ఓమ్, లేదా ఓంకారం త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.ఇదొక ఏకాక్షర మంత్రము.సృష్టి ఉత్పత్తి ప్రక్రియ శబ్దముతోబాటు జరిగినది. ఎప్పుడైతే మహావిస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) జరిగిందో అప్పుడే ఆదినాదము (ప్రథమ శబ్దము) ఉత్పన్నం. ఆ మూల ధ్వనికే సంకేతము ఓం అని చెప్పబడింది.పతంజలి యోగ సూత్రములు పతంజలి మహర్షి దీనిని 'తస్యవాచక ప్రణవః'అని దీని ప్రకటికరణ రూపం ఓం అని చెప్పినారు. మాండూక్యోపనిషత్తు లో ఇలా చెప్పబడింది:
ఓమిత్యేతదక్షరమిదమ్ సర్వం తస్యోపవ్యాఖ్యానం||
భూతం భవద్భవిష్యదితి సర్వమోజ్మార ఏవ||
యచ్యాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ||
అనగా ఓం అనేది అక్షరం, అవినాశ స్వరూపం. ఈ సంపూర్ణ జగత్తు అంతా దాని (ఓం) యొక్క ఉపవాక్యానమే. ఎది గడిచిపోయిందో, ఏది ప్రస్తుతం ఉన్నదో, ఏది జరుగనున్నదో - ఈ సమస్త జగత్తు అంతా ఓంకారమే అయియున్నది. అట్లే పైన చెప్పిన త్రికాలములకు అతి అతీతమైన అన్య తత్వ ఏదైతే ఉన్నదో అదికూడా ఓంకారమే.ఈ ప్రథమనాదమే భిన్న రూపాలలో సృష్టి యందు అభివ్యక్తం అగును. అదియే మానవులలో వాణి రూపములో అభివ్యక్తమవుతున్నది.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment