Monday, 15 August 2016

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు

1. ఎంత చిన్న మంచి అయినా గొప్ప మేలు చేస్తుంది. ఎంత చిన్న చెడు అయినా గొప్ప కీడు చేయగలదు. అందుకే చిన్న చిన్న మంచి పనులను వీలైనంత వరకూ చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు, ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోవడం, భోజనం మధ్యలో ఉప్పు వేసుకోకుండా ఉండటం, స్నానం చేసేప్పుడు మాటలు పాటలు లేకుండా చేయడం.
2. మనని మనం గొప్పగా తలచుకుంటూ ఉండకుండా ఉండటానికీ, ఏ రోజు చేసిన పాపాన్ని ఆ రోజు తొలగించుకోవడానికి సంధ్యావందనం ఎలా చేస్తామో అలా ఈ శ్లోకాన్ని నిత్య పారాయణ చేసుకోవాలి.
యన్నామధేయశ్రవణానుకీర్తనాద్యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్
శ్వాదోऽపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్
ఎలాంటి స్థితిలోను, ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ఆపకూడదు.
గాయత్రీ మంత్రం యొక్క అర్థం ఈ శ్లోకములో ఉంది.
“ఏ మహానుభావుని యొక్క నామమును వినడం వలనా, పలకడం వలన, ఎవరికి తలవంచి నమస్కరించడం వలన, ఎవరికి నమస్కరించడం వలన, కుక్క మాన్సం తినే వాడైనా వెంటనే యజ్ఞ్యాధికారాన్ని పొందుతాడు. అలాంటి నీ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించినవాడికి కలగనిది ఏమిటి?”
నీ దివ్య మంగళ విగ్రహాన్ని మేము మాటి మాటికీ ధ్యానం చేస్తామూ (తత్ సవితుః వరేణ్యం). వెంటనే వాడు యజ్ఞ్యం చేయగలడు (ధియో యోనః ప్రచోదయాత్). యజ్ఞ్యం అంటే మనదీ అనుకుంటున్న ద్రవ్యమూ,నాదీ అనుకునే ఆస్థిని పరమాత్మకు అర్పించే బుద్ధి కలుగుతుంది.
ఆ గాయత్రీ మంత్రార్థాన్నే ఈ శ్లోకములో చెప్పబడినది.
3. పుత్రికా ధర్మం అంటే వివాహం తరువాత ఆ అమ్మయికి పుట్టబోయే కుమారుడు తన వంశానికి ఉద్ధారకుడు అవుతాడు. దౌహిత్రుడు వంశ ఉద్ధారకుడు అవుతాడు అని కన్యాదాన సమయములో ప్రమాణ పూర్వకముగా చేస్తారు. దీనికి అమ్మాయీ అల్లుడూ, తన భార్యా కూడా ఒప్పుకోవాలి. తనకు పుత్ర సంతానం లేకుంటే ఈ పని చేయాలి. లేదా పుత్రిక మీద పుత్రుని కంటే ఎక్కువ ప్రేమ ఉన్నా ఈ పని చేయొచ్చు. మనువుకు ఆకూతిని రుచి అనే ప్రజాపతికి పుత్రికా ధర్మాన్ని ఆచరించి వివాహం చేసాడు. శతరూప అనుమొదించడముతో, పుత్రుల అనుమతీ పొంది పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి ఆకూతిని రుచి అనే ప్రజాపతితో వివాహం చేసాడు
4. ఇది పద్మ పురాణాంతర్గతం
వర్షం పడినప్పుడు మేఘ గర్జనతో మెరుపులు వస్తాయి. వాటిలో ఉన్న విద్యుత్తును వర్షం ధారలతో పడుతున్నప్పుడు దానిలో ప్రవేశింపచేసి ప్రవాహముతో విద్యుత్తును సృష్టించి, దానితో భూమిని దున్నడానికి యంత్రాలను తయారు చేసేవారు. విద్యుత్తుతో నడిచే యంత్రాలతో భూమిని దున్ని పంటపండిస్తారు. నీరు బాగా ప్రవహిస్తే అందులో విద్యుత్తు ఉంటుందని. ఆ విద్యుత్తును నిలవ చేసి దాన్ని వాహనములో ఎక్కించి పంటపండిస్తారు. ఇది పశువులు లేని రాజ్యాలలో చేసే వారు.
5. కన్యా వరయతే రూపం
మాతా విత్తం, పితా ధనం
బాంధవా కులమిఛ్ఛంతి
మృష్టాన్నమితరే జనాః.
అనగా వరునిలో ఒక్కొక్కరు ఒక్కొక్క గుణం ఉండాలని కోరుకుంటారట! పెళ్ళీకూతురు తనకు కాబోయే భర్త మంచి అవయవసౌష్ఠవం కలిగిన అందగాడు కావాలని ఆశిస్తుంది. వధువు తల్లి అతడు భాగ్యవంతుడై ఉండాలనీ, తండ్రి విద్యాకీర్తులు కలవాడై ఉండాలనీ, చుట్టపక్కాలు మంచి వంశములో జన్మించినవాడై ఉండాలనీ, ఇతర జనమంతా షడ్రసోపేతమైన భోజనం పెట్టగలిగేవాడై ఉండాలనీ కోరుతారట! మరి, కేవలం ఈ గుణాలే కాక, ఆ పురుషుడు సర్వసద్గుణ సంపన్నుడు ఐనప్పుడు అతణ్ణి వరించని కన్యలు ఉంటారా?!
6. ఒక్క లింగ పురాణమూ మహాశివపురాణములో తప్ప మిగతా పురాణాలలో బ్రహ్మ విష్ణువులు కూడా దక్ష యజ్ఞ్యానికి వచ్చి పారిపోయినట్లు లేదు
7. యవ్వనమూ బలమూ అధికారమూ అవకాశమూ, ఈ నలుగూ ఉన్ననాడు తనకు భోగ్యము కాని, ఇతరులవైన భోగ్యములను అనుభవించాలని చూస్తే అవసాన కాలమప్పుడు ఆ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది.
అవకాశం దొరికినా అవసరం లేని భోగాలను అనుభవిస్తే, అవసరం ఉన్నప్పుడు అనుభవించడానికి ఏమీ ఉండవు
8. పరమాత్మ సంతోషించాలంటే ఓర్పూ దయా స్నేహం సర్వాభూత సమ దర్శనం కావాలి. అలా ఉంటేనే భగవానుడు సంతోషిస్తాడు
9. హరి శబ్దానికి 994 అర్థాలున్నాయి. సంస్కృతములో ఎనిమిది కన్నా తక్కువ అర్థాలు ఉన్న పదాలు లేవు
10. వండిన అన్నం రాత్రి అంతా ఉంచితే ఎలా తినడానికి పనికిరాడో, ఏ ఒక్క పూట ఆవృత్తి చేయకపోయినా వారు చదివే మంత్రాలకు ఆ బలం ఉండదు. అన్నం పాసిపోయినట్లు ఆ మంత్రాల శక్తి పోతుంది
11. అందుకే నిజముగా బుద్ధిమంతులైన వారు తమ స్తోత్రాన్ని తాము అసహ్యించుకుంటారు – పృధు చక్రవర్తి మాట

No comments:

Post a Comment