Thursday, 25 August 2016

కృష్ణాష్టమి









కృష్ణాష్టమి

 


జయతు జయతు దేవో దేవకీ నందనోయంజయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపఃజయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగోజయతు జయతు పృధ్వీభారనాశో ముకున్దః ||
తాత్పర్యం: ఓ దేవకీ నందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ!భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!.




కృష్ణ జన్మాష్టమి  శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో తొమ్మిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

తిథి

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారము 2016 సంవత్సరములో ఆగష్టు నెల 25 తారీఖులో వచ్చింది.


పండుగ విధానం

జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే లేచి, చల్లని నీటిలో"తులసీదళము"లను ఉంచి స్నానమాచరించినట్లైతే సమస్త పుణ్య తీర్థములలో స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారు.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రo శ్రీకృష్ణుని పూజిస్తారు 
. శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.

 
ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.



పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.



ఆ కృష్ణపరమాత్మ తన స్నేహితులను నేలమీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టిఅప్పుడు వెన్న, పెరుగులకోసం ఉట్టీలను అందుకొనేవాడు. ఆ కృష్ణలీలను గుర్తుచేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టీలు కొట్టడం.

పరిశుద్ధ ప్రదేశమున మండపాన్ని ఏర్పరచి, దానిపై కలశమును స్థాపించి, అందు దేవకీ వసుదేవులను, గోవులను, గోపికలను ఆవాహన చేస్తారు. శ్రీకృష్ణ ప్రతిమను లేదా పటాన్ని ఉంచి షోడశోపచారములతో భక్తిగా అర్చిస్తారు. నేలను అలికి, స్వస్తిక్ ఆకారపు ముగ్గువేసి, ఆ స్థలాన్ని బాగా అలంకరిస్తారు.కాస్తూరి తిలకాన్ని దిద్దుతారు .పండ్లు, పిండి పదార్థాలు లడ్డూలు, మోదకములు, పాలతో వండిన పదార్థాలతో నెయ్యి, పాలు, తేనె, బెల్లంతో కూడిన నైవేద్యమును ఓ శ్రీహరీ నీవు స్వీకరింతువుగాకఅని నివేదిస్తారు. తరువాత పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజి, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలమును స్వామికి సమర్పిస్తారు. అనంతరం స్వామికి కర్పూర నీరాజనాన్ని, నమస్కారాన్నిసమర్పిస్తారు. ముల్లోకాల్లో ఇటువంటి కృష్ణాష్టమీ వ్రతం ఇంకొకటిలేదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారికి కోటి ఏకాదశీ వ్రత ఫలం లభిస్తుంది.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..

ఈ రోజు  " గోకులనాథాయ నమః "
అష్టాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి కోరికలన్నీఫలిస్తాయి.



తిరుమల శ్రీవారి ఆస్థానం

 

తిరుమల ఆలయలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి.
కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును 'గోకులాష్టమీ ఆస్థానం' అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం (ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా క్రీ..1545 సంవత్సరంలో తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అన్నమాచార్య కీర్తన

 

తాళ్ళపాక అన్నమాచార్యుడు ఉట్ల పండుగను ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు:
పైకొని చూడరె వుట్ల పండుగ నేడు
ఆకడ గొల్లెతకు ననందము నేడు
అడర శ్రావణబహుళాష్టమి నే డిత డు
నడురేయి జనియించినా డు చూడ గదరే
అరుదై శ్రావణబహుళాష్టమి నా టి రాత్రి
తిరువవతారమందెను కృష్ణు డు
యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు
కరములందు బెట్టితే కడుసంతోసించెను
  


సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371











No comments:

Post a Comment