హారతి.. ఏ పూజ చేసినా.. ఎలాంటి నోము నోచినా హారతి మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హారతి లేని ఆరాధనను అసంపూర్ణంగా పరిగణిస్తారు. అందువల్లే పూజలు ప్రారంభించే ముందే పళ్లెంలో హారతి ఇచ్చేందుకు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఆరాధనలో హారతికి ఎందుకంత ప్రాముఖ్యతనిస్తారు? అనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. ఇందుకు సమాధానం స్కందపురాణంలో కనిపిస్తుంది. స్కందపురాణం ప్రకారం మంత్రాలు తెలియకపోయినట్లయితే పూజ విధానం తెలియనట్టే. అదే హారతి ఇస్తే ఆ ఆరాధనను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు. అందువల్ల మంత్రాలు తెలియకపోయినా హారతి ఇవ్వడం వల్ల పూజ సంపూర్ణమవుతుంది.
హారతికి శాస్త్రీయ కారణం..
హారతి ఇవ్వడమనేది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని చాలా మంది అనుకుంటారు. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హారతి కోసం పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించే హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం. ఇందులో కల్తీ ఉండదు. అదేవిధంగా నెయ్యి పాలలో ప్రాథమిక మిశ్రమం. కర్పూరం, చందనం స్వచ్ఛమైన సాత్విక పదార్థాలుగా పరిగణిస్తారు.
అద్భుతమైన సువాసన..
పత్తితో పాటు నెయ్యి, కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంద పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలల వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.
మనస్సు భగవంతుడిపై లగ్నమవుతుంది..
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment