Wednesday, 7 October 2020

ఖగోళాన్ని భూగోళానికి దింపిన అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు

 




https://www.facebook.com/vidhathaastornumerology/



ఒరిస్సా ముఖ్య పట్టణం భువనేశ్వర్ కు ‘’ఆలయాల నగరం ‘’అని పేరు .అక్కడి దేవాలయాలను అంతరిక్ష నక్షత్ర మండలాలకు ప్రతీకలుగా నిర్మించటం విశేషం .నక్షత్ర సీమల మధ్య ఉండే దూరాలు వాటి మధ్య అనుబంధాలే మన ప్రాచీన ఆలయ నిర్మాణాలు .ఇవి చూసి ఈ నాటి శాస్త్ర వేత్తలు అలనాటి మన వాళ్ళ వైదుష్యానికి ముక్కున వేలేసుకొంటున్నారు .
.పరాసు రామ దేవాలయం శిఖరం
భువనేశ్వర్ లోని ప్రాచీన ‘’పరశురామాలయం ‘’నిర్మాణం పై దీపక్ భట్టా చార్య 2010లో పరిశోధన చేసి ఎన్నో విషయాలను లోకానికి చాటి చెప్పాడు .ఈ ఆలయ నిర్మాణం మామూలు నిర్మాణ శైలి లో కాకుండా భిన్నం గా ఉందని ముందు గుర్తించాడు .దీనికీ ఖగోళ సంబంధం ఉందని భావించాడు .అతరిక్షం లో నక్షత్రాలు వేర్వేరు దూరాలలో పరచుకొని ఉన్న రీతిలో ఆలయం లోని కొన్ని ముఖ్యమైన కళా రూపాలు కూడా భిన్న భిన్న కోణాలలో ,దిశలలో అమరి ఉండటం చూసి పరమాశ్చర్య పడ్డాడు .తనకున్న పరిజ్ఞానం చాలక ,మరింత లోతుగా అధ్యయనం చేయటం ప్రారంభించాడు .ఈయనకు ప్రహ్లాద చంద్ర నాయక సహకరించాడు .అంతరిక్ష గణితం లో దిట్ట అయిన ప్రహ్లాద కూడా ఏంతో జిజ్ఞాసతో కృషి చేశాడు .చివరికి అంతరిక్షం లో ‘’తారకల అమరిక’’ నే భువనేశ్వర్ లోని ఆలయ నిర్మాణాలలో కూడా ఏర్పరచారని ఇద్దరు తేల్చారు .
భువనేశ్వర్ పాత బస్తీ లో ‘’ఏకామ్ర క్షేత్రం ‘’పరిధిలో సముద్ర మట్టానికి భిన్న మైన ఎత్తు లో ఉండే మూడు ప్రదేశాలున్నాయి .ఒక్కో ప్రదేశం లో తొమ్మిది చొప్పున ఇరవై ఏడు ప్రాచీన నిర్మాణాలున్నాయి .ఇవి నక్షత్రాలకు ప్రాతి నిధ్యం వాహించేవే అని వీరిద్దరి పరి శోధన లో తేలింది .ప్రకాశ వంతమైన నక్షత్రాలను ఒక జాబితా గా రూపొందించే ‘’అంతర్జాతీయ ఏల్ కేటలాగ్ ‘’లో ఉన్న 27నక్షత్రాలకు ,ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలు ప్రాతి నిధ్యం వహిస్తున్నాయని ఎత్తూ ,దూరాల విషయం లో వాటి పరస్పర సంబంధాలు కూడా ఇక్కడా ప్రతి బిమ్బిస్తున్నాయని నిర్ధారించారు .గణిత శాస్త్రానికి సంబంధించిన ఈ నిర్ధారణ కు ‘’కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్’’ (క్యాడ్ )సాఫ్ట్ వేర్ ను వినియోగించుకొన్నారు .
అంతరిక్షం లో ఉన్న నక్షత్ర మండలాలకు ,భూమి మీద ఉన్న ఈ నిర్మాణాలకు ఉన్న సంబంధాన్ని తులనాత్మకం గా అధ్యయనం చేసిన తర్వాత మన ప్రాచీనులు తారా మండలాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎంపిక చేసిన ప్రత్యెక ప్రదేశాలలో ఈ నిర్మాణాలు చేశారని స్పష్టం చేశారు .భువనేశ్వర్ లో ‘’బారంగ ఘడ్ ,శిశుపాల్ ఘడ్ మొదలైన శివారు ప్రాంతాల్లో చతురస్రాకా రాలలో ఉన్న కోటలను అంత రిక్షం లోని ‘’పిగాసన్ స్క్వేర్ ,క్రేటర్ నక్షత్ర మండలాలకు ప్రతి నిధులుగా నిర్ణయించారు .అలాగే రెండు త్రిభుజా కారాల్లో రూపొందించి నట్లు కనీ పించే ‘’సెటస్’’నక్షత్ర మండలం ‘’ఖంద గిరి,ఉదయ గిరి ప్రాంతాలను ,’’వేలా ‘’నక్షత్ర మండలం భువనేశ్వర్ తూర్పు తీరం లోని ఓడ రేవునూ సూచిన్చేట్లు ఉండటం విశేషమైన విషయం .
