తులసీ మండపం.. 4 అడుగుల వెడల్పు.. 4 అడుగుల ఎత్తు.. ఉండి తీరాల్సిందేనా?
పవిత్రమైన తులసీ మండపాన్ని ఇంట్లో పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవి నివసించే తులసీ మండపం తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తీరాల్సిందేనని వారు అంటున్నారు. ఇంటి ముంగిట నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు గల తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో ఉండేలా చూసుకోవాలి.
మండపం మధ్యలో ముక్కోణపు ఆకారం వుండి తీరాలి. ఇందులో దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక మండపంలో నాగులు నివసించే పుట్ట మట్టితో లేదా ఏదైనా పవిత్రమైన ఆలయం నుంచి తెచ్చుకున్న మట్టితో నింపాలి. వెదురు బూడిద, ఎండిన పేడతో తయారైన భస్మాన్ని అందులో కలిపి తులసీ మొక్కను నాటుకోవాలి. తులసీ మండపానికి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసే విధంగా చూసుకోవాలి. కృష్ణ తులసీ అనే మొక్కను (రెండింటిని జంటగా) నాటుకోవడం మంచిది. పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిల్లో తులసీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.

తులసీ మండపం ఏర్పాటు చేయలేకపోతే.. 12 లేదా 16 ఇటుకలతో తులసీ మండపాన్ని
ఏర్పాటు చేసుకోవచ్చు. 12-16 ఇటుకలతో ఏర్పాటు చేసిన తులసీ మండపంలో తులసీ
మొక్కను నాటి దీపమెలిగించి పూజలు చేయవచ్చు. 12-16 సంఖ్యలో ఏర్పాటు
చేసుకున్న తులసీ మండపానికి 12 సంఖ్యలో చందనం, కుంకుమ బొట్లు పెట్టాలి.
ప్రతిరోజూ స్నానమాచరించి తులసీ మొక్కకు పుష్పాలు వుంచి.. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణు, మధుసూదనా, వామనా. పద్మనాభా అంటూ స్మరించాలి. తమలపాకుపై విఘ్నేశ్వరుడిని చందనంతో పట్టిపెట్టి.. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు పటాపంచలవుతాయి.

No comments:
Post a Comment