Monday, 26 October 2020

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను లోో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!
విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితము ఇస్తాయి. అందరు కొన్ని చదవకూడదు. కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. బీజాక్షరములను ఉపాసన చెయ్యడము కష్టం. పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.
'అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు. మనం చెయ్యలేని చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా ప్రమాదము లేని రీతిలో మనతో చేయించేయడానికి ఇటువంటి ప్రయోగము చేశారు.
'అమ్మలగన్నయమ్మ’ – లలితాసహస్రము 'శ్రీమాతా’ అనే నామముతో ప్రారంభమవుతుంది. 'శ్రీమాతా’ అంటే ’శ’ కార 'ర’ కార ’ఈ’ కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఆయమ్మ – 'లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికి, దుర్గాస్వరూపమునకు భేదం లేదు – 'అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ.
'చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతములోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన శక్తిస్వరూపము. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదము లేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉన్నది. అలా ఉండడము అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.
అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ,
'సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ దితి. దితి ఏడిచేటటుగా కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.
'తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట.
మనకి సంప్రదాయములో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.
ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.
'రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’
అని దేవీభాగవతములో వ్యాసభగవానుడు అంటారు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మే లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.
’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఆవిడ దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.
అమ్మవారికి 'శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములని పిలుస్తారు. బీజాక్షరము అంటే “Letter Pregnant with sound” అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామివారు. బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చెయ్యకూడదు, చేయలేము. ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగము చేశారు. మహత్వమునకు బీజాక్షరము 'ఓం’ కవిత్వమునకు బీజాక్షరము, 'ఐం’ పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము, 'హ్రీం”, సంపదలు – లక్ష్మీదేవి – 'శ్రీం’ 'ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రే నమః’ బీజాక్షరములతో అస్తమానము అలా అనడానికి వీలులేదు. మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చేసినా, చెయ్యక పోయినా, ఎక్కడ ఉన్నా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అనుకుంటుంటే మీరు మరోరూపంలో 'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – 'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అంటూ ఎప్పుడూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం 'శ్రీమాతా’ అంటూ అమ్మతనముతో ప్రారంభమవుతుంది.
అమ్మవారు రాజరాజేశ్వరయినా ఆవిడముందు అమ్మా! అమ్మా! అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడము చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. 'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. 'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఉండదు ఈవిధముగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు. ఆయన ఒక ఋషి కనుక ఆ పద్యమును ఇచ్చారు....
( బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గారి సౌజన్యం)

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Image may contain: 1 person

No comments:

Post a Comment