భట్టా చార్య ,ప్రహ్లాదలు 2000 మే నెలలో ఒక సదస్సు జరిపి తమ పరిశోధనలు ఊహా గానాలు కావని సభా ముఖం గా బహిర్గతం చేశారు
. వీరి ఖగోళ గణితం ప్రకారం విడి విడిగాను,సంయుక్తం గాను కనీ పించే 33 నక్షత్రాలకు కేంద్రం గా భావించే ‘’బేబెల్ గూస్ ‘’ అంత రిక్ష స్థానం ,వీరి ఖగోళ గణితం ప్రకారం భువనేశ్వర్ లోని ‘’పరశు రామాలయం ‘’ప్రాంతాన్నే సూచిస్తోంది .ప్రకాశ వంతమైన ఎరుపు రంగు లో ఉండే ‘’బెటల్ గూస్ ‘’నక్షత్రాన్ని ఋగ్వేదం తెలియ జేస్తోంది .పరశురామేశ్వరం లో శివ లింగం మామూలుకు భిన్నంగా ప్రకాశ వంతమైన ఎరుపు రంగులో ఉండటం ఇక్కడి విశేషం .దీన్ని కేంద్రం గా తీసుకొని ఊహా రేఖలను గీస్తే అంతరిక్షాన్ని60 డిగ్రీల కోణం లో ఆక్రమిస్తూ ఏర్పడే మహా నక్షత్రం ‘’తారక ‘’ఆకారం కూడా ‘’ఏకామ్ర క్షేత్ర ఆలయ ‘’లక్షణాలతో సరిగ్గా సరి పోవటం మరీ విశేషం .’’ఆరియస్ ,కాసియోపియా ,హైడ్రా ‘’‘’మొదలైన అనేక నక్షత్రాల జాడలను కూడా ఈ ప్రాచీన ఆలయ నిర్మాణాలలో ప్రతి బిమ్బింప జేసిన ఘనత, మేధా శక్తి మన ఆలయ స్తపతులకు ఉండటం ఏంతో ఆశ్చర్య జనక విషయం .అందుకే ఖగోళాన్ని భూగోళం పై దింపారు అలనాటి మన శిల్ప స్రష్టలు అని ముందే చెప్పాను
.
ఇక్కడ ఇంకో ఆశ్చర్య కరమైన విషయం కూడా ఉంది .నక్షత్రాల ప్రాతి నిధ్యం వహించే ఈ భువనేశ్వర్లయాల నిర్మాణం లో ఆలయాల అభి వృద్ధికి ,పతనానికి కూడా ఆయా నక్షత్రాల గమనంతో సంబంధం ఉందని పరిశోధకులు చెప్పారు .’’సిగ్నస్’’నక్షత్ర మండలం ను ఒరియా భాషలో ‘’చాయా లేక అగ్ని ‘’అని అంటారు .అది తన ప్రదేశాన్ని మార్చుకోన్నప్పుడు భూమి మీద అది ప్రాతి నిధ్యం వహించే నిర్మాణాలు ,ఆలయాలు శిధిలం గా మారటాన్ని ఇందుకు రుజువుగా సూచించారు .పూరీ భువనేశ్వర్ ‘’ప్రాచీ లోయ ‘’లోని ‘’కోణార్క్ ‘’లలో ఉన్న ఈ నాడు కనీ పించే శిధిలాలు ఇవే .
భువనేశ్వర్ లో అతి భారీ స్తాయి ఆలయం ‘’లింగ రాజు ‘’ఆలయం పై భాగం మామూలు ఆలయాలకు భిన్నం గా ‘’పినాక ధనువు ‘’పేరుతొ ఒక విల్లు ఆకారం లో ఉండటం విశేషం .శాస్త్ర వేత్తల లెక్క ప్రకారం ఇది ‘’రేజేల్ ‘’నక్షత్ర మండలానికి ప్రతీక .ఆ నక్షత్ర మండలం ధనుస్సు ఆకారం లోనే ఉంటుంది .ఈ విధం గానే ఈ ఆలయ శిఖరం కూడా అలా ఉండేట్లు నిర్మించారన్న మాటకనుక మన ప్రాచీనుల శాస్త్ర అవగాహనయెంత విశాలమైనదో, లోతైనదో అర్ధం అవుతోంది .ఖగోళ శాస్త్రమే కాదు వైద్య శాస్త్రం లోను ఇప్పుడు ఆలయ నిర్మాణ శాస్త్రం లోను మన వారి ప్రతిభ అంతరిక్షాన్ని ముట్టిందని అర్ధమవుతోంది .


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371






No comments:

Post a Comment