Wednesday, 31 August 2016

ఏ కాక్షి నారికేళం

 ఏ కాక్షి నారికేళం

ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఎలాంటి వస్తువులలో నివాసం ఉంటుందంటే వారు చెప్పే సమాధానాలు ఇవి :
1. దక్షిణావర్త శంఖం
2. ముత్యాల శంఖం
3. ఏకాక్షి నారికేళం 

4. లక్ష్మి కారక గవ్వలు
5. శ్రీఫలం
6. గోమతి చక్రాలు
7. తామర గింజలు
8. రాఖ్తబీజాలు (గురిగింజలు)
9. శ్రీ యంత్రం
10. శ్రీ కూర్మం
11.పంచలోహాలు-నవరత్నాలు
ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
 



ఏ కాక్షి నారికేళం
              ఏకాక్షి నారికేళం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు.
ఏ కాక్షి నారికేళం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్ధం.సాధారణంగా అన్ని కొబ్బరికాయలకి మూడు కళ్ళు ఉంటాయి.ఈ మూడు కళ్ళలో రెండు కళ్ళు గుండ్రంగాను  ఒక కన్ను వెడల్పు గాను ఉంటుంది.వెడల్పుగా ఉన్న కన్నుని నోరుగాను గుండ్రంగా ఉన్న కళ్ళను రెండు కళ్ళ గాను చెబుతారు.ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను ,ఒక నోరు ఉంటుంది.ఇవి దొరకటం చాలా కష్టం.వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్కదాంట్లోను ఇలా రావచ్చు.మార్కెట్ లో తాటికాయలనే ఏకాక్షి నారికేళం గా అమ్ముతున్నారు.వీటితో పూజిస్తే ఫలితం శూన్యం.ఏ కాక్షి అంటే ఒక్కటే కన్ను ఉంటుందని అనుకుంటారు కాని ఏ కాక్షి నారికేళానికి ఒక కన్ను,ఒక నోరు ఖచ్చితంగా ఉంటాయి.


లక్ష్మీదేవి పూజలో ఏకాక్షి నారికేళం ప్రాధాన పాత్ర పోషిస్తుంది ... దీనిని ఉపయోగిస్తూ పూజ చేయడం వలన ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని అంటారు. ఇక ఈ పూజ 'దీపావళి' రోజున చేసినట్టయితే అది మరింత విశేష ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తోంది. ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో వుంచడం వలన సుఖసంపదలు ... కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

ఇక ఈ ఏకాక్షి నారికేళం ఇంట్లో ఉన్నంత వరకూ ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు. ఎవరైనా పిశాచ బాధలు పడుతున్నట్టయితే వారి ఒడిలో ఏకాక్షీ నారికేళాన్ని వుంచినట్టయితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. గర్భవతులైన స్త్రీలకు ఏకాక్షి నారికేళం వాసన చూపించడం వలన సుఖ ప్రసవం జరుగుతుందని అంటారు. సమస్త సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తూ ..ఉంటుంది ఈ మహిమాన్వితమైన ఏకాక్షి నారికేళం.

ఏకాక్షి నారికేళాన్ని అభిసేకించి లక్ష్మీదేవికి అర్పించి పూజిస్తే తనకి అత్యంత ప్రీతికరమైన ఏకాక్షి నారికేళాన్ని సమర్పించినందుకు కోరిన సంపదలనిస్తుంది. అష్టైశ్వర్యాలను కలుగచేస్తుంది.

పూజా విధానం;-
           ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఏ కాక్షి నారికేళాన్ని శుబ్రమైన నీటితో గాని,గంగా జలంతో గాని కడిగి పసుపు,కుంకుమ,చందనములతో నారికేళాన్ని అలంకరించాలి.
ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి, ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి, ధనలాభం చేకూరుతుంది .          
  ఏ కాక్షి నారికేళానికి పూలు,అక్షింతలతో లక్ష్మి  సహాస్త్రనామంతో పూజ చేయాలి.ఈ పూజలో గవ్వలు,గోమతిచక్రాలకు కూడ పూజ చేయవచ్చు.
             ఏ కాక్షి నారికేళాన్ని ఇంటి పూజా మందిరంలోగాని,షాపు పూజామందిరంలో గాని,విధ్యా సంస్ధలలో గాని,ప్యాక్టరీలలోగాని దీనిని ప్రతిష్టించవచ్చు.
             ఏకాక్షి నారికేళాన్ని శుక్రవారం గాని,దీపావలి రోజులలో గాని విశిష్ట పూజ చేస్తే మంచిది.
                                                       మంత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మీం స్వరూపాయ ఏకాక్షి నారికేళాయ నమః సర్వసిద్ధి కురుకురు స్వాహా!
 అనే మంత్రాన్ని 108 సార్లు పఠించటం మంచిది.



ఉపయోగాలు:-
           


            ఏకాక్షి నారికేలాన్ని పూజించేవారి ఇళ్లలోని కుటుంబ సబ్యులపై ఎటువంటి తాంత్రిక దుష్ప్రభావాలు పనిచేయవు. రోగాలు,కష్టాలు దూరమవుతాయి

           ఏకాక్షి నారికేళాన్ని  శివాలయంలో ఆలయంలో  దానం చేసిన కోర్టు భాదలు,రుణ భాదలు ఉండవు.
           ఏకాక్షి నారికేళం పూజ చేసే వారికి ఉద్యోగ రంగంలో ఉన్నత స్థానం కలుగుతుంది.
           ఏకాక్షి నారికేళం పోటీ పరీక్షలలో విజయం సాదించవచ్చును.
           ఏకాక్షి నారికేళం ఉన్నచోట శత్రుభాదలు ఉండవు.
           బిడ్డలు కలగని స్త్రీకి ఏకాక్షి నారికేళాన్ని శుభ్రంగా నీటిలో కడిగి ఆ నీటిని తాగటం వలన గర్బప్రాప్తి కలుగుతుంది.
          ఏకాక్షి నారికేళం ఆయువృద్ధికి,ఐశ్వర్య వృద్ధికి హేతువు.ఏ కాక్షి నారికేళం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో                   
           దుష్టశక్తుల,నరదృష్టి ప్రభావం ఉండదు.
          ఏకాక్షి నారికేళం ఉన్న ఇంటిలో ఎటువంటి భాదలు గాని,గొడవలు గాని,అపోహలు గాని ఉండవు.కుటుంబ సభ్యులందరి మధ్య సహాయ సహాకారాలు,అన్యోన్యత,అనురాగాలు,ఆప్యాయతలు కలిగి ఉంటారు.
          ఏకాక్షి నారికేళం ఉన్న షాపులోగాని,ప్యాక్టరీలలో గాని,విధ్యా సంస్ధ లలో గాని ఉంచి పూజ చేసిన ఆకర్షణ,వ్యాపారాభివృద్ది కలుగుతాయి
         పిల్లలలో తెలివితేటలు,చదువుపై శ్రద్ధ,పోటితత్వం కలుగుతాయి.
        ఏకాక్షి నారికేళం ఉన్నచోట సర్వవిదాల అభివృద్ధి,సర్వకార్యసిద్ధి,జనాకర్షణ కలుగుతాయి.    

No comments:

Post a Comment