Tuesday, 20 October 2020

ధర్మసందేహాలు-విష్ణుమూర్తికి రాగి పాత్రలోనే నైవేద్యం పెట్టాలా? ఎందుకలా?




ప్రశ్న అడిగిన వారు : మహేష్, నిజామాబాదు

కొన్ని గుళ్ళలో నైవేద్యం పెట్టె పాత్రలే కాదు తీర్థం ఇచ్చే పాత్రలు కూడా రాగితోనే తయారు చేయబడి ఉంటాయి. ఎందుకు అలా చేస్తారు. పురాణాలు ఏం చెబుతున్నాయి. శాస్త్రం ఏం చెబుతోంది అనే అంశాలను పరిశీలిద్దాం.
పురాణాల ప్రకారం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు. పుట్టుక రాక్షస పుట్టుకే అయినా పరమ విష్ణుభక్తుడు. ఆయన ధ్యాసలోనే ఉండేవాడు.
ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు.
కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు.
తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
తరువాత కూడా గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు.
విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి.
మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం.
రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని పురాణాలు చెబుతుంటాయి.
శాస్త్రపరంగా చూస్తే, రాగికి రోగ నిరోధక శక్తి ఎక్కువ. తీర్థం రాగి పాత్ర ద్వారానే వేయడం వలన రోగాలు సోకకుండా ఉంటాయని అర్థం. అందుకే గడాకేశుడి శరీరం ద్వారా లోహాల లక్షణాలను తెలియజేశారు.



ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371














No comments:

Post a Comment