Friday 12 August 2016

ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం

ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం
 
 
జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. క్షణంలో నిరుపేదను సైతం శ్రీమంతునిగా కరుణించగల సామర్థ్యం ఆ తల్లిది! ఆ తల్లి 108 నామాలైన "లక్ష్మీ అష్టోత్తర శత నామా" లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ఆ తల్లిని శ్రద్ధగా ధ్యానించి. ఆ తరువాత దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని పఠించాలి.
ధ్యానం:
వందే పద్మాకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం.
హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం
భక్తా భీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మదిఖి:
సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభి:
సరసిజ నయనే సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి, ప్రసీద మహ్యమ్

ఈ దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని నిత్యం పఠించేవారికి, అన్ని రకాలైన దారిద్ర్యలు తొలగి శుభం కలుగుతుంది.
తామరరేకుల వంటి నేత్రద్వయముగలదానా! కమలమును చేబూని , మిక్కిలి తెల్లనై కాంతివంతమైన వస్త్రాన్ని గంధాన్ని, హారాలను ధరించుదానా , మూడు లోకాలకు ఐశ్వర్యాన్ని  ప్రసాదిస్తూ మనోహరరూపంగల విష్ణుపత్ని! ఓ లక్ష్మీదేవి! నన్ను అనుగ్రహించు తల్లీ!
దారిద్ర్య విమోచన స్తోత్రం:
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం
వాచం పద్మాలయాం పద్మాంశుచిం స్వాహాం స్వధాం సుధాం
ధన్యాం హరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్పాం విభావరీమ్
అదితం చ దితిం దీప్తాం వసధాం వసుధారిణీం
నమామి కమలాం కాంతాం కామాం క్షీరోద సంభవాం
అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం
అశోకామమృతాం దీప్తాం లోకశోక వినాశినీం
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్ష్మీం పద్మ సుందరీం
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం
పుణ్యగంధాం సుప్రసన్నం ప్రసాదాభిముఖీం ప్రభాం
నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీం
చతుర్బుజాం చంద్రరూపాం ఇందిరామిందు శీతలాం
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్య నాశినీం
ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం
భాస్కరీం బిల్వనిలయాం వరారోహం యశస్వినీం
వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణ్య సౌమ్యాం శుభప్రదాం
నృపవేశ్మగతా నందా వరలక్ష్మీ వసుప్రదాం
శుభాం హిరణ్యప్రాకారాం సముద్ర తనయాం జయాం
నమామి మంగళాం దేవీల విష్ణువక్ష: స్థల స్థితాం
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితం
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం
త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధి విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం
తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.
మాతర్నమామి కమలే, కమాలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమలవాసిని, విశ్వమాత:
క్షీరోదజే, కమలకోమల గర్భగౌరి
లక్ష్మి ప్రసీద సతతం సమతాం శరణ్యే.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.

టీకా:
హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పట్టపు = పట్టపు; దేవి = రాణి; పున్నెముల = పుణ్యముల; ప్రోవు = పోగు; అర్థంపు = సంపదలకు; పెన్ = పెద్ద; ఇక్క = నిలయము; చందురు = చంద్రుడికి; తోన్ = తో కలిసి - తోడ; పుట్టువు = పుట్టినది; భారతీ = సరస్వతి; గిరిసుతల్ = పర్వత పుత్రిల (పార్వతి); తోన్ = తో కలిసి; ఆడు = ఆడే; పూఁన్ = పూవును; పోడి = పోలినది - స్త్రీ; తామరలు = పద్మముల; అందున్ = లో; ఉండెడి = ఉండే; ముద్దు = మనోజ్ఞముగ ఉన్న; ఆలు = స్త్రీ; జగముల్ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లు = గృహమునకు; ఆలు = స్త్రీ; భాసురతన్ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి; ఇచ్చున్ = ఇచ్చుగాక; నిత్య = నిత్యమైన; కల్యాణముల్ = శుభములు.

భావము:
విష్ణుమూర్తి కి పట్టపురాణి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సంపదలకు పెద్ద నిలయము; చందమామకు తో బుట్టువు; సరస్వతితోను పార్వతితోను ఆడే పూబోణి; పద్మములో నివసించే మనోజ్ఞమైన స్త్రీ ; లోకాలచే గౌరవింపబడే గృహిణి ; తన ప్రకాశవంతమైన చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పోగొట్టే తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యశుభములు ఇచ్చుగాక.
 
 
ఓం' : 
సమస్త మంత్రాలసారంగా `ఓం'కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన `ఓం' కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది. అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం `ఓం'కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజః సత్త్వ, తమో గుణాలకు ప్రాతినధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు. వేదం ఓంకారరూపం, వేదరాశి, ఋగ్వేదం నుండి `అ' కారం, యజుర్వేదం నుండి `ఉ' కారం, సామవేదం నుండి `మ' కారం పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం: 
అమ్మ వారికి చెందిన మంత్రం ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

హూం: 
సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దైవికక్రోధం యొక్క శబ్దం `హూం'. ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

రాం: 
ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

ఐం: 
జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.

మాం: 
మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

సోహం: 
ఊపిరి యొక్క స్వాభావిక బీజం. `సో' ఉచ్ఛా్యసం, `హం' నిశ్శా్వసం. సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం. `సో' శక్తి `హం' శివుడు.

ఏకాక్షర మంత్రం - `ఓం' 
అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం `ఓం'. దీనినే `ప్రణవం' అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన. ఉదా బిడ్డ తన తల్లిని `అమ్మా' అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మన పట్ల ‚‚ప్రసన్నలవుతున్నారు.
మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. `ఐం, శ్రీం, హ్రీం, క్లీం' అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.

No comments:

Post a Comment