Wednesday, 17 August 2016

ఉపకర్మ విధి

ఉపకర్మ విధి 

౧. ఆచమనం
అచ్యుతాయ నమః
అనంతాయ నమః
గోవిందాయ నమః

కుడి చేతిలో కొద్దిగా నీరు పోసుకొని ఫై మంత్రములను చదువుతూ తీసికోనవలెను.
అరచేతులను నీటితో కడుగవలెను.
క్రింది మంత్రములను చదువుతూ కుడిచేతి వ్రేళ్ళతో స్ప్రశించవలెను.
కేశవాయ నమః (బ్రొటన వ్రేలితో కుడి చెంపని స్ప్రుశించవలెను)
నారాయణాయ నమః (బ్రొటన వ్రేలితో ఎడమ చెంపని స్ప్రుశించవలెను)
మాధవాయ నమః (ఉంగరం వ్రేలితో కుడి నేత్రమును స్ప్రుశించవలెను)
గోవిందాయ నమః (ఉంగరం వ్రేలితో ఎడమ నేత్రమును స్ప్రుశించవలెను)
విష్ణవే నమః (చూపుడు వ్రేలితో కుడి నాశికమును స్ప్రుశించవలెను)
మధుసూదనాయ నమః (చూపుడు వ్రేలితో ఎడమ నాశికమును స్ప్రుశించవలెను)
త్రివిక్రమాయ నమః (చిటికిన వ్రేలితో కుడి చెవిని స్ప్రుశించవలెను)
వామనాయ నమః (చిటికిన వ్రేలితో ఎడమ చెవిని స్ప్రుశించవలెను)
శ్రీధరాయ నమః (నడుమ వ్రేలితో కుడి భుజమును స్ప్రుశించవలెను)
హృషీకేశాయ నమః (నడుమ వ్రేలితో ఎడమ భుజమును స్ప్రుశించవలెను)
పద్మనాభాయ నమః (నాలుగు వ్రేళ్ళతో నాభమును (బొడ్డును) స్ప్రుశించవలెను)
దామోదరాయ నమః (నాలుగు వ్రేళ్ళతో శిరమును స్ప్రుశించవలెను)

౨. ప్రాణాయామం
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
ఓం జనః ఓం తపః ఓగ్మ్ సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
ధియో యో నస్య ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం

౩. గురు పరంపర ధ్యానం
అస్మద్ గురుభ్యోం నమః
అస్మద్ పరమ గురుభ్యోం నమః
అస్మద్ సర్వ గురుభ్యోం నమః

శ్రీమతే ఆదివంశాతకోప యతీంద్ర మహా దేశికాయ నమః
శ్రీమాన్ వెంకట నాధార్య కవితార్కిక కేసరి
వేదాంతాచార్య వర్యో మేసన్నిదాత్తం సదా హృదీ
గురుభ్యాసః తధః గురుభ్యశ్చః నమో వాక మదీ మహె
వరుణీ మహేచ తత్రాద్యు దంపతి జగతాం పతీ
శ్వాశేశ భూతేన మయాశ్వియః సర్వః పరిచ్చన్దైః
విధాతుం ప్రీత్మాత్మనం దేవః ప్రక్రమతే స్వయం

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయీత్

యస్య ద్విర వక్త్రాధ్యాః పారిషాద్యః పరాశతం
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే

౪. కామోకర్షిత జపసంకల్పం
చేతులు జోడించి నమస్కరించుచు క్రింది శ్లోకములను జపించవలెను:

అస్య శ్రీ భగవతో మహా పురుషస్య శ్రీ విష్నొః ఆజ్ఞా ప్రవర్తమానస్య
అద్యః భ్రాహ్మణ్ణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహ కల్పే
వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే
భరతవర్షే భరతఖండే శుభ శఖాభ్దే మేరోర్దక్షిణ దిగ్భాగే పార్స్చ్వే
అస్మిన్ వర్తమానాం వ్యవహారికానాం ప్రభావాదినాం షష్టీ సంవత్సర నామాం మధ్యే

__________ నామ సంవత్సరే
దక్షిణాయణే గ్రీష్మ ఋతువే
__________ మాసే
శుక్ల పక్శే పౌర మాస్యం శుభ తిధే
__________ వాసరే
__________ నక్షత్రే
యుక్తాయాం శ్రీవిష్ణు యోగా శ్రీవిష్ణు కరణే
శుభ యోగే శుభ కరణే
ఏవం గుణ విశేషణ విశిష్టాయామ్
అస్యం పౌర మాస్యాం శుభ తిధే
శ్రీ భగవదాగ్ణాయ శ్రీమాన్నారాయణాయ ప్రీత్యార్ధంత ఇష్యాం
పౌర్ణ మాస్యాం అధ్యాయోత్సార్జన అకారణ ప్రాయస్చిత్యార్థం
అష్టోత్తర సహస్ర సంఖ్యా కామోకార్షితః మన్యుర కార్షితః
మహా మంత్రజపం కరిష్యే

౫. సాత్విక యాగం
చేతులు జోడించి నమస్కరించుచు:

సాత్వికత్యాగం
ఓం భగవానేవ స్వనియామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషాతైక రసేన
అనేనా ఆత్మనా కర్త్రా స్వకియైశ్చ
ఉపకారణైః స్వారాధనైక ప్రయోజనాయ
పరమ పురుషః సర్వ శేషి శ్రియః పతిః
స్వశేషా భూతం ఇదం కామోకార్షితః మన్యుర కార్షితః
మహా మంత్ర జపం కర్మా స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి

ఓపిక వుంటే క్రింది మంత్రమును "1008" సార్లు జపించవచ్చు.
కామోకార్షితః మన్యుర కార్షితః

౬. యజ్ఞోపవీతం ధారణం
ఆచమనం "2" సార్లు చేయవలెను
తరువాత ప్రాణాయామం చేయవలెను.

క్రింది శ్లోకములను చదువవలెను:
అస్య శ్రీ భగవతో మహా పురుషస్య శ్రీ విష్నొః ఆజ్ఞా ప్రవర్తమానస్య
అద్యః భ్రాహ్మణ్ణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే
కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే శుభ శఖాభ్దే
మేరోర్దక్షిణ దిగ్భాగే పార్స్చ్వే
అస్మిన్ వర్తమానాం వ్యవహారికానాం ప్రభావాదినాం షష్టీ సంవత్సర నామాం మధ్యే

__________ నామ సంవత్సరే
__________ ఆయణే (దక్షిణాయణే లేక ఉత్తరాయణే)
__________ ఋతువే
__________ మాసే
శుక్ల పక్శే శుభ తిధే
__________ వాసరే
__________ నక్షత్రే
యుక్తాయాం శ్రీవిష్ణు యోగా శ్రీవిష్ణు కరణే
శుభ యోగే శుభ కరణే
ఏవం గుణ విశేషణ విశిష్టాయామ్
అస్యం ___________ (మీ పేరు) శుభ తిధే
శ్రీ భగవదాగ్ణాయ శ్రీమాన్నారాయణాయ ప్రీత్యార్ధం శ్రావణ్యం
పౌర్ణ మాస్యాం అధ్యాయోప కర్మ కరిష్యే

తదాంగం కాండ ఋషి తర్పణం కరిష్యే
తదాంగం యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తదాంగం శుభ నదీ స్నాన మహం కరిష్యే

ఇది పెళ్లి కాని వారు మాత్రమె వల్లించవలెను:
-----------------------------------------------------------------------------------------
తదాంగా తాయ మౌణ్జ్యాజిన దండ ధారణానిచ కరిష్యే

యజ్ఞోపవీత ధారణ మహా మంత్రస్య బ్రహ్మః ఋషిః (శిరమును స్ప్రుశించవలెను)
త్ఱిష్తుప్చ్చన్ధః (నాశికమును స్ప్రుశించవలెను)
త్రయీ విద్యా దేవతాః (హృదయమును స్ప్రుశించవలెను)

యజ్ఞోపవీత ధారణే వినియోగః

ఇప్పుడు క్రొత్త యజ్ఞోపవీతమును ఒక్కొక్కటి చొప్పున తీసికొని పద్మాసనమున కూర్చున్న విధమున రెండు
మ్రోకాళ్ళ చుట్టున పెట్టి పసుపు కుంకుమలతో ఐదు చోట్ల బొట్టు వలె పెట్టవలెను. ముఖ్యముగా బ్రహ్మముడి కి పెట్టవలెను. తరువాత ఈ మంత్రమును చదువవలెను:

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజా పతేయత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః

తదుపరి ఆచమనం మరియు ప్రాణాయామం ఒక్కసారి చేయవలెను.
-----------------------------------------------------------------------------------------

ఇది గృహస్తులకు మాత్రమె చేయవలెను:
-----------------------------------------------------------------------------------------
అద్యః పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామ్
అస్యం ___________ (మీ పేరు) శుభ తిధే
శ్రౌత స్మార్త విహిత నిత్య కర్మాణుష్ఠాణ యోగ్యతా సిధ్యర్ధం
గృహస్తాయార్దాం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే

పునః యజ్ఞోపవీత ధారణం:
యజ్ఞోపవీత ధారణ మహా మంత్రస్య బ్రహ్మః ఋషిః (శిరమును స్ప్రుశించవలెను)
త్ఱిష్తుప్చ్చన్ధః (నాశికమును స్ప్రుశించవలెను)
త్రయీ విద్యా దేవతాః (హృదయమును స్ప్రుశించవలెను)

యజ్ఞోపవీత ధారణే వినియోగః

ఇప్పుడు క్రొత్త యజ్ఞోపవీతమును ఒక్కొక్కటి చొప్పున తీసికొని పద్మాసనమున కూర్చున్న విధమున రెండు
మ్రోకాళ్ళ చుట్టున పెట్టి పసుపు కుంకుమలతో ఐదు చోట్ల బొట్టు వలె పెట్టవలెను. ముఖ్యముగా బ్రహ్మముడి కి పెట్టవలెను. తరువాత ఈ మంత్రమును చదువవలెను:

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజా పతేయత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః

తదుపరి ఆచమనం మరియు ప్రాణాయామం ఒక్కసారి చేయవలెను.
-----------------------------------------------------------------------------------------

ఇది అందరికి వర్తించును:
౭. పాత యజ్ఞోపవీతమును నిమజ్జనం చేయుట:

ఈ క్రింది మంత్రమును చదువవలెను:
ఉపవీతం ఛిన్నతన్తుం జీర్ణం కష్మల దూషితం
విశ్రిజామి హరే బ్రహ్మః వర్చో దీర్ఘాయురస్థుమే

పాత యజ్ఞోపవీతమును విడువవలెను.
తదుపరి ఆచమనం చేయవలెను.

ఇది పెళ్లి కాని వారు మాత్రమె వల్లించవలెను:
-----------------------------------------------------------------------------------------
ఈ క్రింది మంత్రములను మౌణ్జిజినం నడుముకి ధరించి చదువవలెను:

ఇదం దురుక్తాత్ పారిబాధ మానా శర్మ వరూతం పునతీ న ఆగతః
ప్రాణా పానాభ్యాం బలమాభరన్తీ ప్రియా దేవానాం శుభాగా మేఖలేయం

ఋతస్య గోప్త్రీ తపసః పరస్వీ ఘ్నాతి రక్షాః సహమానా అరాతీః
సానః సమంతమను పరీహి భద్రయా భర్తరస్తే మేఖలె మారిషామా

జింక చర్మమును ధరించి గాని లేక జింక చర్మము ఫై కూర్చుని ఈ క్రింది శ్లోకమును చదువవలెను:
మిత్రస్య చక్షుర్ధారుణం బలీయః తేజో యశశ్వి స్థవిరం సమిద్ధం
అనాహనస్యం వసనం జరిష్ణు పరీదం వాజ్యజినం దధేహం

చేతిలో పలాస దండం పట్టుకొని ఈ క్రింది మంత్రమును చదువవలెను:
సుశ్రవః సుశ్రవసం మా కురు యథా త్వం సుశ్రవః సుశ్రవా అసి
యథా త్వం సుశ్రవో దేవానాం నిధి గోపసి
యేవమహం బ్రహ్మణానాం నిధి గోపో భూయాసం
-----------------------------------------------------------------------------------------

ఇది అందరికి వర్తించును:

యజ్ఞోపవీతమును యొక దండలాగా బ్రొటన వ్రేళ్ళ మధ్యన పట్టుకొని ఈ మంత్రమును చదువవలెను:

కాండ ఋషి తర్పణం:

సంకల్పం:
శ్రీ భగవదాగ్ణాయ శ్రీమాన్నారాయణాయ ప్రీత్యార్ధం దేవ ఋషి తర్పణం కరిష్యే

క్రొద్దిగా నీటితో నువ్వులు మరియు అక్షతలను తీసుకొని వాటిని అర్ఘ్యం వలె కుడి చేతిలో పట్టుకొని, ఈ క్రింది విధము గా అర్ఘ్యం విడువవలెను:

ఋషి తీర్ధం:
ప్రజాపతిం కాండ ఋషిం తర్పయామి
సోమం కాండ ఋషిం తర్పయామి
అగ్నిం కాండ ఋషిం తర్పయామి
విశ్వాన్ దేవాన్ కాండ ఋషిం తర్పయామి
సంహితిర్ దేవతా కాండ ఋషిం తర్పయామి
యాజ్ఞీర్ దేవతా కాండ ఋషిం తర్పయామి

ఈ క్రింది మంత్రమును చదువుతూ అరచేతి అడుగుననుండి అర్ఘ్యం విడువవలెను.

బ్రహ్మ తీర్ధం:
బ్రహ్మాణం స్వయంభువం తర్పయామి

చితికిన వ్రేళ్ళు లేక బ్రొటన వ్రేళ్ళ మధ్యనుండి:
సేదసపతిం తర్పయామి

కాయేనవాచ మనసేంద్రియేవ బుద్ధాత్మనావ ప్రకృతిం స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయెతి సమర్ఫయామి

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
ఇతి ఉపకర్మ

ఇప్పుడు కుదిరితే పురుష సూక్తం చదివి పెరుమాళ్ళు కు, తల్లి తండ్రులకు మరియు పెద్దలకును సాష్టాంగ నమస్కారం చేయవలెను.

No comments:

Post a Comment