Monday 29 August 2016

పరమ శివుడు- మాస శివరాత్రి

పరమ శివుడు- మాస శివరాత్రి


పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మాస శివరాత్రి అని పురాణాలలో చెప్పబడింది. మరి ఈ అత్యంత శివ ప్రియమైన ఈ రోజుని స్మరణం,పూజ,జపం,తపం,అభిషేకం ఇలా తమకు తోచిన విధంగా ఆ పరమేశ్వరుని ప్రార్ధించి ఆయన ప్రీతికి మనం పాత్రులమవ్వాలి. అంతే కాదు  మాస శివరాత్రినాడు విధి విధానం గా శివుని పూజించిన వారికి కామ్యములు నెరవేరుతాయి.

ఉదయమే స్నానాదికాలు నిర్వహించుకొని పూజగదిని అలంకరించి స్వామిని అభిషేకాలతో అర్చించి పాలతో చేసిన పాయసాన్నినైవేద్యం గా సమర్పించాలి.ఉద్యమంతా ఉపవాసముండి సాయంత్రం తిరిగి స్వామికి దీపారాధన చేసి ప్రసాదాన్నిస్వీకరించాలి.ప్రదోషకాలం లో శివాలయాన్ని దర్శించడం శుభప్రదం.

ప్రదోష కాలం లో శివుడు తాండవమాడుతూ ఉంటాడట ఆసమయంలో శివుని స్మరించిన ,పూజించినా, అభిషేకించినా,బిల్వ దళాన్నిఆలయంలో అర్పించినా కోరిన కోరికలు నేరవ్రుతాయి.పడుకునేప్పుడు కూడా శివున్ని పదకొండు సార్లు స్మరిస్తూ నిద్రించడం మంచిది.

No comments:

Post a Comment