం– వివేకులు, వినయము కలవారు
- కుడి భుజం – త్యాగము,విశేష కీర్తి ప్రతిష్ట్రలు
- ఎడమ భుజం – మూర్ఖత్వానికి గుర్తు
- కుడి బాహువు – బల ధైర్యవంతులు
- ఎడమ బాహువు – కార్య సిద్ది
- మోచేయి దగ్గర – చంచలత్వం
- మోచేయి క్రింద – జీవితాన్తమున ధన లాభము
- మోచేయి – వ్యవసాయ దృష్ట్యా ధనప్రాప్తి
- కుడిచేయి మణికట్టునందు – విశేష బంగారు ఆభరణములు ధరించుట
- చేతి బ్రొటన వ్రేలు – స్వతంత్ర విద్య, వ్యాపారం
- కుడి చేయి చూపుడు వ్రేలు – ధనలాభము, కీర్తి
- పొట్టమీద – భోజనప్రియులు
- పొట్టక్రింద – అనారోగ్యం
- ఉదరము – తిండి పోతూ, దురాశ కలవారు
- పొత్తి కడుపు – బల హీనతలు కలవారు
- బొడ్డులోపల – ధనలాభములు
3. నడుము క్రింది భాగము నుండి పాదాలవరకు గల పుట్టుమచ్చల ఫలితాలు
- కుడి తొడ – అదృష్టము
- ఎడమ తొడ – దారిద్యము
- కుడి మోకాలు – భార్య వలన గృహ సౌక్యము
- ఎడమ మోకాలు(పురుషులకు ) – అల్ప బుద్ధి
- ఎడమ మోకాలు( స్త్రీలకూ ) – అధిక సంతానం
- కుడితొడ – ధనవంతులు
- ఎడమతొడ – సంభోగం
- పిక్కల యందు – అలసత్వం
- పాదాల యందు– ఆకస్మిక అనారోగ్యం, ఆకస్మిక మరణం
- పాదముల మీద – ప్రయాణములు
- మర్మస్థానం – కష్ట సుఖములు సమానం.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment