Sunday, 14 August 2016

వారఫలం (15 - 21 ఆగస్టు 2016)


వారఫలం (15 - 21 ఆగస్టు 2016) 



మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
 వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. శుభవార్తలు వింటారు. వ్యవహారాల్లో అనుకూలత, కార్యసాధనలో జయం పొందుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. కుటుంబీకుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆది, గురువారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. విలువైన వస్తువులు, వాహనానికి మరమ్మత్తులు చేస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
 బంధువులతో సత్సంబంధాలు, ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆర్థికస్థితి సంతృప్తికరం. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. మంగళస బుధవారాల్లో నగదు, వస్తువులు జాగ్రత్త. ప్రతి విషయంలోను అప్రమత్తంగా మెలగాలి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలకు అన్వేషిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి, ఉమ్మడి వెంచర్లు, లీజు, టెండర్లకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ప్రయాణంలో ప్రయాసలెదుర్కుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
మిథునం
మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
వ్యవహర ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగదు. పెద్దల సలహా పాటించండి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. మానసికంగా కుదుటపడతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పరిచయాలు బలపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గురు, శుక్రవారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలు ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల సమర్థత వెలుగులోకి వస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసివస్తాయి. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. పెద్దమొత్తం ధనంతో ప్రయాణం క్షేమం కాదు. 

కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదం చేస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్తా చాటుకుంటారు. ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. ఏ విషయంలోను సహనం కోల్పోవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
 ఈ వారం ఖర్చులు విపరీతం, ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అయిన వారే సాయం చేసేందుకు వెనుకాడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. వ్యవహారాల్లో సొంత నిర్ణయాలే శ్రేయస్కరం. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆత్మీయులకు ముఖ్య సమాచారం ఇస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. 

తుల
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వివాదాలు పరిష్కరించుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆది, సోమవారాల్లో కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఏ విషయంలోను ఉద్రేకపడవద్దు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం సంభవం. నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తుంది. దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
వృశ్చికం
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 
పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వ్యవహారాలు, బాధ్యకలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధవారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. పొదుపు మూలక ధనం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు సంభవం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్‌లలో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులను ఆహ్వానిస్తారు. 
 
ధనస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
శుభకార్య యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. గురు, శుక్రవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కుటుంబ విషయాల్లో గోప్యంగా ఉంచండి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆభరణాలు, వస్త్రాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఎదుటివారి వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. అవిశ్రాంతంగా శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. 

మకరం
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
 వివాదాల నుంచి బయటపడతారు. ఆందోళన తొలగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి లోటుండదు. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. చిన్న విషయమే వివాదాస్పదమవుతుంది. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
కుంభం
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఎదుటివారి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. పరిస్థితులు అనుకూలించక, అవకాశాలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ సమర్థతపై నమ్మకం తగ్గుతుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆది, సోమవారాల్లో దుబారా ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆహ్వానాలు, నోటీసులు అందుతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగుల సహాయం అందిస్తారు. అధికారులకు ధనప్రలోభం తగదు. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
 
మీనం
పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యవహారాల్లో ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. మంగళ, బుధవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. చేతిలో ధనం నిలబడదు. బంధుమిత్రులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సహాయం క్షేమం కాదు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. అగ్రిమెంట్లు, చెల్లింపులలో ఏక్రాగత వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు హోదా మార్పు, పనిభారం, విశ్రాంతి లోపం. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. వేడుకలు, దైవ, పుణ్య కారాల్లో పాల్గొంటారు.
 
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment