ప్రశ్న అడిగినవారు: బసవేశ్వర్, మామిడాల
మీరు విన్నవి సరైనవి కావు. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకుని పూజించడం ఐశ్వర్యకరం. రుద్ర నమకాదులతో అభిషేకించడం, పూజించడం మంచిది.
అలాగని రుద్రనమకాదులతోనే పూజించాలన్న నిబంధన ఏమీ లేదు.
శివనామాలు చెప్పుకుంటూ అభిషేకించవచ్చు.
అష్టోత్తర శతనామాలతోనూ అభిషేకించవచ్చు.
ఏదీ రానప్పుడు ‘శివాయ నమః అనో, నమఃశివాయ అనో పూజించడం కూడా సత్ఫలితాలనే ఇస్తుంది.
నిత్యం ఇంట్లో శివార్చన జరగడం మంచిదే.
శివపూజ అందరూ చేయవచ్చు.
అయితే బాణలింగం, స్ఫటికలింగం, సాలగ్రామం వంటి వాటికే ఎక్కువ నియమాలు, విధులూ ఉన్నాయి.
అవి యోగ్యులైన గురువుల సాయంతోనే స్వీకరించాలి.
అవి లేకుండా] వెండి లింగాన్ని అర్చించడం మంచిది.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment