Thursday, 11 August 2016

పతంజలి


పతంజలి

 

పతంజలి యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక పాణిని రచించిన అష్టాధ్యాయి కి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి కాకపోవచ్చునని భావిస్తున్నారు. పతంజలి  "యోగ సూత్రాలు" గ్రంథంతో బాటు పాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయి కి కూడా భాష్యం రాసాడు. ఈ మధ్య కాలంలో యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా పశ్చిమ ప్రపంచం భారత దేశంలో పుట్టిన యోగ సిద్దాంతాన్ని (ముఖ్యంగా రాజ యోగ)రాజయోగం బహుళ ప్రచారంలో కి వచ్చింది. ప్రముఖ తెలుగు రచయిత్రి, కథకురాలు,సాహిత్య విమర్శకురాలు మరియు తెలుగు ఉపాధ్యాయులు అయిన నిడదవోలు మాలతి గారు ఈ మధ్య కాలంలో పతంజలి యోగ సూత్రములను తెలుగులోకి అను వాదము చేసినారు.

 

 చరిత్ర

క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.

యోగ సూత్రములు

పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి.అవి క్రమముగ:సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు.కొందరి అభిప్రాయము ప్రకారము మొదటి మూడు మాత్రము పతంజలి విరచితములు మిగిలినది తరువాత చేర్పబడినదట.కాని ప్రాచీనులు దీనికి ఎక్కడ ఏకీభవించినటులు కనబడదు.
ప్రధమ పాదమున యోగము యొక్క ఉద్దేశ్యము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ బేధములను వర్ణింపబడినది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.

 


PATANJALI YOGA SUTRAS –


 1 (SAMADHI PADA)

సమాధి పాదము


అథ సమాధిపాదః |
అథ యోగానుశాసనమ్ || 1 ||
యోగశ్చిత్తవృత్తి నిరోధః || 2 ||
తదా ద్రష్టుః స్వరూపే‌உవస్థానమ్ || 3 ||
వృత్తి సారూప్యమితరత్ర || 4 ||
వృత్తయః పంచతస్యః క్లిష్టా‌உక్లిష్టాః || 5 ||
ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః || 6 ||
ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని || 7 ||
విపర్యయో మిథ్యాఙ్ఞానమతద్రూప ప్రతిష్టమ్ || 8 ||
శబ్దఙ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః || 9 ||
అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా || 10 ||
అనభూత విషయాసంప్రమోషః స్మృతిః || 11 ||
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః || 12 ||
తత్ర స్థితౌ యత్నో‌உభ్యాసః || 13 ||
స తు దీర్ఘకాల నైరంతర్య సక్తారాసేవితో దృఢభూమిః || 14 ||
దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకారసఞ్ఙ్ఞా వైరాగ్యమ్ || 15 ||
తత్పరం పురుషఖ్యాతే-ర్గుణవైతృష్ణామ్ || 16 ||
వితర్క విచారానందాస్మితారూపానుగమాత్ సంప్రఙ్ఞాతః || 17 ||
విరామప్రత్యయాభ్యాసపూర్వః సంస్కారశేషో‌உనయః || 18 ||
భవప్రత్యయో విదేహప్రకృతిలయానామ్ || 19 ||
శ్రద్ధా వీర్య స్మృతి సమాధిప్రఙ్ఞా పూర్వకః ఇతరేషామ్ || 20 ||
తీవ్రసంవేగానామాసన్నః || 21 ||
మృదుమధ్యాధిమాత్రత్వాత్తతో‌உపి విశేషః || 22 ||
ఈశ్వరప్రణిధానాద్వా || 23 ||
క్లేశ కర్మ విపాకాశయైరపరామృష్టః పురుషవిశేష ఈశ్వరః || 24 ||
తత్ర నిరతిశయం సర్వఙ్ఞవీజమ్ || 25 ||
స ఏషః పూర్వేషామపి గురుః కాలేనానవచ్ఛేదాత్ || 26 ||
తస్య వాచకః ప్రణవః || 27 ||
తజ్జపస్తదర్థభావనమ్ || 28 ||
తతః ప్రత్యక్చేతనాధిగమో‌உప్యంతరాయాభావశ్చ || 29 ||
వ్యాధి స్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాంతి
దర్శనాలబ్ధూమికత్వానవస్థితత్వాని చిత్తవిక్షేపస్తే‌உంతరాయాః || 30 ||
దుఃఖ దౌర్మ్మనరస్యాంగమేజయత్వ శ్వాసప్రశ్వాసా విక్షేపసహభువః || 31 ||
తత్ప్రతిషేధార్థమేకతత్త్వాభ్యాసః || 32 ||
మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖ దుఃఖా పుణ్యాపుణ్య విషయాణామ్-భావనాతశ్చిత్తప్రసాదనమ్ || 33 ||
ప్రచ్ఛర్దృన విధారణాభ్యాం వా ప్రణస్య || 34 ||
విషయవతీ వా ప్రవృత్తిరూత్పన్నా మనసః స్థితి నిబంధనీ || 35 ||
విశోకా వా జ్యోతిష్మతీ || 36 ||
వీతరాగ విషయం వా చిత్తమ్ || 37 ||
స్వప్న నిద్రా ఙ్ఞానాలంబనం వా || 38 ||
యథాభిమతధ్యానాద్వా || 39 ||
పరమాణు పరమ మహత్త్వాంతో‌உస్య వశీకారః || 40 ||
క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేర్గ్రహీతృర్గయణ గ్రాహ్యేషు తత్స్థ తదంజనతా సమాపత్తిః || 41 ||
తత్ర శబ్దార్థ ఙ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః || 42 ||
స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్థ మాత్రానిర్భాసా నిర్వితర్కా || 43 ||
ఏతయైవ సవిచారా నిర్విచార చ సూక్ష్మవిషయా వ్యారఖ్యాతా || 44 ||
సూక్ష్మ విషయత్వం చాలింగపర్యవసానమ్ || 45 ||
తా ఏవ సవీజః సమాధిః || 46 ||
నిర్విచార వైశారాధ్యే‌உధ్యాత్మప్రసాదః || 47 ||
ఋతంభరా తత్ర ప్రఙ్ఞా || 48 ||
శ్రుతానుమాన ప్రఙ్ఞాభ్యామన్యవిషయా విశేషార్థత్వాత్ || 49 ||
తజ్జః సంస్కారో‌உన్యసంస్కార ప్రతిబంధీ || 50 ||
తస్యాపి నిరోధే సర్వనిరోధాన్నిర్వాజస్సమాధిః || 51 ||
ఇతి పాతంజలయోగదర్శనే సమాధిపాదో నామ ప్రథమః పాదః |




సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య ప్రారంభిస్తాడు. పతంజలి మహర్షి “ఇప్పుడు యోగాభ్యాసం గురించి” తెలుసుకో అంటూ ప్రారంభిస్తారు.
మానవప్రవృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి ఐదు చిత్తవృత్తులను గుర్తించి వాటిని యోగసాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించేరు. మూడవ సూత్రంలో చెప్పిన “చిత్తవృత్తి నిరోధః” అంటే చిత్తవృత్తులను ఆపడం కానీ అణిచి పెట్టడం కానీ కాదని పండితులు వ్యాఖ్యానించేరు. మిగతా మూడు పాదాలలో ఆ చిత్తవృత్తులను యోగసాధనకి అనుకూలంగా మలుచుకునేవిధానం వివరణ చూస్తే ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపిస్తుంది.
అనూచానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకుని సత్యాసత్యాలను గమనించడంతో సాధన మొదలవుతుంది. ప్రాపంచికవిషయాలలో వైముఖ్యం ప్రయత్నంవల్ల సాధ్యం కాగలదు. సాధనలో వేగిరపాటు తగదు. అవిరళంగా పటుతర నిష్ఠతో బహుకాలం సాగించవలసి ఉంటుంది.
సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసత, అస్థిమితంవంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకువంటి బాహ్యరూపాలలో గోచరిస్తాయి. మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్షవంటి సుగుణాలను పెంపొందించుకోడంద్వారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి అవుసరమైన ప్రశాంతత పొందవచ్చు.
చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించేరు పతంజలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ అంతర్గతభావం ఇతరవిషయాలనుండి చిత్తమును యోగంవైపు మళ్ళించడం, యోగంమీద దృష్టిని సుస్థిరంగా నిలపడం.
వైరాగ్యం అంటే భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి.
సాధకుడు దృశ్యమానప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి అతీతుడయిన పరమపురుషునియందు చిత్తమును నిలపడంకోసం సాధన చేయాలి.
ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ స్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతునియందు సుస్థిరముగా నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతుని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది.
పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత – ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధిస్థితిని చేరుకోగలడు.
తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేకధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈవిధంగా చేసిన సాధనమూలంగా సమాధిస్థితిలో ఒక స్థాయికి చేరుతాడు. అది సబీజసమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోడానికి సాధన కొనసాగించాలి.
సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యము కావడం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు. గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారము జపించడం సమాధికి మార్గం.
సాధనద్వారా సాధకుడికి సమస్త వస్తువులూ స్వాధీనమవుతాయి. సమాపత్తి సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్దము (వస్తువుకి మానవుడు ఇచ్చుకున్న పేరు), అర్థము – ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి స్థితి.
ఇది పరమపురుషునిగురించిన అవగాహనలో తార్కికమైన వివరణ. ఆ తార్కికవివరణ, అవగాహనస్థితిని అధిగమించడానికి సాధన కొనసాగించాలి. తాను సమాధి పొందేను అన్న స్పృహ కూడా నశించినతరవాత పొందిన సమాధిస్థితిని నిర్బీజసమాధి అంటారు.
ఇంతవరకూ చెప్పినది సాధనకి వివరణలో పూర్వభాగం. ఉత్తరభాగంలో సాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించేరు.


2 సాధన పాదము



అథ సాధనపాదః |
తపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః ||1||
సమాధిభావనార్థః క్లేశతనూకరణార్థశ్చ ||2||
అవిద్యాస్మితారాగద్వేషాభినివేశాః క్లేశాః ||3||
అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణామ్ ||4||
అనిత్యాశుచిదుఃఖానాత్మసు నిత్యశుచిసుఖాత్మఖ్యాతిరవిద్యా ||5||
దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా ||6||
సుఖానుశయీ రాగః ||7||
దుఃఖానుశయీ ద్వేషః ||8||
స్వరసవాహీ విదుషో‌உపి తథారూఢో‌உభినివేశః ||9||
తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః ||10||
ధ్యానహేయాస్తద్వృత్తయః ||11||
క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయః ||12||
సతి మూలే తద్ విపాకో జాత్యాయుర్భోగాః ||13||
తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్ ||14||
పరిణామతాపసంస్కారదుఃఖైర్గుణవృత్తివిరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః ||15||
హేయం దుఃఖమనాగతమ్ ||16||
ద్రష్ట్టదృశ్యయోః సంయోగో హేయహేతుః||17||
ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్ ||18||
విశేషావిశేషలింగమాత్రాలింగాని గుణపర్వాణి ||19||
ద్రష్టా దృశిమాత్రః శుద్ధో‌உపి ప్రత్యయానుపశ్యః ||20||
తదర్థ ఏవ దృశ్యస్యాత్మా ||21||
కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్ ||22||
స్వస్వామిశక్త్యోః స్వరూపోపలబ్ధిహేతుః సంయోగః ||23||
తస్య హేతురవిద్యా ||24||
తదభావాత్సంయోగాభావో హానం తద్ దృశేః కైవల్యమ్ ||25||
వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః ||26||
తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రఙ్ఞా ||27||
యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే ఙ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః ||28||
యమనియమాసనప్రాణాయామప్రత్యాహారధారణాధ్యానసమాధయోష్టావంగాని ||29||
అహింసాసత్యాస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహా యమాః ||30||
జాతిదేశకాలసమయానవచ్ఛినాః సార్వభౌమా మహావ్రతమ్ ||31||
శౌచసంతోషతపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః ||32||
వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్ ||33||
వితర్కాహింసాదయః కృతకారితానుమోదితా లోభక్రోధమోహపూర్వకా మృదుమధ్యాధిమాత్రా దుఃఖాఙ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్షభావనమ్ ||34||
అహింసాప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః ||35||
సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్ ||36||
అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానమ్ ||37||
బ్రహ్మచర్యప్రతిష్ఠాయాం వీర్యలాభః ||38||
అపరిగ్రహస్థైర్యే జన్మకథంతాసంబోధః ||39||
శౌచాత్స్వాంగజుగుప్సా పరైరసంసర్గః ||40||
సత్త్వశుద్ధిసౌమనస్యైకాగ్ర్యేంద్రియజయాత్మదర్శనయోగ్యత్వాని చ ||41||
సంతోషాత్ అనుత్తమఃసుఖలాభః ||42||
కాయేంద్రియసిద్ధిరశుద్ధిక్షయాత్ తపసః ||43||
స్వాధ్యాయాదిష్టదేవతాసంప్రయోగః ||44||
సమాధిసిద్ధిరీశ్వరప్రణిధానాత్ ||45||
స్థిరసుఖమాసనమ్ ||46||
ప్రయత్నశైథిల్యానంతసమాపత్తిభ్యామ్ ||47||
తతో ద్వంద్వానభిఘాతః ||48||
తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్ఛేదః ప్రాణాయామః ||49||
(స తు) బాహ్యాభ్యంతరస్తంభవృత్తిర్దేశకాలసంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘసూక్ష్మః ||50||
బాహ్యాభ్యంతరవిషయాక్షేపీ చతుర్థః ||51||
తతః క్షీయతే ప్రకాశావరణమ్ ||52||
ధారణాసు చ యోగ్యతా మనసః ||53||
స్వవిషయాసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః ||54||
తతః పరమావశ్యతేంద్రియాణామ్ ||55||
ఇతి పాతంజలయోగదర్శనే సాధనపాదో నామ ద్వితీయః పాదః

 

ఇది మూడు భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనసును సంపూర్ణంగా నిలపడం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న ఈ క్రియావిశేషాలలో మొదటి రెండూ యమ నియమాలు. ఇవి మళ్ళీ ఐదు ఉప భాగాలుగా వర్ణించేరు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, చోరగుణం నిరసించడం, పరులసొమ్ము స్వీకరించ నిరాకరించడం వంటివి నిత్యవ్యవహారంలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య మూలకారణం. నిరంతర యోగసాధనతో ఈ నాలుగు క్లేశములను జయించవచ్చు.
ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకీ, అహంభావానికీ అతీతులు కారు. క్లేశాలకు మూలకారణాలు తెలుసుకొని, వాటిప్రభావంనుండి తప్పుకుని సాధన కొనసాగిస్తే సమాధి పొందగలరు.
ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరుజన్మలో రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలవంటి క్లేశములకు కారణమవుతాయి. తిరిగి ఆ క్లేశములమూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆవిధంగా కర్మలూ, క్లేశములు ఒకదానికొకటి కారణమవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి. అలా పునర్జన్మలకి కారణమయిన క్లేశములను, కర్మలనూ నివర్తించి సమాధి ధ్యేయంగా సాధన కొనసాగించాలి.
సత్వ తమో రజోగుణాలమూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు.
ధారణ, ధ్యానం, సమాధి – అచంచలదీక్షతో కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదటివారి చిత్తము గ్రహించడం, ఎదటివారికి అగోచరము కావడం, నీటిమీద నడవడం వంటివి. అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తులప్రభావాలకు లోను కాకుండా, వాటిని కూడా నిరోధించి, యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో లీనమవడం జరుగుతుంది.

3 విభూతి పాదము

శ్రీపాతంజలయోగదర్శనమ్ |
అథ విభూతిపాదః |
దేశబంధశ్చిత్తస్య ధారణా ||1||
తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్ ||2||
తదేవార్థమాత్రనిర్భాసం స్వరూపశూన్యమివ సమాధిః ||3||
త్రయమేకత్ర సంయమః ||4||
తజ్జయాత్ ప్రఙ్ఞాలోకః ||5||
తస్య భూమిషు వినియోగః ||6||
త్రయమంతరంగం పూర్వేభ్యః ||7||
తదపి బహిరంగం నిర్బీజస్య ||8||
వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః ||9||
తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్ ||10||
సర్వార్థతైకాగ్రాతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధిపరిణామః ||11||
తతః పునః శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతా పరిణామః ||12||
ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః ||13||
శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ ||14||
క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః ||15||
పరిణామత్రయసంయమాదతీతానాగతఙ్ఞానమ్ ||16||
శబ్దార్థప్రత్యయానామితరేతరాధ్యాసాత్ సంకరస్తత్ప్రవిభాగసంయమాత్ సర్వభూతరుతఙ్ఞానమ్ ||17||
సంస్కారసాక్షాత్కరణాత్ పూర్వజాతిఙ్ఞానమ్ ||18||
ప్రత్యయస్య పరచిత్తఙ్ఞానమ్ ||19||
న చ తత్ సాలంబనం తస్యావిషయీభూతత్వాత్ ||20||
కాయరూపసంయమాత్ తద్గ్రాహ్యశక్తిస్తంభే చక్షుః ప్రకాశాసంప్రయోగే‌உంతర్ధానమ్ ||21||
సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాదపరాంతఙ్ఞానమరిష్టేభ్యో వా ||22||
మైత్ర్యాదిషు బలాని ||23||
బలేషు హస్తిబలాదీనీ ||24||
ప్రవృత్త్యాలోకన్యాసాత్ సూక్ష్మవ్యవహితవిప్రకృష్టఙ్ఞానమ్ ||25||
భువనఙ్ఞానం సూర్యే సంయమాత్ ||26||
చంద్రే తారావ్యూహఙ్ఞానమ్ ||27||
ధ్రువే తద్గతిఙ్ఞానమ్ ||28||
నాభిచక్రే కాయవ్యూహఙ్ఞానమ్ ||29||
కంఠకూపే క్షుత్పిపాసానివృత్తిః ||30||
కూర్మనాడ్యాం స్థైర్యమ్ ||31||
మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనమ్ ||32||
ప్రాతిభాద్వా సర్వమ్ ||33||
హృదయే చిత్తసంవిత్ ||34||
సత్త్వపురుషయోరత్యంతాసంకీర్ణయోః ప్రత్యయావిశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థసంయమాత్ పురుషఙ్ఞానమ్ ||35||
తతః ప్రాతిభశ్రావణవేదనాదర్శాస్వాదవార్తా జాయంతే ||36||
తే సమాధావుపసర్గావ్యుత్థానే సిద్ధయః ||37||
బంధకారణశైథిల్యాత్ ప్రచారసంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః ||38||
ఉదానజయాజ్జలపంకకంటకాదిష్వసంగ ఉత్క్రాంతిశ్చ ||39||
సమానజయాజ్జ్వలనమ్ ||40||
శ్రోత్రాకాశయోః సంబంధసంయమాత్ దివ్యం శ్రోత్రమ్ ||41||
కాయాకాశయోః సంబంధసంయమాత్ లఘుతూలసమాపత్తేశ్చ ఆకాశగమనమ్ ||42||
బహిరకల్పితా వృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః ||43||
స్థూలస్వరూపసూక్ష్మాన్వయార్థవత్త్వసంయమాత్ భూతజయః ||44||
తతో‌உణిమాదిప్రాదుర్భావః కాయసంపత్ తద్ధర్మానభిఘాతశ్చ ||45||
రూపలావణ్యబలవజ్రసంహననత్వాని కాయసంపత్ ||46||
గ్రహణస్వరూపాస్మితాన్వయార్థవత్త్వసంయమాదింద్రియజయః ||47||
తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ ||48||
సత్త్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్ఠాతృత్వం సర్వఙ్ఞాతృత్వంచ ||49||
తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్ ||50||
స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్టప్రసంగాత్ ||51||
క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం ఙ్ఞానమ్ ||52||
జాతిలక్షణదేశైరన్యతానవచ్ఛేదాత్ తుల్యయోస్తతః ప్రతిపత్తిః ||53||
తారకం సర్వవిషయం సర్వథావిషయమక్రమం చేతి వివేకజం ఙ్ఞానమ్ ||54||
సత్త్వపురుషయోః శుద్ధిసామ్యే కైవల్యమ్ ||55||
ఇతి శ్రీపాతంజలయోగదర్శనే విభూతిపాదో నామ తృతీయః పాదః l

 

సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన తరవాతి స్థాయి విభూతి స్థాయి. విభూతిపాదంలో సంయమనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఏమి సాధించగలడో వివరించడం జరిగింది. సూక్ష్మంగా, ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధారణ, ధ్యానంద్వారా మనోలయము (విభూతి) చేయడానికి కృషి చేయాలి. పతంజలి వరుసక్రమంలో ఏ అంశంమీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించేరు. అయితే అతీంద్రయశక్తులే (సిద్ధశక్తులు) సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి అవరోధాలుగానే గుర్తించి, నిరోధించి, ముక్తికోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు పతంజలి.

4 కైవల్య పాదము

 

అథ కైవల్యపాదః |
జన్మౌషధిమంత్రతపస్సమాధిజాః సిద్ధయః ||1||
జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్ ||2||
నిమిత్తమప్రయోజకం ప్రకృతీనాంవరణభేదస్తు తతః క్షేత్రికవత్ ||3||
నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్ ||4||
ప్రవృత్తిభేదే ప్రయోజకం చిత్తమేకమనేకేషామ్ ||5||
తత్ర ధ్యానజమనాశయమ్ ||6||
కర్మాశుక్లాకృష్ణం యోగినః త్రివిధమితరేషామ్ ||7||
తతః తద్విపాకానుగ్ణానామేవాభివ్యక్తిః వాసనానామ్ ||8||
జాతి దేశ కాల వ్యవహితానామప్యాంతర్యాం స్మృతిసంస్కారయోః ఏకరూపత్వాత్ ||9||
తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్ ||10||
హేతుఫలాశ్రయాలంబనైఃసంగృహీతత్వాతేషామభావేతదభావః ||11||
అతీతానాగతం స్వరూపతో‌உస్త్యధ్వభేదాద్ధర్మాణామ్ ||12||
తే వ్యక్తసూక్ష్మాః గుణాత్మానః ||13||
పరిణామైకత్వాత్ వస్తుతత్త్వమ్ ||14||
వస్తుసామ్యే చిత్తభేదాత్తయోర్విభక్తః పంథాః ||15||
న చైకచిత్తతంత్రం చేద్వస్తు తదప్రమాణకం తదా కిం స్యాత్ ||16||
తదుపరాగాపేక్షిత్వాత్ చిత్తస్య వస్తుఙ్ఞాతాఙ్ఞాతమ్ ||17||
సదాఙ్ఞాతాః చిత్తవ్ర్త్తయః తత్ప్రభోః పురుషస్యాపరిణామిత్వాత్ ||18||
న తత్స్వాభాసం దృశ్యత్వాత్ ||19||
ఏక సమయే చోభయానవధారణమ్ ||20||
చిత్తాంతర దృశ్యే బుద్ధిబుద్ధేః అతిప్రసంగః స్మృతిసంకరశ్చ ||21||
చితేరప్రతిసంక్రమాయాః తదాకారాపత్తౌ స్వబుద్ధి సంవేదనమ్ ||22||
ద్రష్టృదృశ్యోపరక్తం చిత్తం సర్వార్థమ్ ||23||
తదసంఖ్యేయ వాసనాభిః చిత్రమపి పరార్థమ్ సంహత్యకారిత్వాత్ ||24||
విశేషదర్శినః ఆత్మభావభావనానివృత్తిః ||25||
తదా వివేకనిమ్నం కైవల్యప్రాగ్భారం చిత్తమ్ ||26||
తచ్ఛిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః ||27||
హానమేషాం క్లేశవదుక్తమ్ ||28||
ప్రసంఖ్యానే‌உప్యకుసీదస్య సర్వథా వివేకఖ్యాతేః ధర్మమేఘస్సమాధిః ||29||
తతః క్లేశకర్మనివృత్తిః ||30||
తదా సర్వావరణమలాపేతస్య ఙ్ఞానస్యానంత్యాత్ ఙ్ఞేయమల్పమ్ ||31||
తతః కృతార్థానం పరిణామక్రమసమాప్తిర్గుణానామ్ ||32||
క్షణప్రతియోగీ పరిణామాపరాంత నిర్గ్రాహ్యః క్రమః ||33||
పురుషార్థశూన్యానాం గుణానాంప్రతిప్రసవః కైవల్యం స్వరూపప్రతిష్ఠా వా చితిశక్తిరితి ||34||
ఇతి పాతంజలయోగదర్శనే కైవల్యపాదో నామ చతుర్థః పాదః |

 

ముందు పాదాలలో వివరించిన విధంగా సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరేవరకు గల పరిణామస్థితిని వివరించేరు కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మవాసనలు మరుజన్మలో ఎలా పునరావృత్తమవుతాయి, సాధకుడు వాటినిగురించిన అవగాహన పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమి చేయాలి అన్న విషయం వివరించడంతో ఈ పాదము ముగుస్తుంది.

పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)

  1. యమము : అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.
  2. నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.
  3. ఆసనం: ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)
  4. ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.
  5. ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
  6. ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత . ఇది సాధన. (ప్రగతి తో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి.
  7. ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.
  8. సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.
ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.
భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంధాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.


No comments:

Post a Comment