Friday 16 October 2020

సంపాదించిన డబ్బు నిలవడం లేదా అయితే నిలవడానికి నేటి యోగక్షేమం:

 






సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌టం లేదా.. ఇలా చేయండి
కొందరు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తారు. సిరిసంపదలను పోగేయడానికి వారు చేయని కృషి ఉండదు. కానీ, వచ్చిన సంపద వచ్చినట్టే కర్పూర హారతిలా కరిగిపోతుంటుంది. నానా ఇబ్బందులు పడుతుంటారు. వచ్చిన కర్పూరం దూదిపిందెలా ఎగిరిపోతుంటుంది.

ఎంత సంపాదించినా అంతకు మించిన ఖర్చులు వచ్చిపడతాయి. చేసిన కష్టం వృథా పోతోందని తలలు పట్టుకునే వారుంటారు. హిందూ ధర్మాన్ని నమ్మే అలాంటి వారు ఏం చేయాలి? అందుకు ఐశ్వర్య దీపం విరుగుడని చెబుతారు. ఈ ఐశర్యదీపం ఎలా పెట్టాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.

ఐశ్వర్య దీపం అంటే ఉప్పుపై వెలిగించే దీపాన్నే ఉప్పు దీపం అంటారు. ప్రతి శుక్రవారం ఉదయం కానీ, సాయంత్రం కానీ దీపాన్ని పెట్టాల్సి ఉంటుంది. నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదాని పైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు పైనపసుపు కుంకుమ చల్లాలి.

ఒక చిన్న ప్రమిదలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపుకుంకుమా పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నైయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి.. దీపం శ్లోకం చదువుకోవాలి…పళ్ళు కానీ, పాలు పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి , లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి… కనకధార స్త్రోత్రం కూడా చదివితే మంచిది.

శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలోని ఉప్పు మటుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు, ప్రమిధలు మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు, ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి…

అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది.. 41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధన పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం. ఇది ఎవ్వరైనా చేసుకోవచ్చు..

సర్వే జనాః సుఖినో భవంతు,



శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371











No comments:

Post a Comment